BigTV English

Barley Water: వేసవిలో బార్లీ నీరు తీసుకుంటే మాములుగా ఉండదు..

Barley Water: వేసవిలో బార్లీ నీరు తీసుకుంటే మాములుగా ఉండదు..

Barley Water: వేసవిలో బార్లీ నీరు తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. రోజూ క్రమం తప్పకుండా ఈ నీటిని తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియతో పాటు ఇతర పొట్ట సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఇది శరీరానికి చలువను కలిగిస్తుంది. వేసవిలో శరీరం డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.


జీర్ణ సమస్యలు మాయం..

బార్లీ నీరు సహజ శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది వేడిని తట్టుకోవడానికి మరియు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. బార్లీ వాటర్‌లో ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి రోజు ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల మలబద్ధకం తగ్గడమే కాకుండా జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.. ఈ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలు కూడా తొలగిపోతాయి. బార్లీ నీరు శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది మరియు అలసటను తగ్గి్స్తుందంటున్నారు.


డీహ్రడేషన్‌ను నిరోధిస్తుంది..

బార్లీ నీరు ఉధయాన్నే తాగడం వల్ల శరీరం కూడా చాలా హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
దీని కారణంగా వేసవిలో ఈ డ్రింక్స్ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా వ్యాయామాలు రోజూ చేసేవారు దీనిని తాగడం వల్ల అద్భుతమై లాభాలు పొందుతారు. వేసవిలో, మన శరీరం చెమట ద్వారా ఎక్కువ నీరు కోల్పోతుంది. బార్లీ నీరు మన శరీరాన్ని హైడ్రెట్ చేయడంలో సహాయపడుతుంది.

డయాబెటిస్‌కు చెక్..

బార్లీ నీటిలో బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ అధిక మోతాదులో లభిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి లేదా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా డయాబెటిస్‌ కూడా సులభండా తగ్గుతుందని సూచిస్తు్న్నారు.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది..

బార్లీ నీటిలో కేలరీలు తక్కువగా ఉండడమే కాకుండా ఫైబర్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది రోజు తాగితే పొట్ట నిండుగా తయారవుతుంది. అంతేకాకుండా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీని కారణంగా ఆహారం తీసుకోవడం తగ్గిపోయి.. సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలిపారు. అలాగే బార్లీ నీరు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

Also Read: ఇది చాక్లెట్ కాదు గురూ.. టాబ్లెట్.. డోలో 650 జెమ్స్‌లా తినేస్తున్నారా.!

కిడ్నీ‌స్టోన్స్‌ మటాష్..

ఈ నీటిలో మూత్రవిసర్జన పెంచే గుణాలు ఉంటాయి. కావున బార్లీ నీటిని తాగితే.. శరీరంలో విష పదార్థాలు కూడా బయటకు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే కిడ్నీ స్టోన్స్‌ను నివారించడంలో సహాయపడుతుంది. వేసవిలో క్రమం తప్పకుండా బార్లీ నీరు తాగితే శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. అలాగే వేసవితాపం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×