Dolo 650: కరోనా తర్వాత డోలో 650 విపరీతంగా వాడుతున్నారు. నెత్తినొచ్చినా.. జరమెుచ్చినా ఇష్టమున్నట్లు మింగేస్తున్నారు. భారతీయ ప్రజలు ఈ టాబ్లెట్‌ను చాక్లెట్ లాగా తింటున్నారు. జ్వరంతో పాటు, తలనొప్పి, శరీర నొప్పులు, ఇతర చిన్న అనారోగ్యాలకు వైద్యుడిని సంప్రదించకుండానే ఈ మందును తీసుకుంటున్నారు. దీనివల్ల తీవ్రమైన దుష్ర్పభావాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు.
జ్వరమెుచ్చినా, తలనొచ్చినా.. ఒంట్లో కాస్త నలతగా అనిపించినా సరే డోలో 650 టాబ్లెట్ మింగడం భారతీయులకు అలవాటుగా మారిందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత డోలో వాడకం విపరీతంగా పెరిగిపోయిందని చెబుతున్నారు. ఈ టాబ్లెట్ అమ్మకాలు గతంలోకంటే రెట్టింపు అయినట్లు వెల్లడిస్తున్నారు. అయితే, సాధారణ పరిస్థితుల్లో డోలో ప్రమాదకరం కాకాపోయినప్పటికీ అతి వాడకం అనేక అనర్థాలకు దారితీసే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
డోలోతో కలిగే అనర్థాలు
డోలో అవసరం, లేకుండా అధికంగా తీసుకోవడం వల్ల అలర్జీ వస్తుందని వైద్యులు అంటున్నారు. ఇది మాత్రమే కాదు, ఈ టాబ్లెట్‌ను నిరంతరం తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాల సమస్యలు వస్తాయి. అలాగే దీని వల్ల ఒత్తిడి, తీవ్రమైన కాలేయ వైఫల్యానికి కారణమవుతుందని అనేక పరిశోధనల ద్వారా నిరూపించబడింది. ఇది శరీరం లోపల తీవ్రమైన అనారోగ్య లక్షణాలను అణిచివేస్తుంది.. కానీ.. ఇది భవిష్యత్తులో ప్రమాదాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కిడ్నీలపై ఎఫెక్ట్..
డోలో టాబ్లెట్ డాక్టర్ ప్రిస్ర్కిప్షన లేకుండా ఇష్టారీతిన వాడుతున్నారు. డోలో, పారాసిటమాల్ ఇవన్నీ నాన్ స్టెరాయిడల్ యాంటీఇన్ఫ్లమేటరీ, డ్రగ్స్ పరిధిలోకి వస్తాయి. ఈ పెయిన్ కిల్లర్‌కు సంబంధించిన ఏ టాబ్లెట్స్ ఎక్కువగా వాడినా దాని ప్రభావం కిడ్నీలపై పడుతుందంటున్నారు. డాక్టర్ సలహా లేకుండా, అవసరం లేకుండా ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగుతాయని తెలిసినా.. ఆలోచించకుండా తీసుకోవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొంటున్నారు.
జాగ్రత్తలు..
డోలో 650 వైద్యుని సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. గర్బిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, కాలేయం, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే తీసుకోవాలి. ఇతర మందులతో కలిపి తీసుకునే ముందులకి కూడా వైద్యుని సలహా తీసుకోవాలి. డోలో 650 ఒక నొప్పిని మాత్రమే నివారించగలుగుతుంది. ఇది వ్యాధికి చికిత్స చేయదని చెబుతున్నారు.
Also Read: ముఖంపై నల్ల మచ్చలా ? ఇలా చేస్తే.. సమస్య దూరం
వైద్యుల సూచనలు..
డోలో ప్రిస్ర్కిప్షన్ మీద మాత్రమే తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. తేలికపాటి జ్వరానికి మందులు లేకుండా చికిత్స చేయడానికి ప్రయత్నించాలి. తలనొప్పి,శరీర నొప్పికి మరికొన్ని చర్యలు తీసుకోవచ్చు. ఈ టాబ్లెట్ నిరంతరం తీసుకోవడం వల్ల కొంత సమయం తర్వాత అది పనిచేయడం మానేస్తుంది. దీంతో ఆ తర్వాత ఈ మందు తీసుకోకూడదు. ఎటువంటి ప్రభావం చూపకపోయిన టాబ్లెట్ తీసుకోవడం వల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే డోలో 650 టాబ్లెట్ తీసుకునేముందు జాగ్రత్తలు తప్పనిసరిగ తీసుకోవాలంటున్నారు.