BigTV English

Beer Health Benefits : బీరు లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. వేసవిలో దాహం తీరేలా తాగుడే తాగుడు!

Beer Health Benefits : బీరు లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. వేసవిలో దాహం తీరేలా తాగుడే తాగుడు!
Beer Health Benefits
Beer Health Benefits

Beer Health Benefits : బీరులో ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. ఈ పంచాయతీ మొత్తం మనకు తెలిసిందే. ఎందుకంటే సినిమాకి వెళ్లిన ప్రతిసారి ప్రారంభంలో ఈ మాట చెప్పి చంపుతుంటారు. వైద్యులు కూడా ఇదే చెబుతుంటారు. బీర్ సీసా మీద కూడా ఈ మాటే రాసుంటుంది. అయితే ఏదైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే.. అతిగా తీసుకుంటేనే ఆరోగ్యం చెబ్బతింటుంది. బీరు కూడా అంతే.


ఇక మన మందు బాబుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లదే. కారణాలు వెతుక్కొని మరి తాగుతుంటారు. చలి కాలం చల్లగా ఉందని, వానాకాలం వెచ్చదనం కావాలని, వేసవి కాలం ఎండగా ఉందని ఇలా అనేక సాకులతో తాగుతుంటారు. అయితే బీరు బాబుల కోసం వైద్యులు ఓ శుభవార్త చెప్పారు. ఇది మరికొందరికి బ్యాడ్ న్యూస్ కూడా కావచ్చు. అదేంటంటే బీరు లిమిట్‌గా తాగితే ఆరోగ్యనికి మంచిదట. అతిగా సేవిస్తే మాత్రం ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. వైద్యులు బీరు ఎందుకు మంచిది అంటున్నారు. ఎలా మంచి చేస్తుందనే విషయాలపై ఓ లుక్కేయండి.

Also Read : పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది..?


పోర్చుగీసుకు చెందిన ఓ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు బీరు ప్రతీరోజు తాగే వారిపై అధ్యయనం చేశారు. ఈ పరిశోధనల్లో బీరు తాగడం ఆరోగ్యానికి మంచిదనే తేలింది. అంతేకాకుండా పోర్చుగల్‌లోని నోవా యూనివర్సిటీ లిస్బన్‌కు చెందిన శాస్త్రవేత్తలు బీరుతో లాభ నష్టాలపై పరిశోధన జరిపారు.

రాత్రి రోజూ భోజనంతో పాటు బీరు తాగడం వల్ల పురుషులు పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుందని తేల్చారు. ఈ ప్రయోజనం అనేది ఆల్కహాలిక్‌, నాన్‌ ఆల్కహాలిక్‌ రెండు బీర్లలో ఉంటుందట. ఈ పరిశోధనలు 35 మంది సంవత్సరాల పాటు జరిగాయి. ఇందులో 35 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

ఈ పరిశోధనలో పాల్గొన్న వారిని నాలుగు వారాలపాటు ప్రతీరోజు రాత్రి భోజనంతో పాటు 325 మిల్లీ లీటర్ల బీర్‌ తాగాలని తెలిపారు. పరిశోధనలో పాల్గొన్న వారిలో కొందరికి ఆల్కహాలిక్‌ బీరు, మరికొందరికి నాన్‌ ఆల్కహాలిక్‌ బీరు ఇచ్చారు. నాలుగు వారాల తర్వాత పురుషుల మలం, రక్త నమూనాలు సేకరించారు. వీటి ఆధారంగా బీరు తాగడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగుతున్నట్లు తేలింది. అలానే జీర్ణవ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని గుర్తించారు. ఈ అధ్యయనం ఫలితాలు జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో భద్రపరిచారు.

Also Read :  క్యాప్ పెట్టుకుంటే జుట్టు రాలుతుందా..?

ఇప్పుడు సమ్మర్ మొదలైంది కాబట్టి చాలామంది బీరు తాగడానికి ఇంటరెస్ట్ చూపుతుంటారు. కానీ బీరు అతిగా తాగడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని మర్చిపోకండి. కూల్‌గా ఉండే పానీయాలు ఏవైనా శరీరానికి హాని చేస్తాయి. బీర్ తీసుకోవడం వల్ల ఎక్కువగా యూరిన్‌కు వెళ్లాల్సి వస్తుంది. శరీరంలోని ధ్రవాలు మొతాదుకు మించి బయటకు వెళితే డీహైడ్రేట్‌కు గురవుతారు. కాబట్టి లిమిట్‌గా తాగి ఈ సమ్మర్‌లో చిల్ అవ్వండి.

Disclaimer: ఈ కథనాన్ని పలు అధ్యయనాల ఆధారంగా, నిపుణుల సలహా మేరకు అందిస్తున్నాం. దీనిని కేవలం అవగాహనగా మాత్రమే పరిగణించండి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×