BigTV English

Rice Water: గంజి అని చులకన వద్దు.. దీంతో అదిరిపోయే ప్రయోజనాలు

Rice Water: గంజి అని చులకన వద్దు.. దీంతో అదిరిపోయే ప్రయోజనాలు

Rice Water: ప్రస్తుత కాలంలో చాలామంది గంజిని పారబోస్తున్నారు. కానీ మన పూర్వకాలంలో అన్నం వండిన తర్వాత దానిలోని గంజి తీసి అందులో కొద్దిగా ఉప్పు వేసి తాగేవారు. ఈ గంజి తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మన పూర్వీకులు వీటిని తాగడం వల్లే చాలా ఆరోగ్యంగా.. ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండేవారు.. అంటే వారు తీసుకునే ఆహారంలో అంతగా పోషకాలు కలిగి ఉండేవి. కానీ ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే అనేక ఆనారోగ్య సమస్యలు, చిన్న వయసులోనే మరణాలు వస్తున్నాయి. వీటన్నింటికి కారణం మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది.


కాలక్రమేనా గంజిని పనికిరానిదిగా భావించి వృథాగా పారబోస్తున్నారు. గంజిలో అనేక పోషక విలువలు ఉన్నాయి. గంజిలో విటమిన్ బి, ఇ, సి , మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. గంజిలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గంజి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు అతిసారం, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. చిన్న గ్లాసు పలుచటి గంజి తాగితే మీకు ఉపశమనం లభిస్తుంది. ఈ గంజిలోని పిండి పదార్థం బైండింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం తింటున్న అన్నం వేస్ట్ రైస్ మాత్రమే.. దానిలోని విటమిన్స్ మొత్తం గంజిలోకి వెళ్లిపోతాయి. కాబట్టి గంజి తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.

తక్షణ శక్తి లభిస్తుంది


గంజి నీరు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఒక మంచి శక్తి వనరు. దీనిలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. గంజి నీరు వేసవిలో డీహైడ్రేషన్‌ను, అలసటను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే ఇది విరేచనాలు, కడుపు నొప్పి, డయాబెటిస్ వంటి జీర్ణసంబంధిత సమస్యలకు సహాయపడుతుంది. గంజి నీళ్లలో ఎక్కువ మొత్తంలో అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇది శరీరంలోని కండరాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

పిల్లల ఎదుగుదల

అధిక బరువు తగ్గాలనకునే వారు గంజి నీరు తీసుకుంటే మంచి ఫలతం ఉంటుంది. అలాగే ఈ నీరు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. గంజి నీటిలో బి విట‌మిన్లు పుష్కలంగా ఉంటాయి. అందువ‌ల్ల మ‌న శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. విట‌మిన్ల లోపం రాకుండా చూసుకోవ‌చ్చు. పిల్లల‌కు గంజి తాగిస్తే చాలా మంచిది. వారి ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. ప‌సిపిల్లలు పాలు స‌రిగ్గా తాగ‌క‌పోతే వారికి క‌నీసం గంజి నీటిని అయినా తాగించాలి. దాంతో వారికి కావల్సిన ఆహారం అంది శ‌క్తి ల‌భిస్తుంది. పోష‌ణ స‌రిగ్గా ఉంటుంది. విరేచ‌నాలు అయిన వారు గంజి నీటిని తాగితే వెంట‌నే విరేచ‌నాలు త‌గ్గుతాయి. అంతేకాకుండా గంజి నీరు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

Also Read: వేసవిలో బెల్లం నీరు తాగితే ఎం జరుగుతుందో తెలుసా?

గుండె, చర్మం, జుట్టు ఆరోగ్యం

గంజినీరు గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా సహాయపడుతుంది. అలాగే విటమిన్లు, ఇతర యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉన్న గంజి నీరు చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది, గంజిలో అల్లాంటన్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది మొటిమలను నివారిస్తాయి. అలాగే ఎమినో యాసిడ్స్ ఉండటం వల్ల రంధ్రాలను క్లెన్స్ చేసి.. చర్మాన్ని బిగుతుగా మార్చి, కాంప్లెక్షన్‌ని పెంచుతుంది. గంజి నీళ్లతో మీ ముఖాన్ని కడుక్కోవడం వల్ల మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకోవడంతోపాటు మొటిమలు రాకుండా ఉంటాయి. ఇది ముఖంపై ఉన్న నల్ల మచ్చలను పోగొట్టి, చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తుంది

క్రమం తప్పకుండా ప్రతిరోజు గంజి నీటిని తాగితే ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. గంజి నెలసరి నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. గంజిలోని రిలాక్సింగ్ లక్షణాలు కండరాల సంకోచాలను ఉపశమనానికి, బుుతుస్రావం సమయంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. మీరు నెలసరి నొప్పితో బాధపడుతుంటే ఒక కప్పు గోరు వెచ్చని గంజి తాగడం మంచిది.. సో ఇన్ని విన్నాక గంజి తాగడం మర్చిపోకండి..

 

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×