Ancient well: మనుషులకు గత జీవితం గురించి ఆలోచించడం, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవడం రెండే ఆసక్తిగానే ఉంటాయి. అందుకే జ్యోతిష్యం వంటివి చెప్పించుకునే వారి సంఖ్య అధికంగానే ఉంది. అయితే ఒక బావి ఇప్పుడు గత జీవితాన్ని, భవిష్యత్తును కూడా చూపిస్తోందట. అలాగు మరణించిన తమ ప్రియమైన వారిని కూడా చూపిస్తుందట.
ఈ బావి చైనాలో ఉంది. ఈ బావిలోకి తొంగి చూస్తే చాలు… భవిష్యత్తులో ఏమి జరుగుతుందో, మీరు గతంలో ఏం చేశారో, అలాగే మరణించిన మీ ప్రియమైన వారు ఎక్కడున్నారో వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుస్తాయిట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. ఈ బావి మరణించిన తమ ప్రియమైన వారిని కలుసుకునేలా చేస్తోందని చెబుతున్నారు. అందులోకి తొంగి చూస్తే చాలు మీ జీవితం సినిమాలా కనిపిస్తుందట.
మీ బావికి సంబంధించిన రెండు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్లో ఈ రెండు వీడియోలు తెగ షేర్ అవుతున్నాయి. చైనాలోని మౌంట్ జియోహువా లోని యెన్ యాంగ్ అనే బావిలో అక్కడున్న ప్రజలు తమ మరణించిన బంధువులను చూస్తున్నారట. అలాగే భవిష్యత్తులో జరగబోయే దాన్ని కూడా తెలుసుకుంటున్నారని ఈ వీడియోలు చెబుతున్నాయి.
ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆ బావి ఉన్న లొకేషన్ ఎక్కడో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ కథనం నిజమేనా కాదా అని అనుమానం వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి బావి ఒకటి ఉంటే ఇప్పటికే అది ఎంతో వైరల్ గా మారి ఉండేది… ఇప్పటివరకు బయటపడకుండా సీక్రెట్ గా ఉండేది కాదు, కాబట్టి ఇలాంటి బావిని కావాలనే ఎవరో సృష్టించి వీడియోలు తీసి పెట్టారేమోనన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
ఈ బావిలోకి తొంగి చూసి భావోద్వేగాలకు గురవుతున్న వారు వీడియోలో కనిపిస్తున్నారు. మరికొందరు ఆ బావి నిజంగానే అలాంటివి చూపిస్తోందా? లేక చూసినవారికి భ్రాంతులు కలుగుతున్నాయా? అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత నమ్మకాలు, సాంస్కృతిక ప్రభావాలు, మనస్తత్వం, వ్యక్తిత్వం వంటివన్నీ కూడా ఆ వీడియోలో కనిపిస్తున్న మనుషులపై ప్రభావం చూపి ఉంటాయని కొందరు అనుమానిస్తున్నారు.
Also Read: ఈ 4 వస్తువులను మీ ఇంట్లో దక్షిణ దిశలో ఉంచితే.. డబ్బుకు లోటుండదు
అతీంద్రియ శక్తులకు ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు దొరకలేదు. అలాంటిది ఒక బావి మరణించిన వారిని చూపించడం, భవిష్యత్తులో జరగబోయే విషయాలను చెప్పడం వంటివన్నీ సైన్సును నమ్మేవారు కొట్టి పడేస్తున్నారు. ఇది పూర్తిగా అపోహలేనని, కావాలని కొంతమంది వైరల్ చేసేందుకు సృష్టించిన కంటెంట్ అయి ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో మాత్రం ఇంకా తెలియలేదు. మరి మీకు కూడా మీ భవిష్యత్తు తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం చైనాలోని జియోహువా లోని యెన్ యాంగ్‌కు బయల్దేరుపోండి. నిజంగానే అది గతాన్ని చూపిస్తుందా? భవిష్యత్తు చెబుతుందా.. లేదా ఫేకా అనేది తెలుసుకోండి.