Tea Paper Cups: ప్రస్తుత కాలంలో చాలా బయటికి వెలితే టీ తాగుతారు, బయట నలుగురు కలిస్తే టీ తాగడానికి వెళతారు. అక్కడ వాళ్లు పేపర్ కప్‌లో టీ పోసి ఇస్తారు.. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి టీ తాగడం వల్ల పేపర్ కప్‌లోని ప్లాస్టిక్ లేయర్‌లోని రసాయనాలు టీ లోకి కలిసిపోతాయి.. దీంతో శరీరంలోకి ఈ రసాయనాలు చేరిపోయి హార్మోన్ల అసమతుల్యత, కడుపు సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటి అనారోగ్యాలకు దారితీస్తుందని చెబుతున్నారు.
మైక్రోప్లాస్టిక్ కణాలు:
నీటిలో కనుగొన్న పార్టికిల్స్ ఒక మైక్రాన్ అంత పెద్దగా ఉన్నాయి. ఒక వ్యక్తి సుమారుగా రోజుకి మూడు సార్లు ఇలాంటి కప్ లో నుండి టీ, లేదా కాఫీ తాగితే ఆ వ్యక్తి ఒక రోజులో డెబ్భై ఐదు వేల చిన్న మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ ని తీసుకున్నట్లు అవుతుంది. ఈ పార్టికల్స్ మామూలు కంటికి కనబడనంత చిన్నగా ఉంటాయి. ఈ మైక్రో ప్లాస్టిక్స్ హాని కారక లోహాలైన పెలాడియం, క్రోమియం, కాడ్మియం వంటివి కలుస్తాయి. ఇవి రెగ్యులర్ గా లోపలికి వెళ్తుంటే కొంత కాలం తరువాత సీరియస్ హెల్త్ కాంప్లికేషన్స్ రావచ్చు.
రసాయనాలు:
ఈ కప్పులలో బ్లీచ్, ఫ్లోరోసెంట్ రంగులు, పాలిథిలిన్ వంటి హానికర రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యానికి కారణమవుతాయి. పేపర్ కప్పులు చాలా సులభంగా బ్యాక్టీరియాకు నిలయంగా మారతాయి. ముఖ్యంగా తడిసిన తర్వాత ఈ బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. ఈ బ్యాక్టీరియా వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయి.
క్యాన్సర్:
పేపర్ కప్‌లో డిజైన్‌లో ఉపయోగించే రసాయనాలు వేడి టీ ద్వారా శరీరంలోకి చేరి టాక్సిన్స్‌ని పెంచుతాయి. దీని వల్ల డయేరియా, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. కొన్ని పరిశోధనల ప్రకారం, పేపర్ కప్పుల్లో టీ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చ ప్రమాదం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు హేచ్చరిస్తున్నారు. అలాగే ఇది మూత్రపిండాలపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అంతేకాదు, పేపర్ కప్పుల్లో టీ తాగే వారిలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
Also Read: పుల్లపుల్లగా ఉండే చింత చిగురు తింటే.. చింత లేకుండా ఉండవచ్చు
ముఖ్యంగా గర్బిణులు పేపర్ కప్పుల్లో టీ తాగడం మంచిది కాదు. ఎందుకంటే పేపర్ కప్పుల్లో ఉండే రసాయనాలు గర్బిణులకు, లోపల ఉన్న శిశువుకు హాని కలిగిస్తుంది. దీంతో బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు.
పర్యావరణానికి హాని:
పేపర్ కప్పులో పర్యావరణానికి చాలా హానికరం. వీటిని తయారు చేయడానికి చలా చెట్లను నరకాలి. అంతేకాకుండా వీటిని పారవేయడం కూడా చాలా కష్టం అవుతుంది. పేపర్ కప్పులకు బదులుగా వేడి టీ తాగడానికి సిరామిక్ లేదా గాజు కప్పులు, స్టీలు కప్పుడు మంచి ఎంపిక ఇవి వేడిని నిరోధించగలవు, రసాయనాలతో కలుషితం కావు. అలాగే పర్యావరణానికి కూడా ఎలాంటి హాని జరగదు.