BigTV English

JAGAN vs VSR: విజయసాయిరెడ్డిపై జగన్ విసుర్లు.. అందుకే ఎంపీ సీటు

JAGAN vs VSR: విజయసాయిరెడ్డిపై జగన్ విసుర్లు.. అందుకే ఎంపీ సీటు

JAGAN vs VSR: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కంగారుపడుతున్నారా? వైసీపీ హయాంలో ఎలాంటి తప్పులు చేయలేదని  పదేపదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? పనిలో పనిగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై జగన్ ఎందుకు రుసరుసలారు? లిక్కర్ కేసులో లోతుగా విచారణ చేయడానికి ఆయనే కారణమా?  మీడియా ముందుకొచ్చిన ప్రతీసారీ సాయిరెడ్డిపై మండిపడుతున్నారు? గురువారం  కూడా అదే చేశారు మాసీ సీఎం జగన్.


సరిగ్గా 12 గంటల ముందు చెప్పినట్టుగా గురువారం మీడియా ముందుకు వచ్చేశారు మాజీ సీఎం జగన్. ఎప్పుడు మధ్యాహ్నం మూడు తర్వాత ఆయన మీడియా సమావేశం పెట్టేవారు. ఈసారి ఉదయం 11 గంటలకు మొదలుపెట్టారు. అప్‌కోర్సు.. కారణాలు ఏమైనా కావచ్చు. చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేశారు. ఇదే క్రమంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఓ రేంజ్‌లో మండిపడ్డారు జగన్.

లిక్కర్ కేసులో ఇప్పటివరకు సిట్ 33 మందిని నిందితులుగా చేర్చింది. అందులో ఏడెనిమిది మంది అరెస్టు అయ్యారు. వారంతా జగన్ చుట్టూ ఉండే కోర్ టీమ్‌లో కీలక సభ్యులు. తొలుత సాక్షిగా విజయసాయిరెడ్డిని పిలిచారు సిట్ అధికారులు. ఆ తర్వాత నిందితుడిగా ఆయన పేరు చేర్చారు. ఓసారి వీఎస్ఆర్‌ని విచారించారు. ఆయన్ని అరెస్టు చేయలేదని కారణమో ఏమో..  తెలీదుగానీ విజయసాయిరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు జగన్.


చంద్రబాబుకు విజయసాయిరెడ్డి లొంగిపోయారని ఆరోపించారు జగన్. కూటమికి మేలు చేసేందుకు పదవీకాలం ఉండగానే రాజ్యసభకు ఆయన రాజీనామా చేశారన్నారు. వైసీపీకి ఎమ్మెల్యేల బలం లేదని భావించి, రాజ్యసభకు పంపదని తెలిసి రాజీనామా చేశారన్నారు. ప్రలోభాలకు లోనై ఆ సీటును అమ్మేశారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఇచ్చిన స్టేట్‌మెంట్లకు ఏం విలువ ఉంటుందని అన్నారు.

ALSO READ: కూటమి సర్కార్‌పై జగన్ ఫైర్, అంతా చంద్రబాబు చేశారు

ఒకవిధంగా చెప్పాలంటే లిక్కర్ కేసు డొంక కదిలిదంటే కేవలం విజయసాయిరెడ్డి వల్లేనని జగన్ అండ్ కో బలంగా నమ్ముతోంది.  వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రెండుసార్లు  విజయసాయిరెడ్డి మీడియా ముందుకొచ్చారు. జగన్ గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు.

కాకినాడ పోర్టు కేసు విషయంలో ఈడీ ముందుకు విచారణ వచ్చారు సాయిరెడ్డి. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ కేసు వ్యవహారం గురించి కీలక విషయాలు బయటపెట్టారు ఆయన. దీనికి కర్మ, కర్త, క్రియ రాజ్ కసిరెడ్డి అంటూ బయటపెట్టారు. అప్పటివరకు కసిరెడ్డి గురించి ఎవరకీ తెలీదు.

అప్పటి నుంచి మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు వేగం పెరిగింది. లిక్కర్ వ్యవహారం బయటకు రావడం వెనుక సాయిరెడ్డి ప్రధాన కారకుడని భావించింది జగన్ అండ్ కో. అప్పటి నుంచి మీడియా ముందుకొచ్చిన ప్రతీసారీ ఆయన పేరు ఎత్తుకుండా జగన్ తన ప్రెస్‌మీట్ ముగించిన సందర్భం లేదు. ఇప్పుడు అదే చేశారని అంటున్నారు. జగన్ మాటలపై విజయసాయిరెడ్డి రియాక్ట్ అవుతారా?

 

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×