E-Paper
Advertisement

15 నిమిషాల్లోనే..నోట్లో కరిగిపోయే కమ్మని రవ్వ బర్ఫీ చేయండిలా!

15 నిమిషాల్లోనే..నోట్లో కరిగిపోయే కమ్మని రవ్వ బర్ఫీ చేయండిలా!
Advertisement

Rava barfi recipe in Telugu: మన సంప్రదాయంలో ఏ చిన్న వేడుక జరిగినా నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. రకరకాల స్వీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, తక్కువ సమయంలో, ఇంట్లో ఉన్న పదార్థాలతో చేసుకునే మిఠాయిల మజానే వేరు. అలాంటి వాటిలో ‘రవ్వ బర్ఫీ’ ముందుంటుంది. బొంబాయి రవ్వ లేదా సూజీతో తయారు చేసే ఈ బర్ఫీ ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా చేయడం కూడా చాలా ఈజీ. వంట రానివారు కూడా మొదటి సారే చక్కగా చేయగలిగే ఈ సింపుల్ స్వీట్ రెసిపీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

Advertisement

బొంబాయి రవ్వ (సూజీ): 1 కప్పు

పంచదార: 1 కప్పు (మీ రుచికి తగినట్లుగా)

Advertisement

పాలు: అర కప్పు

నెయ్యి: 4-5 స్పూన్లు

పచ్చి కొబ్బరి తురుము: అర కప్పు (రుచిని పెంచడానికి)

యాలకుల పొడి: 1 స్పూన్

డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం ముక్కలు): కొద్దిగా

తయారీ విధానం :

1. మొదటగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో.. రెండు స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కాక, జీడిపప్పు , బాదం ముక్కలను వేసి దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే కడాయిలో మిగిలిన నెయ్యి వేసి, బొంబాయి రవ్వను వేయాలి. రవ్వ మాడిపోకుండా సన్నని మంటపై మంచి సువాసన వచ్చే వరకు సుమారు 5-7 నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి.

2.ఇప్పుడు వేరొక గిన్నెలో పంచదార , అర కప్పు నీరు పోసి మరిగించాలి. పంచదార పూర్తిగా కరిగి కొద్దిగా తీగ పాకం (లేదా పంచదార కరిగి నీరు మరిగే దశ) వచ్చే వరకు ఉంచాలి. దీనిలో.. ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును వేసి కలపాలి.

3. ఇప్పుడు మంటను తక్కువగా ఉంచి, వేయించి పెట్టుకున్న రవ్వను కొద్ది కొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి. రవ్వ ఆ పాకాన్ని పీల్చుకుని గట్టి పడే వరకు కలుపుతూ ఉండాలి.

4. ఈ మిశ్రమంలో అర కప్పు పాలు , యాలకుల పొడి వేయాలి. పాలు వేయడం వల్ల రవ్వ బర్ఫీ గట్టి పడి పోకుండా చాలా మృదువుగా, నోట్లో కరిగిపోయేలా వస్తుంది. మిశ్రమం అంతా దగ్గరికి వచ్చేసి కడాయికి అతుక్కోకుండా వచ్చే వరకు మరో 3-4 నిమిషాలు ఉడికించాలి. చివరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు కలపాలి.

5. ఒక పళ్ళెం లేదా ట్రేకి కొద్దిగా నెయ్యి రాసి, తయారు చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని అందులో సమానంగా సర్దాలి. పైన కొద్దిగా బాదం, పిస్తా ముక్కలు చల్లి గరిటెతో సమానంగా చేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మీ ఇష్టమైన ఆకారంలో కట్ చేసుకోవాలి. అంతే.. గుమగుమలాడే కమ్మని రవ్వ బర్ఫీ వడ్డించడానికి సిద్ధం!

ఈ రవ్వ బర్ఫీని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే.. వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది. పిల్లలు ఎంతో.. ఇష్టంగా తినే ఈ ఆరోగ్యకరమైన స్వీట్లను మీ ఇంట్లో పండగలకు లేదా ప్రత్యేక సందర్భాలలో తప్పకుండా ట్రై చేయండి!

Related News

అస్సలు చేదు రాకుండా..కరకరలాడే కాకరకాయ వేపుడు!

రెస్టారెంట్ స్టైల్ చికెన్ వేపుడు..ఇలా చేసారంటే టేస్ట్ అదిరిపోద్ది

39 ఏళ్ల వయసులోనూ 22 ఏళ్ల బయోలాజికల్ ఏజ్ సాధించిన మహిళ.. యంగ్ లుక్స్ కోసం ఆమె ఏం చేసిందంటే

ఒక్కసారి ఇలా షెజ్‌వాన్ చికెన్ నూడుల్స్ చేసి చూడండి.. రుచి మామూలుగా ఉండదు!

పురుషులు ఎప్పటికీ బయటికి చెప్పరు.. రిలేషన్‌షిప్‌లో ఈ 9 విషయాలు కోరుకుంటారు

పైకి నవ్వుతున్నా లోపల ఆందోళనా.. ఈ 5 సంకేతాలు మీలో ఉంటే బీ కేర్ ఫుల్!

ఘుమఘుమలాడే రెస్టారెంట్ స్టైల్ మటన్ పెప్పర్ మసాలా.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు!

Big Stories

Advertisement
×