మన శరీరంలో ముఖ్యమైన భాగాల్లో గుండె ఒకటి. మన శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండేలా రక్తాన్ని పోషకాలను అందేలా అందుకునేలా చేసేది గుండె. మనం తినే ఆహారంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా గుండె వ్యాధులు, గుండెపోటు వచ్చేస్తుంది. కాబట్టి గుండెను కాపాడుకోవడం కోసం ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. గుండెకు మేలు చేసే సూపర్ ఫుడ్‌లను ఆహారంలో భాగం చేసుకోవాలి. నలభై ఏళ్ల తరువాత ఎక్కువ మంది గుండె జబ్బులు బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ముందు నుంచే గుండెకు మేలు చేసే ఆహారాలను తినడం అలవాటుగా మార్చుకోవాలి. గుండె కోసం ఎలాంటి ఆహారాలు మీ భోజనంలో ఉండాలో తెలుసుకోండి. వీటిని ఈ రోజు నుంచే తినడం మొదలుపెట్టండి.
డార్క్ చాక్లెట్
సాధారణ చాక్లెట్‌కు డార్క్ చాక్లెట్‌కు చాలా తేడా ఉంటుంది. సాధారణ చాక్లెట్ చాలా తీపిగా ఉంటుంది. కానీ డార్క్ చాక్లెట్ చిన్నపాటి చేదును కలిగి ఉంటుంది. అలాగే రంగు కూడా చాలా ముదురుగా ఉంటుంది. చాక్లెట్ తినమన్నారు కదా అని సాధారణ చాక్లెట్లు కిలోల కొద్దీ తినేయకండి. ప్రతిరోజూ డార్క్ చాక్లెట్ చిన్న ముక్క తినండి చాలు. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది మీ శరీరం గుండె చుట్టూ ఉండే టాక్సిన్లను తొలగించి గుండెను సురక్షితంగా ఉండేలా చూస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటుంది.
తృణధాన్యాలు
బయట పాలిష్ చేసిన ధాన్యాల కన్నా ముడిగా దొరికే తృణధాన్యాలను తినడం మంచిది. ఇవి విటమిన్లతో, ఖనిజాలతో నిండి ఉంటాయి. ఫైబర్‌లు, ప్రోటీన్‌లు, కార్బోహైడ్రేట్‌లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రెష్‌గా, హెల్తీగా ఉండేలా చేస్తాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. శుద్ధి చేసిన ఆహారాలు లేదా శుద్ధి చేసిన ధాన్యాలు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది అదే తృణధాన్యాలు తినడం వల్ల గుండె గట్టిగా ఉంటుంది. బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా, గోధుమలు, జొన్నలు, బార్లీ గింజలు వంటివి.
చేపలు
సాధారణంగా చికెన్, మటన్ వంటివి కొవ్వు పడితే తినకూడదని చెబుతారు. అది నిజమే ఎందుకంటే వాటిలోని కొవ్వు మన శరీరానికి గుండెకు హాని కలిగిస్తుంది. కానీ చేపల్లోని కొవ్వు మాత్రం గుండెకు ఎంతో రక్షణగా నిలుస్తుంది. కాబట్టి సాల్మన్‌తోనా వంటి కొవ్వు పట్టిన చేపలను తినడం అలవాటు చేసుకోవాలి. వీటిలో ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మనం శరీరానికి అత్యవసరం ఆరోగ్యకరమైన కొవ్వులు. మన శరీరం విటమిన్లను గ్రహించడంలో సహాయపడుతుంది. అలాగే గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అప్పుడప్పుడు ఇలాంటి చాపలు తినేందుకు ప్రయత్నించండి.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ కాస్త ఖరీదైనది. కాబట్టి నిత్యం వాడలేరు. కానీ అప్పుడప్పుడు ఆలివ్ ఆయిల్ ను తినడం అలవాటుm చేసుకోండి. ముఖ్యంగా రోజుకు ఒక స్పూను ఆలివ్ ఆయిల్ తినేలా జాగ్రత్త పడండి. సలాడ్ పై ఆలివ్ ఆయిల్ చల్లుకొని తినండి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇతర వంట నూనెలు గుండె వ్యాధులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయి. కానీ ఆలివ్ నూనె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండె సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి రోజుకు ఒక స్పూన్ ఆలివ్ ను తినేందుకు ప్రయత్నించండి.
Also Read: స్మోక్ చేస్తున్నారా? ఇలా చేస్తే మీరు కోటీశ్వరులు కావచ్చు!