E-Paper
Advertisement

Horoscope Today January 24th: ఆ రాశి వారికి ఈరోజు అకస్మిక ధనయోగం నూతన వాహన యోగం ఉన్నాయి

Horoscope Today January 24th: ఆ రాశి వారికి ఈరోజు అకస్మిక ధనయోగం నూతన వాహన యోగం ఉన్నాయి
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 24న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారు ఈరోజు చిన్ననాటి  మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

Advertisement

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు.

Advertisement

కర్కాటక రాశి : ఈ రాశి వారు ఈరోజు దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

సింహ రాశి : ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. దాయాదులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు కలుగుతాయి.

కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు మిత్రుల కలయిక మరింత ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సన్నిహితులతో ఇంట్లో సఖ్యతగా వ్యవహరిస్తారు.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులలో అధిక శ్రమతో ఫలితాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.

మకర రాశి : ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్థులకు స్థానచలన సూచనలు ఉన్నవి.

మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×