Nindu Noorella Saavasam Serial Today Episode : అమర్ కిందకు వచ్చి నిర్మలను పిలిచి తాను మిస్సమ్మ బయటకు వెళ్తున్నామని.. ఏమైనా పనులుంటే మనోహరికి చెప్పమని అంటాడు. వెనక నుంచి వచ్చిన మనోహరి షాక్ అవుతుంది. మిస్సమ్మను తీసుకుని వెళ్లడం ఏంటని మనసులో అనుకుంటుంది. ఇంతలో అమర్, మిస్సమ్మను పిలుస్తాడు. చెప్పండి అంటూ మిస్సమ్మ రాగానే ఇంట్లో పనులు పక్కన పెట్టేయ్ మనం బయటకు వెళ్తున్నాం అని చెప్తాడు అమర్. సరేనండి పదండి అంటుంది. దీంతో అమర్.. ఇలా కాదని నువ్వు ఎఫ్‌ఎం కు వెళ్లేటప్పుడు ఎలా వెళ్లేదానివి అంటాడు. నేను నా ఫ్రెండ్‌తో స్కూటీ మీద వెళ్లే దాన్ని అంటుంది. దీంతో నిర్మల ఎలా వెళ్లే దానివి అంటే నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకునే దానివో అలా అని నిర్మల చెప్పగానే.. చుడిదార్‌లో వెళ్లేదాన్ని అంటూ డ్రెస్ వేసుకుని వస్తానని పైకి వెళ్తూ ఇంతకు ముందు అమర్ ఒక ఆపరేషన్ కోసం తీసుకెళ్లిన విషయం గుర్తు చేసుకుంటుంది మిస్సమ్మ. అమర్ దగ్గరకు వెళ్లి నేను రానండి అంటుంది.
దీంతో శివరాం.. మిస్సమ్మ, అమర్ ఏం అడిగాడో నీకు అర్థం అయ్యే సమాధానం చెప్పావా..? అంటాడు. ఆయన మాటలు అర్తం అయ్యాయి.. ఆయన మాటల్లోని పరమార్థం అర్తం అయింది అంటుంది మిస్సమ్మ. దీంతో నిర్మల.. మిస్సమ్మ, అమర్ నిన్ను బయటకు తీసుకెళ్లడానికి బట్టలు మార్చుకోమంటున్నాడు. అది నాకు అర్తం అయ్యింది అత్తయ్యా మీకే అర్థం కాలేదు అంటుంది మిస్సమ్మ. ఇంతకీ నీకేం అర్థం అయింది మిస్సమ్మ అంటూ శివరాం అడగ్గానే.. బయట ఇంకేదో షూట్ అవుట్ ప్లాన్ చేసి ఉంటారు. నాకు పరిగెత్తడానికి వీలుగా ఉండటానికి నన్ను డ్రెస్ మార్చుకోమంటున్నారు అని అప్పుడంటే నేనేదో మోసపోయా.. ఇంకోసారి అలా మోసపోను అంటుంది. దీంతో ఏయ్ లూజ్ నేను తీసుకెళ్తుంది అందుకు కాదు అంటాడు అమర్. నీ మీద నాకు నమ్మకం లేదు అంటుంది మిస్సమ్మ. దీంతో నిర్మల, శివరాం ఇద్దరూ కలిసి వెళ్లమని చెప్తారు. అయినా వినదు మిస్సమ్మ.. అమర్ మాత్రం ఇంకో రెండు నిమిషాల్లో రెడీ అయ్యి రావాలని చెప్పి బయటకు వెళ్తాడు.
మనోహరి, అమర్ వెనకాలే బయటకు వెళ్తుంది. బయటకు వెళ్లిన అమర్ ఎవరికో ఫోన్ చేస్తుంటాడు. గార్డెన్‌లో ఉన్న ఆరు ఏమైంది ఈయనకు.. పొద్దున్నేమో పిల్లల చేత వర్కవుట్ చేయించారు. ఇప్పుడు మిస్సమ్మను చుడీదార్ వేసుకుని రమ్మంటున్నారు.. మిస్సమ్మేమో భయపడుతుంది. అని ఆలోచిస్తుంది. ఇంతలో మిస్సమ్మ వచ్చి నేను రెడీ అండి వెళ్దాం అంటుంది. అమర్ బైక్ దగ్గరకు వెళ్లగానే.. మనం ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నామా..? అంటూ హ్యాపీగా ఫీలవుతుంది. వెంటనే.. వెళ్లేది షూట్ అవుట్ కు అయినప్పుడు సంతోషం దేనికి అనుకుంటూ బాధతో నిలబడిపోతుంది. వెంటనే అమర్ బైక్ ఎక్కు అనగానే బాధగానే బైక్ ఎక్కుతుంది మిస్సమ్మ. అమర్ ఎమోషనల్ గా ఫీలవుతూ ఆరును గుర్తు చేసుకుంటాడు. మిస్సమ్మ వెళ్దామా అండి అనగానే అమర్ బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోతాడు.
వాళ్లు వెళ్లిపోయాక.. ఆరు, గుప్తను పిలుస్తుంది. గుప్త పలకపోవడంతో యముడిని పిలుస్తుంది. ఆరు పిలుపునకు యమలోకంలో ఉన్న యముడు ఇరిటేటింగ్ గా ఫీలవుతూ గుప్తను తిడతాడు. దీంతో గుప్త మీరు కూడా ప్రయత్నించి విఫలం అయ్యారు కదా అంటాడు. దీంతో యముడు కోపంగా ఈ యమధర్మరాజుల వారికే ఎదురు చెప్తున్నావా..? నీవు చేసిన ఈ తప్పిదమునకు నిన్ను వెంటనే ఈ గుప్తుల బాధ్యత నుంచి తొలగించి నిన్ను ద్వార పాలకుడిగా నిమిస్తున్నాను అని తిడుతుండగానే.. చిత్రగుప్తుడు వస్తాడు. నా శిక్షణలో పెరిగిన ఈ చిత్రవిచిత్రగుప్తుడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. ఈతని తరపున నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను ప్రభు.. అంటాడు. నేను తక్షణమే భూలోకం వెళ్లి ఆ బాలికను తీసుకుని వచ్చెదను.. అంటాడు. దీంతో అయ్యా చిత్రగుప్తుల వారు తొందర పడి మాట ఇవ్వకండి అని హెచ్చరిస్తాడు గుప్త. ఇంతలో యముడు, చిత్రగుప్తుడిని భూలోకం వెళ్లమని చెప్తాడు.
మిస్సమ్మను కొద్దిదూరం తీసుకెళ్లాక ఒక దగ్గర ఆపేస్తాడు. బైక్ దిగిన మిస్సమ్మ ఇక్కడేనా షూటౌట్ నాకు గన్ అంటే భయం లేదు.. కానీ అందులో ఉన్న బుల్లెట్ అంటేనే భయం అంటూ ఏడుస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?