నెయ్యిని, బెల్లాన్ని కలిపి తినే వారి సంఖ్య చాలా తక్కువ. నిజానికి భోజనం ముగించాక చిన్న బెల్లం ముక్కను తీసుకొని నెయ్యిలో ముంచి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. ఇలా ప్రతిరోజూ తినడం వల్ల ఏం జరుగుతుందో పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
పోషకాల పవర్ హౌస్
నెయ్యి, బెల్లం.. ఈ రెండూ కూడా విడివిడిగా ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. బెల్లం ముక్కను నెయ్యిలో ముంచుకుని తినడం వల్ల అది పోషకాల పవర్ హౌస్‌గా మారుతుంది. జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ ఏ, విటమిన్ కె, విటమిన్ ఈ వంటి కరిగే విటమిన్లు ఎన్నో ఇందులో ఉంటాయి. అలాగే పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, కాల్షియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి.
భోజనం చేశాక ప్రతిరోజూ చిన్న బెల్లం ముక్కను నెయ్యిలో ముంచుకుని తినడం వల్ల జీర్ణక్రియ సులువు అవుతుంది. నెయ్యి జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపిస్తుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అలాగే పేగుల్లోని లైనింగ్ ను కూడా ఇది కాపాడుతుంది. ఇక బెల్లం విషయానికి వస్తే ఇది జీవక్రియను పెంచడమే కాదు జీవక్రియలో వ్యర్ధాలను తొలగిపోయేలా చేస్తుంది. మీరు భారీ భోజనాలు చేసినప్పుడు కచ్చితంగా నెయ్యిలో బెల్లం ముక్కను ముంచి తినడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే భారీ భోజనాల వల్ల కలిగే పొట్ట అసౌకర్యం, పొట్ట ఉబ్బరం అంటే సమస్యలను ఇది తగ్గిస్తుంది.
బెల్లం తినడం వల్ల తక్షణ శక్తి వస్తుంది. ఎందుకంటే బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి శక్తి వెంటనే విడుదలవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు కారణం కాకుండా ఉంటుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కాబట్టి భోజనం తర్వాత కచ్చితంగా నెయ్యిలో బెల్లం ముంచుకుని తినేందుకు ప్రయత్నించండి. భోజనం తిన్నాక మీరు శక్తివంతంగా తయారవుతారు. నీరసం బారిన పడరు.
బెల్లం తినడం వల్ల కాలేయంలో ఉన్న విషయాలు బయటకు వస్తాయి. రక్తం కూడా శుద్ధి అవుతుంది. ఇది సహజ స్వీట్‌నర్ గా పనిచేస్తుంది. శ్వాసకోశ వ్యవస్థలో ఉన్న శ్లేష్మాన్ని కూడా ఇది తొలగిస్తుంది. ఇక పేగులను నిర్విషీకరణ చేసి అంటే పేగుల్లో ఉన్న వ్యర్ధాలను తొలగించి వాటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కీళ్ల నొప్పులు తగ్గుతాయి
కీళ్ల నొప్పులు ఉన్నవారు కచ్చితంగా తినాల్సిన వాటిల్లో బెల్లం నెయ్యి ఒకటి. నెయ్యిలో బెల్లం ముంచుకుని తింటే ఎంతో ఆరోగ్యం. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులు బారిన పడకుండా కాపాడతాయి. మెగ్నీషియం, పొటాషియం అంటే ఖనిజాలు కూడా వీటిలో అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో ముందుంటాయి.
ఆయుర్వేదం ప్రకారం నెయ్యిలో బెల్లం ముంచుకుని తినడం అన్ని విధాలా మంచిదే. ఇది శరీరంలో ఉన్న వాత పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది .
గుండె ఆరోగ్యానికి నెయ్యిలో బెల్లం ముంచుకుని తినడం చాలా అవసరం. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎన్నో ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. నెయ్యిలో నెయ్యి తినడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే గుండెకు అవసరమైన మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇక బెల్లంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా నెయ్యి బెల్లం ఎంతో ఉపయోగపడతాయి. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇక బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఈ రెండూ కూడా శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే శక్తిని కూడా శరీరానికి అందిస్తాయి.
ప్రతిరోజు మధ్యాహ్న భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క తీసుకొని నెయ్యిలో ముంచి దాన్ని తినేందుకు ప్రయత్నించండి. ఇలా మీరు రెండు వారాలు తింటే చాలు. మీలోనే మంచి మార్పులు మీకు తెలుస్తాయి. ఇది అన్ని విధాలా ఆరోగ్యానికి మంచి చేస్తుంది.