Akash Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో పూరి కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అసలు ఒక హీరో అంటే ఎలా ఉండాలి అనేది ఎంతోమంది డైరెక్టర్స్ చూపించారు. హీరో అంటే అలానే ఎందుకు ఉండాలి.. పోకిరిగా ఉండకూడదా.. ? అనుకున్నాడు పూరి. అలానే తన సినిమాల్లో నటించే హీరోలు నీట్ గా ఉండరు. క్లాస్ లుక్ తో ఉండరు. జాబ్ చేయరు. అమ్మాయిల్లను ఏడిపిస్తారు.. అసలు ఇవన్నీ చేసేవాడిని హీరో అంటారా అంటే.. అంటారు పూరి హీరోలు ఇలానే ఉంటారు.
ఇండస్ట్రీకి రావాలనే పట్టుదలతో చదివిన సర్టిఫికెట్స్ అన్నికాల్చిపడేసిన ధైర్యం పూరి జగన్నాథ్ ది. ఎంత కష్టం వచ్చినా లేచి నిలబడాలి అని చెప్పుకొస్తూ ఉంటాడు. అలానే పూరి పని అయిపోయింది అన్నప్పుడల్లా.. ఎగిసే కెరటంలా దూసుకు వస్తూ ఉంటాడు. అలా చాలా గ్యాప్ తరువాత ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న పూరి లైగర్ తో డీలా పడ్డాడు.
సరే డబుల్ ఇస్మార్ట్ తోనైనా మంచి విజయాన్ని అందుకోవాలనుకున్నాడు. అది కూడా మిస్ ఫైర్ అయ్యింది. అయినా పూరిలో కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం కథలను రాసే పనిలో ఉన్న పూరి త్వరలోనే బౌన్స్ బ్యాక్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు.
ఇదంతా పక్కన పెడితే.. పూరి తన కొడుకు ఆకాష్ ను హీరోగా నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఆకాష్ కోసం నిర్మాతగా మారాడు. డైరెక్టర్ గా మంచి కథ ఇచ్చాడు. వేరే డైరెక్టర్స్ తో కూడా ఆకాష్ ఎంట్రీ ఇప్పించాడు. ఇవేమి పూరి కొడుకును హీరోగా నిలబెట్టలేకపోయాయి. కానీ, పరాజయాలను లెక్కచేయని తండ్రిని చూసిన ఆకాష్ కూడా వెనుతిరగకుండా ఇండస్ట్రీపై యుద్ధం ప్రకటించాడు. హిట్ కొట్టేవరకు సినిమాలు తీస్తూనే ఉంటానని చెప్పుకొచ్చాడు.
Allu Arjun: అంత జరిగినా బుద్ది రాలేదారా.. సంధ్య థియేటర్ వద్ద బన్నీ ఫ్యాన్స్ మరోసారి రచ్చ
ఈ మధ్యనే ఆకాష్ పూరి పేరు మార్చుకొని ఆకాష్ జగన్నాథ్ గా మారాడు. ఇంటి పేరు కలిసి రావడం లేదని, తన పేరు వెనుక తండ్రి పేరును యాడ్ చేసుకున్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ఆకాష్ తాజాగా తన గొప్ప మనసు చాటుకున్నాడు. సాయం కోసం ఎదురుచూస్తున్న సీనియర్ నటికి ఆర్థిక సాయం అందించి అందరి మనసులను గెలుచుకున్నాడు. గత కొన్నేళ్లుగా నటి పావలా శ్యామల వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే.
లేడీ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న పావలా శ్యామల .. అనారోగ్యంతో మంచాన పడింది. తినడానికి కూడా డబ్బులు లేని దీన స్టితిలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి మంచి మనసు ఉన్న హీరోలు నిత్యం ఆడుకుంటూ వస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, సాయి ధరమ్ తేజ్.. ఇలా ఆమెకు సహాయం అందిస్తూ వచ్చారు. ఇక గత కొన్నిరోజుల క్రితం పావలా శ్యామల తన బాధ గురించి ఒక వీడియోలో చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ తనకు సహాయం చేస్తుందా.. ? లేకపోతే చచ్చిపోవాలా.. ? అని తన ఆవేదనను వెళ్లగక్కింది.
ఇక పావలా శ్యామల వీడియో చూసిన ఆకాష్.. ఆమె ఇంటికి వెళ్లి.. స్వయంగా తన చేతులతోనే రూ. లక్ష ఆర్థిక సాయం అందించాడు. ఇక ఆకాష్ చేసిన సహాయానికి పావలా శ్యామల కృతజ్ఞతలు తెలిపింది. ఆకాష్ తల్లి లావణ్యతో కూడా ఆమె వీడియో లో మాట్లాడింది. ఆకాష్ ఎప్పుడు చల్లగా ఉండాలని దీవించింది. పూరి సినిమాల ద్వారానే పావలా శ్యామలకు మంచి పేరు వచ్చింది. ఆంధ్రావాలా, గోలీమార్ ఈ సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. ఇక ఆకాష్ చేసిన మంచి పనికి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
A Generous Gesture from Young Hero @AkashJagannadh ❤️
Hero #AkashJagannadh personally met senior actress #PavalaSymala Garu and donated 1 lakh, promising to stand in support 👏 pic.twitter.com/pKRoYIO7ae
— Suresh PRO (@SureshPRO_) January 18, 2025