BigTV English
Advertisement

Garlic for Health & Beauty: వెల్లుల్లితో అందంతో పాటు ఆరోగ్యం కూడా..!

Garlic for Health & Beauty: వెల్లుల్లితో అందంతో పాటు ఆరోగ్యం కూడా..!

Raw Garlic Benefits for Health and Beauty: వంటింట్లో దొరికే వెల్లుల్లితో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రతీ వంటలోనూ వెల్లుల్లిని వాడుతుంటారు. తరచూ ఏదో ఒక విధంగా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు చెబుతుంటారు. వెల్లుల్లిలో ఉండే జింక్, మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం వంటి ఖనిజాలు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అంతేకాకుండా వెల్లుల్లిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా సి, ఫోలేట్, కె, నియాసిన్, థయామిన్ వంటివి అత్యధికంగా వెల్లుల్లిలో ఉంటాయి. పొట్టను శుభ్రపరచడంలో వెల్లుల్లి ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేకాదు వెల్లుల్లితో వెయ్యి ప్రయోజనాలు ఉంటాయి. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.


ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ క్లీన్ అవుతాయి. వెల్లుల్లిని తరచూ తినడం వల్ల కడుపుకు సంబంధించిన ఎటువంటి సమస్యలనైనా తగ్గిస్తుంది. తరచూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక వెల్లుల్లిని తినడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. అలా తినలేని వారు. వెల్లుల్లితో, తేనెను కలిపిన మిశ్రమాన్ని అయినా తీసుకోవడం మంచిది. గుండెకు సంబంధించిన ఎటువంటి సమస్యలను అయినా వెల్లుల్లితో చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలను కూడా వెల్లుల్లి తగ్గిస్తుంది.

శ్వాసకోశ సంబంధాలతో బాధపడుతున్న వారికి వెల్లుల్లి ఓ ఔషధంలా పనిచేస్తుంది. వెల్లుల్లిని తినడం వల్ల మలబద్ధకం, జీర్ణక్రియ వ్యవస్థలో సమస్యలు, పంటి నొప్పి వంటి ఎటువంటి సమస్యలకైనా చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా జలుబు, దగ్గు, ఆస్తమా, న్యుమోనియా, వంటి సమస్యలకు కూడా వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది.


Also Read: Health Tips: ఒంట్లో వేడితో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ ట్రై చేయండి

వెల్లుల్లితో ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా కాపాడుకోవచ్చు. వెల్లుల్లిలో ఉంటే మినరల్స్, విటమిన్స్, పొటాషియం, కాల్షియం, జింక్, మెగ్నీషియం, సెలీనియం, ఐయోడిన్, ఐరన్ వంటి ఖనిజాలు చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచేందుకు సహకరిస్తాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై మచ్చలను పొగొట్టేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది. ఇక చర్మాన్ని యవ్వనంగా కూడా ఉంచేందుకు వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి.

Related News

Let them go: వెళ్లేవాళ్లని వెళ్లనివ్వండి బాసూ.. లేదంటే మనసును బాధపెట్టినవాళ్లవుతారు!

Foot Massage: ఏంటీ.. త‌ర‌చూ ఫుట్ మ‌సాజ్ చేసుకుంటే ఇన్ని లాభాలా!

Hair Thinning: జుట్టు పలచబడుతోందా ? అయితే ఈ ఆయిల్స్ వాడండి !

Jamun Seeds Powder: నేరేడు విత్త‌నాల పొడిని ఇలా వాడారంటే.. ఎలాంటి రోగమైన పారిపోవాల్సిందే!

Perfume in car: కారులో పెర్ఫ్యూమ్ వాడడం ఎంత ప్రమాదకరమో తెలిస్తే ఇప్పుడే తీసి పడేస్తారు

Water: రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగే.. అలవాటు మీలో ఉందా ?

Blue number Plates: ఏ వాహనాలకు బ్లూ నెంబర్ ప్లేట్లు ఉంటాయి? 99 శాతం మందికి తెలియదు

Parenting Tips: మీ పిల్లలు అన్నింట్లో ముందుండాలా ? ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వండి !

Big Stories

×