OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో కొరియన్ సినిమాలకు ఇప్పుడు క్రేజ్ బాగా పెరిగింది. కొరియన్ వెబ్ సిరీస్ ల తో పాటు సినిమాలు కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లో హల్చల్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఇవి ఎలా ఉంటాయో కూడా తెలియని మన ప్రేక్షకులు, ఇప్పుడు ఆ సినిమాలోని నటుల పేర్లను కూడా చెప్పగలుగుతున్నారు. ప్రస్తుతం ఓటీటీలో ఒక మంచి కంటెంట్ ఉన్న ఒక కొరియన్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
రెండు ఓటిటిలలో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “ద ప్రిన్సెస్ మ్యాచ్ మేకర్” (The Princess match maker). ఈ మూవీలో కరువు లో ఉన్న రాజ్యానికి కష్టాలు తీరాలంటే తన కూతురికి పెళ్లి చేయాలని ఒక జ్యోతిష్యుడు చెప్తాడు. ఆమెకు స్వయంవరం కూడా పెడతారు. హీరోయిన్ స్వయంవరం చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో Amazon prime video నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఒక రాజ్యంలో కరువు కాటకాలు ఎక్కువగా వస్తాయి. కరువు ఎలా తీరుతుంది అని రాజు ఆలోచిస్తుండగా, జ్యోతిష్యుడు వచ్చి రాజుకు ఒక విషయం చెప్తాడు. మీకున్న పిల్లలకు అందరికీ పెళ్లిళ్లు చేశారు. ఎనిమిదవ పుత్రికకు ఇంకా వివాహం జరిపించలేదు. ఆమెకు వివాహం జరిపిస్తే ఈ కరువు తొలిగే అవకాశం ఉందని జ్యోతిష్యుడు రాజుకు తెలియజేస్తాడు. రాజు కూడా అతని మాటలను విశ్వసిస్తాడు. ఎందుకంటే ఆ ఎనిమిదవ కూతురు ఎవరో కాదు. జ్యోతిష్యుడు చెప్పడంతో ఆమె తల్లిని పెళ్లి చేసుకుని ఉంటాడు రాజు. ఆమె ఈ రాజ్యంలో ఒక పనిమనిషిగా ఉండేది. ఆమెను పెళ్లి చేసుకున్నాక హీరోయిన్ పుడుతుంది. హీరోయిన్ పుట్టాక ఆమె తల్లి చనిపోతుంది. హీరోయిన్ జాతకం అంతగా మంచిగా లేదేమో అని ఆమెను దూరంగా ఉంచి పెంచుతూ ఉంటాడు రాజు.
ఒకరోజు రాజుకు అనారోగ్యం ఉండటంతో, కూతుర్ని దగ్గరికి తెచ్చుకుంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది అంటూ జ్యోతిష్యుడు చెప్పడంతో, ఆమెను తన దగ్గరికి తెచ్చుకుంటాడు. ఆ తర్వాత రాజుకు ఆరోగ్యం బాగవుతుంది. జ్యోతిష్యుడు మాటలు విశ్వసించి కూతురికి స్వయంవరం పెడతాడు. చాలామంది పోటీ పడగా అందులో చివరికి నలుగురు ఎంపిక అవుతారు. వారిలో ఒకరిని చేసుకోవాల్సి వస్తుంది. హీరోయిన్ రహస్యంగా వాళ్లు ఎలాంటి వారో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈమె ప్రయత్నంలో కొన్ని అనుకొని సంఘటనలు ఎదురవుతాయి. చివరికి హీరోయిన్ ఆ నలుగురిలో ఒకరిని పెళ్లి చేసుకుంటుందా? హీరోయిన్ ఎవరినైనా ప్రేమిస్తుందా? ఆమె వల్ల కరువు కాటకాలు తొలగిపోతాయా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కొరియన్ మూవీని చూడాల్సిందే.