Onions: ఉల్లిపాయలు మన వంటల్లో ప్రధాన భాగంగా ఉంటాయి. దాదాపు ప్రతి భోజనం ప్రారంభం ఉల్లిపాయతోనే జరుగుతుంది. కానీ నిల్వ ఉంచిన ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు కనిపించినప్పుడు చాలా మంది పెద్దగా పట్టించుకోరు. చెక్క తొలగించి వాడేస్తే సరిపోతుందనుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద ప్రమాదం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నల్ల మచ్చలు ఉన్న ఉల్లిపాయలు నిజానికి ఫంగస్ వల్ల కలుగుతాయి. ఇది ‘బ్లాక్ మోల్డ్’ లేదా నల్లటి ఫంగస్ అంటారు. ఇది సాధారణంగా తడి, వేడి, చలి వాతావరణంలో వేగంగా పెరుగుతుంది. నిల్వలు సరిగా లేని చోట్ల ఉల్లిపాయలపై ఈ రకమైన ఫంగల్ వృద్ధి జరుగుతుంది. అసలైన ప్రమాదం అక్కడే మొదలవుతుంది. ఈ ఫంగస్ మ్యూకోర్మైకోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. ఇది చాలా తీవ్రమైన సమస్య. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.
మ్యూకోర్మైకోసిస్ వల్ల శ్వాసనాళాలపై ప్రభావం పడుతుంది. కళ్ల చుట్టూ వాపు, ముక్కులో ఇన్ఫెక్షన్, తలనొప్పి, జలుబు వంటి లక్షణాలుగా ప్రారంభమై, తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. కొవిడ్ సమయంలో ఈ వ్యాధి గురించి చాలా విన్నాం. ఆ సమయంలో డయాబెటిస్ ఉన్నవారిలో, బీపీ, అస్థమా లాంటి సమస్యలు ఉన్నవారిలో ఇది వేగంగా వ్యాపించింది. చిన్న చిన్న అలసత్వాలు పెద్ద ప్రమాదాలను తెచ్చిపెట్టవచ్చన్న ఉదాహరణ ఇది.
నల్ల మచ్చలున్న ఉల్లిపాయల్ని వాడకూడదు. ఆ మచ్చలు ఉన్న భాగాన్ని తొలగించడం సరిపోదు. ఎందుకంటే, ఫంగస్ లోపల పాడైపోయిన భాగాల్లో ఉన్నప్పుడు, శరీరంలోకి వెళ్లిన తర్వాత దాని ప్రభావం చూపుతుంది. అందుకే, ఉల్లిపాయను వాడేముందు పరిశీలించడం చాలా ముఖ్యం. కొన్ని సార్లు ఉల్లిపాయ బయట వైట్‌గా కనిపించినా లోపల నల్లటి ధూళి లాంటి ఫంగస్ వుంటుంది. కనుక, వాడేముందు చెరిపి, ముక్కలు చేసి చూడాలి.
ఇంకొటి, మార్కెట్‌లో ఉల్లిపాయలు తెచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా, పొడిగా ఉన్న చోటు నిల్వ చేయాలి. తడి లేకుండా, గాలి చొరబడే పళ్లెలో ఉంచడం మంచిది. ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల మైశ్చర్ పెరిగి మరింత ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంది. పైగా, నిల్వ ఉల్లిపాయల్ని ఎక్కువ రోజులు వాడకూడదు. రెండు వారాలకంటే ఎక్కువగా వాడితే దానిని పూర్తిగా తొలగించడం ఉత్తమం.
ఇటువంటి చిన్న జాగ్రత్తలతోనే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు. ఉల్లిపాయలు ఆరోగ్యానికి మంచివే కానీ, పాడైపోయినవాటిని తినడం వల్ల ఆరోగ్యానికి శత్రువుగా మారుతాయి. ముఖ్యంగా పిల్లలు, పెద్దవారు తినే ఆహారంలో ఇలాంటి సమస్యలు వస్తే వారు వెంటనే ప్రభావితమవుతారు. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే, మనమే జాగ్రత్త పడాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఆహారం ఎంచుకోవడంలో, అలవాట్లలో ఎంతో జాగ్రత్త అవసరం. అందుకే, ఉల్లిపాయలపై నల్ల మచ్చలు కనిపిస్తే… వాడకండి.