Cyber Crime: కంటికి కనిపించరు.. ఎదురుగా పలకరించరు.. ఎక్కడో ఉంటారు.. ఎదురుచూస్తూ ఉంటారు.. ఒక్కసారి దొరికామా ఖతమ్.. మన అకౌంట్ ఖాళీ. యస్.. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అంతకంతకు పెరుగుతున్నాయి. ఎక్కడో సిస్టమ్ ముందు కూర్చొని.. పైసా పెట్టుబడి లేకుండా మన అకౌంట్‌ను ఖాళీ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ముఖ్యంగా భారతీయులను నిండా ముంచుతున్నారు. గడచిన ఏడాది అంటే 2024లో ఏకంగా 22 వేల 842 కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు భారతీయులు. వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇది. నిజానికి ఇది కాదు అసలు షాక్.. ఈ ఏడాది ఈ నెంబర్ మరింత పెరిగింది. ఈ ఏడాది ఇంకా పూర్తి కానే లేదు.. అప్పుడే భారతీయులు పొగొట్టుకున్న డబ్బు అక్షరాలా లక్షా 2 వేల కోట్లు ఉంటుందని అంచనా. దీన్ని బట్టి అర్థమవుతున్నది భారతీయుల సొమ్ముకు సైబర్ కేటుగాళ్లు ఓ పారసైట్‌గా మారారని…
ఇప్పటికే లక్ష కోట్లు కొల్లగొట్టారు….
ప్రతి ఏడాది పొగొట్టుకున్న అమౌంట్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. డేటా లీడ్స్ సంస్థ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం 2022లో 2 వేల 306 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు సైబర్ క్రిమినల్స్. 2023 వచ్చే సరికి 7 వేల 465 కోట్లకు చేరింది ఈ సొమ్ము. 2024 వచ్చే సరికి 22 వేల కోట్లను దాటింది.. ఈ ఏడాది ఇప్పటికే లక్ష కోట్లకు దాటింది. అంటే సైబర్ మోసాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయని దీన్ని బట్టి అర్థమవుతోంది.
రోజురోజుకీ పెరుగుతున్న ఫిర్యాదుల సంఖ్య….
గతంలో ఫిర్యాదుల సంఖ్య తక్కువగా ఉండేది కానీ.. ఈ మధ్య ఫిర్యాదుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. 2024లో ఫిర్యాదుల సంఖ్య ఏకంగా 20 లక్షలకు పైగా ఉంది. మరి ఈ మోసాలు ఇంతలా పెరగడానికి కారణమేంటి? ఆన్సర్ సింపుల్. రోజురోజుకు పెరుగుతున్న డిజిటల్ పేమెంట్స్. కరోనా సమయంలో డిజిటల్ పేమెంట్స్ విధానం ఊపందుకుంది. ఆ తర్వాత పెరగడమే తప్ప.. ఎప్పుడూ తగ్గలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏడాది ఒక్క జూన్‌లోనే ఒక కోటి 90 లక్షల యూపీఐ పేమెంట్స్ జరిగాయి. మొత్తం 24 లక్షల కోట్ల విలువైన ట్రాన్సక్షన్ ఇవి. 2013లో డిజిటల్ పెమెంట్స్ విలువ 162 కోట్లుగా ఉండేది.. అది ఈ ఏడాది జనవరి నాటికి 18 వేల 120 కోట్లుగా మారింది. ప్రపంచం మొత్తం మీద జరిగే డిజిటల్ పేమెంట్స్‌లో సగం భారత్‌లోనే జరుగుతున్నాయి. దీన్నే ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ టార్గెట్‌గా చేసుకుంటున్నారు.
ఫేక్ మేసేజ్‌లు వస్తున్నాయి.. జాగ్రత్త..!
ఇప్పుడు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ అందుబాటులో ఉండటంతో.. అక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి. అందుకే గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఈజీగా టార్గెట్ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఫేక్ కాల్స్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా యాప్స్‌ను బేస్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఫేక్ మెసేజ్‌ల్లో లింక్‌లు పంపుతూ కొందరు.. ఆన్‌లైన్ మార్కెట్లు, ట్రేడిండ్, పేమెంట్ కన్ఫర్మేషన్ అంటూ.. ఇలా రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు.
అప్రమత్తంగా ఉండకపోతే.. అంతే సంగతులు…
ఇప్పుడిప్పుడే ప్రజల్లో వీటన్నింటిపై అవగాహన పెరుగుతోంది. కానీ మరింత పెరగాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు నిపుణులు. హానికరమైన లింక్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఓపెన్స్ సోర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో వివరాలను పోస్ట్ చేయవద్దని సూచిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వాలు కూడా సమర్థమైన చట్టాలను తీసుకురావాంటున్నారు.
ALSO READ: Intelligence Bureau: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 4987 జాబ్స్.. రూ.69,100 జీతం.. లాస్ట్ డేట్?