Long Hair Tips: ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలే సమస్యతో సతమతం అవుతున్నారు. ఇలాంటి సమయంలో కొంత మంది హోం రెమెడీస్ వాడుతుంటే మరి కొంత మంది బయట దొరికే హెయిర్ ఆయిల్స్‌తో పాటు షాంపూలను వాడుతుంటారు. వీటి వల్ల అంతగా ఫలితం లేకపోగా కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కొన్ని రకాల హోం రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయి. వీటిని వాడటం వల్ల పెద్దగా డబ్బు కూడా ఖర్చు అవ్వదు.
20 ఏళ్ల వయస్సు నుండి జుట్టు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. హార్మోన్ల మార్పులు, ఒత్తిడితో పాటు పర్యావరణ కారకాలు జుట్టును ప్రభావితం చేస్తాయి. వింటర్ సీజన్‌లో ప్రత్యేకంగా జుట్టు సంరక్షణ అవసరం. అందుకే ఇలాంటి సమయంలో మనం వాడే కొన్ని రకాల హోం రెమెడీస్ జుట్టును బలోపేతం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీంతో పాటు కొన్ని జుట్టు సంరక్షణ చిట్కాలు జుట్టును మందంగా, నల్లగా మార్చడానికి చాలా బాగా పనిచేస్తాయి.
ఆరోగ్యకరమైన జుట్టు కోసం చిట్కాలు:
మెంతి గింజలు:
మీ జుట్టుకు తగిన మోతాదులో మెంతి గింజలను తీసుకుని వాటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించి అరగంట తర్వాత జుట్టును వాష్ చేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా మెంతుల్లోని పోషకాలు జుట్టును దృడంగా మారుస్తాయి. అంతే కాకుండా చుండ్రు నుండి కూడా ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయి.
ఉసిరికాయ:
ఉసిరికాయ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. మీరు మీ జుట్టుకు ఉసిరి రసాన్ని అప్లై చేయవచ్చు. లేదా షాంపూతో కలిపిన ఉసిరి పొడిని ఉపయోగించవచ్చు. ఇలా తరుచుగా చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అంతే కాకుండా ఉసిరికాయలో ఉండే పోషకాలు జుట్టును పొడవుగా పెరిగేలా చేస్తాయి.
ఎగ్:
జుట్టు పోషణకు గుడ్డు గొప్ప మార్గం. గుడ్డు మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. జుట్టులో ఉండే పోషకాలు జుట్టు రాలే సమస్యలను పూర్తిగా తగ్గిస్తాయి. అంతే కాకుండా జుట్టుకు తిరిగి మెరుపును అందిస్తాయి. అంతే కాకుండా జుట్టును సిల్కీగా మారుస్తాయి.
జుట్టు సంరక్షణ చిట్కాలు:
మీ జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాయండి: మీ జుట్టుకు కనీసం వారానికి ఒకసారి నూనె రాయండి. కొబ్బరి నూనె, బాదం నూనెతో పాటు ఆలివ్ నూనె మీ జుట్టుకు పోషణ అందిస్తాయి. వీటిని వాడటం వల్ల మీ జుట్టు బాగా పెరుగుతుంది.
తేలికపాటి షాంపూని ఎంచుకోండి:
సల్ఫేట్లు, పారాబెన్‌లతో కూడిన షాంపూలను వాడటం తగ్గించండి. ఇవి మీ జుట్టును పొడిగా , నిర్జీవంగా మార్చుతాయి. హెర్బల్ షాంపూ ఉపయోగించండి. నేచురల్ గా తయారు చేసిన ఆయిల్స్ వాడటం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. రసాయనాలు కలిపిన షాంపూలను వాడటం వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది. అంతే కాకుండా బాగా రాలుతుంది కూడా.
కండీషనర్ ఉపయోగించండి:
మీరు షాంపూ చేసిన ప్రతిసారీ కండీషనర్ ఉపయోగించండి. ఇది మీ జుట్టుకు తేమను అందించి మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.
హీట్ స్టైలింగ్‌ను నివారించండి:
వీలైనంత వరకు కర్లింగ్ ఐరన్‌లు , స్ట్రెయిట్‌నెర్‌ల వంటి హీట్ స్టైలింగ్ లను ఉపయోగించకుండా ఉండండి. ఇవి మీ జుట్టుకు హాని కలిగిస్తాయి. వీటిని వాడటం వల్ల జుట్టు ఎక్కువగా రాలే ప్రమాదం కూడా ఉంటుంది.
హెయిర్ మాస్క్ వాడండి: వారానికి ఒకసారి హెయిర్ మాస్క్ వాడండి. మార్కెట్లో లభించే హెయిర్ మాస్క్‌లను కూడా ఉపయోగించవచ్చు. ఇంట్లోనే హెయిర్ మాస్క్‌లను తయారు చేసుకోవచ్చు. అవోకాడో , తేనెను వాడి హెయిర్ మాస్క్ తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి: జుట్టు ఆరోగ్యానికి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రోటీన్లు, విటమిన్లు , మినరల్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.
ఒత్తిడిని తగ్గించుకోండి: జుట్టు రాలడానికి ఒత్తిడి ఒక ప్రధాన కారణం. యోగా, ధ్యానం లేదా ఏదైనా ఇతర కార్యకలాపాల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.
Also Read: తులసి గింజలతో.. ఈ వ్యాధులన్నీ పరార్
తలకు మసాజ్ చేయండి: రెగ్యులర్ స్కాల్ప్ మసాజ్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తలకు మసాజ్ చేయడం వల్ల కూడా జుట్టు రాలకుండా కూడా ఉంటుంది. వారానికి కనీసం ఒక సారైనా ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి ?
మీ జుట్టు విపరీతంగా రాలిపోతుంటే లేదా మీ జుట్టులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే, మీరు వైద్యుడిని సంప్రదించాలి. సరైన సమయంలో డాక్టర్ ను సంప్రదించడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు.