Adivi Shesh:అడివి శేష్(Adivi Shesh).. మేజర్, గూఢచారి వంటి సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ హీరో ఎక్కువగా స్పై జానర్ లోనే సినిమాలు తీస్తారు.అలా ఇప్పటి వరకు ఈయన చేసిన క్షణం,గూఢచారి, మేజర్, హిట్ 2, ఎవరు వంటి సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. దాంతో అడివి శేష్ కి టాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది. అలా టైర్-2 హీరోలలో ఒకరికి కొనసాగుతున్న అడివి శేష్.. ప్రస్తుతం ‘గూఢచారి -2’ అలాగే ‘డెకాయిట్’ మూవీస్ చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు ఒకటే కామన్ పాయింట్ వెంటాడుతోంది. అది ఏంటంటే.. ముందుగా ఈ సినిమాలకు తీసుకున్న హీరోయిన్స్ వేరు.. ఇప్పుడున్న ఉన్న హీరోయిన్స్ వేరు..
ముందు ఈ ‘డెకాయిట్’ సినిమా కోసం శృతిహాసన్, ‘గూఢచారి -2’ కోసం బంటియా సంధూ ని తీసుకున్నారు. కానీ ఏమైందో ఏమో ఈ ఇద్దరు హీరోయిన్లు, ఆ రెండు సినిమాల నుండి తప్పుకున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే అడివి శేష్ సినిమాల ద్వారా చాలామంది హీరోయిన్స్ ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో యాంకర్ అనసూయ, మీనాక్షి చౌదరి, శోభిత ధూళిపాళ్ల వంటి హీరోయిన్లు ఉన్నారు.
అడివి శేష్ మూవీ నుండి అందుకే హీరోయిన్స్ తప్పుకుంటున్నారా?
అందుకే ఈ హీరో సినిమాలో అవకాశం వస్తే ఎవరైనా సరే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ ఇండస్ట్రీలో ఉన్న ఈ హీరోయిన్లు మాత్రం భయపడిపోతున్నట్టు తెలుస్తోంది. అడివి శేష్ తో సినిమా అంటేనే చాలామంది హీరోయిన్లు వామ్మో మేము నటించం అంటూ పారిపోతున్నారట. మరి ఇంతకీ అడివి శేష్ సినిమా నుండి హీరోయిన్లు ఎందుకు తప్పుకుంటున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం. అడివి శేష్ శృతిహాసన్ కాంబినేషన్లో డెకాయిట్ మూవీ వస్తున్నట్టు టీజర్ కూడా రిలీజ్ చేశారు. కానీ సడన్గా ఆ సినిమా నుండి శృతిహాసన్ తప్పుకున్నట్టు వార్తలు వినిపించాయి.అయితే అవన్నీ రూమర్సే అని అందరు కొట్టి పారేశారు. కానీ సడన్గా శృతిహాసన్ ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ (Mrunal thakur)ఉన్న పోస్టర్ బయటపడడంతో అందరూ షాక్ అయిపోయారు. ఇక శృతిహాసన్ డెకాయిట్ మూవీ నుండి తప్పుకోవడానికి నిర్మాతలతో, హీరోతో గొడవలు వచ్చినట్టు రూమర్లు వినిపించాయి. కానీ రీసెంట్గా మాత్రం శృతిహాసన్ వేరే సినిమాలకు కమిట్ అవ్వడం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అసలు ఏమైందంటే..
ఇక గూఢచారి 2 మూవీకి కూడా మొదట బంటియా సందూని హీరోయిన్గా తీసుకున్నారు చిత్ర యూనిట్. కానీ సడన్గా ఈ హీరోయిని ని తప్పించి హాట్ బ్యూటీ అయిన వామికా గబ్బిని తీసుకున్నారు. రీసెంట్ గానే వామికా గబ్బి గూఢచారి 2 మూవీకి హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అయితే హీరోయిన్లు ఇలా అడివి శేష్ సినిమా నుండి వరుసగా తప్పుకోవడానికి కారణమేంటి అని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు.కొంతమందేమో అడివి శేష్ సినిమా షూటింగ్ బాగా రావడం కోసం హీరోయిన్స్ తో కూడా పదేపదే కరెక్ట్ గా చేయండి అంటూ టార్చర్ చేస్తారని అంటుంటే.. మరికొంత మందేమో హీరోయిన్స్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే ఆ సినిమాల నుండి తప్పుకున్నారు అంటున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
తక్కువ బడ్జెట్..హై క్లాస్ మూవీ లతో..
అడివి శేష్ తాను చేసే ప్రతి సినిమాలో కూడా మంచి క్వాలిటీ ఉండాలి అని చూస్తారట. అలా ఆయన తక్కువ బడ్జెట్లో హై క్లాస్ క్వాలిటీ ఉండేలా సినిమా ఉండాలని కోరుకుంటారు. అయితే ఎప్పుడూ తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేసే అడివి శేష్ ఇప్పుడు ఏకంగా రూ.75 కోట్ల భారీ బడ్జెట్ తో గూఢచారి 2 తో మన ముందుకు రాబోతున్నారు. ఇక బడ్జెట్ 75 కోట్లు అంటే సినిమాని ఎంతలా ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు అని అడివి శేష్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇక గూఢచారి 2 మూవీతో అడివి శేష్ 100 కోట్ల క్లబ్లో కూడా చేరుతాడనే టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి అడివి శేష్ అదృష్టం ఈ ఏడాది ఎలా ఉందో.