BigTV English

Vande Bharat: షూటింగ్స్‌తోనూ ‘వందేభారత్’ రైళ్ల సంపాదన.. అప్పుడే ఎంత పారితోషికం వచ్చిందో తెలుసా?

Vande Bharat: షూటింగ్స్‌తోనూ ‘వందేభారత్’ రైళ్ల సంపాదన.. అప్పుడే ఎంత పారితోషికం వచ్చిందో తెలుసా?

Indian Railways: భారతీయ రైల్వేసంస్థ ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చడంతో పాటు సరుకు రవాణా ద్వారా భారీగా ఆదాయాన్ని పొందుతున్నది. మరోవైపు ఆయా రైళ్లలో, రైల్వే స్టేషన్లలో సినిమా షూటింగులకు అనుమతి ఇస్తూ ఆదాయాన్ని అర్జిస్తున్నది. ముఖ్యంగా పశ్చిమ రైల్వే(WR) ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో తన నెట్ వర్క్ అంతగా సినిమాలు, యాడ్స్ షూటింగ్స్ కు అనుమతి ఇవ్వడం ద్వారా రూ. 1 కోటి ఆదాయాన్ని పొందింది. ముంబై సెంట్రల్ స్టేషన్ లో వందే భారత్ రైల్లో ఒక రోజు షూటింగ్ కు అనుమతి ఇవ్వడం ద్వారా రూ. 20 లక్షలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేశంలో తొలిసారి వందేభారత్ రైల్లో సినిమా షూటింగ్ జరిగిందని వెల్లడించారు.


2024-25 ఆర్థిక సంవత్సరంలో షూటింగులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పశ్చిమ రైల్వే నాలుగు యాడ్ ఫిల్మ్స్, మూడు సినిమాలు, ఓ వెబ్ సిరీస్, ఒక టీవీ ప్రోమో షూట్ సహా తొమ్మిది సినిమా సంబంధిత ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుల అనుమతికి గాను పెద్ద మొత్తంలో ఆదాయాన్ని పొందినట్లు తెలిపారు. సినిమా షూటింగుల కోసం సింగిల్ విండో క్లియరెన్స్ అనుమతులు ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గతంలో మాదిరిగా కాకుండా ఈజీగా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. “సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను ప్రవేశపెట్టడం వల్ల సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వడం చాలా సుభతరం అయ్యింది. ఈ విధానం వల్ల రైల్వే సంస్థకు భారీగా ఆదాయం లభిస్తున్నది. సింగిల్ విండో విధానం ద్వారా సినిమా నిర్మాతలకు కూడా ఈజీగా షూటింగ్స్ చేసుకునే అవకాశం లభిస్తున్నది. భారతీయ రైల్వేలో సరికొత్తగా ప్రవేశ పెట్టిన వందేభారత్ రైళ్లలో షూటింగ్స్ కోసం ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు” అని పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ తెలిపారు.


బాలీవుడ్ నుంచి పెద్ద మొత్తంలో డిమాండ్

బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థల నుంచి వందేభారత్ రైళ్లతో పాటు రైల్వే స్టేషన్లలో షూటింగ్స్ జరుపుకునేందుకు పెద్ద సంఖ్యలో అనుమతులు కోస లేఖలు వస్తున్నాయని పశ్చిమ రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉన్న సమయంలో లేదంటే రాత్రి వేళ్లలో సినిమా షూటింగులకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. “చిత్రనిర్మాతలు తమ షూటింగ్‌ల కోసం రైల్వే ఫ్లాట్ ఫారమ్ లతో పాటు రైళ్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. రాబోయే రోజులలో వెస్ట్రన్ రైల్వేకు సినీ పరిశ్రమ నుంచి మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. అదే సమయంలో భారీగా ఆదాయం లభిస్తున్నది” అని రైల్వే అధికారులు తెలిపారు.

వెస్ట్రన్ రైల్వేతో పాటు దేశంలోని ఇతర రైల్వే సంస్థలకు సినిమా పరిశ్రమల నుంచి మంచి ఆదాయం లభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ముందు సినిమా షూటింగులకు ఈజీగా అనుమతులు ఇచ్చేందుకు నిబంధనల్లో మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు. ఫలితంగా భారీగా ఆదాయం పొందే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Read Also:భారీ సంఖ్యలో వందేభారత్ రైళ్ల తయారీ.. మొత్తం ఎన్ని రైళ్లు రానున్నాయంటే?

Related News

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

Big Stories

×