Tips For Pimple Problem: ప్రతి ఒక్కరూ తమ అందం చెక్కుచెదరకుండా ఉండాలని కోరుకుంటారు. ప్రస్తుతం చాలా మంది ముఖంపై మొటిమలు, మచ్చలు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖంపై మచ్చలు, మొటిమలు ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తాయి. హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, సూర్యకాంతి , సరైన ఆహారం తీసుకోవడం వంటి అనేక కారణాల వల్ల ముఖంపై మొటిమలు వస్తాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా మంది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఏవేవో క్రీములు ట్రై చేస్తుంటారు. కొందరు ఎన్ని రకాల ప్రొడక్ట్స్ వాడినా కూడా ముఖంపై మొటిమల మాత్రం పూర్తిగా తగ్గవు.
ముఖం మీద మచ్చలు , మొటిమలు శరీరం లోపల నుండి సమస్యలు ఉన్నాయని సూచిస్తాయి. మీరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే.. మీ చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేయడానికి మీరు కొన్ని హోం రెమెడీస్ వాడవచ్చు.
మొటిమలు, మచ్చలను తొలగించే మార్గాలు:
నిమ్మరసం: నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మాన్ని తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది. నీళ్లలో నిమ్మరసం మిక్స్ చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు , మచ్చల సమస్య తగ్గతుంది.
పెరుగు: పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మృత చర్మ కణాలను తొలగించి చర్మాన్ని అందంగా మార్చుతుంది. పెరుగును ముఖానికి పట్టించి కాసేపయ్యాక కడిగేయాలి.
బంగాళదుంప: బంగాళదుంపలో బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి మచ్చలను తేలికగా మార్చడంలో సహాయపడతాయి. పచ్చి బంగాళాదుంపను కట్ చేసి, ప్రభావిత ప్రాంతంలో రుద్దండి. 15 నిమిషాల తర్వాత వాష్ చేయండి.
పసుపు: పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. పసుపు, నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం మెరిసిపోతుంది. అంతే కాకుండా ముఖంపై మొటిమలు కూడా రాకుండా ఉంటాయి.
మొటిమలను వదిలించుకోవడానికి చిట్కాలు:
తేనె: మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తేనెలో ఉన్నాయి. మొటిమలపై తేనెను నేరుగా రాయండి.
వేప: వేప ఆకులను పేస్ట్ చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.
అలోవెరా: అలోవెరాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మొటిమల వల్ల వచ్చే మంటను తగ్గిస్తాయి. అలోవెరా జెల్‌ను నేరుగా మొటిమల మీద రాయండి.
గంధం: చందనం మొటిమలను పొడిగా చేసే క్రిమినాశక గుణాలను కలిగి ఉంటుంది. గంధపు పొడిని నీళ్లలో కలిపి పేస్ట్ లాగా అప్లై చేయాలి.
Also Read: టీ పౌడర్ ఇలా వాడారంటే.. తెల్లజుట్టు నల్లగా మారిపోతుంది
ఇతర ఉపయోగకరమైన చిట్కాలు:
సమతుల్య ఆహారం: పండ్లు, కూరగాయలు, నీరు పుష్కలంగా తీసుకోండి.
ఒత్తిడిని తగ్గించండి: యోగా, ధ్యానం లేదా ఇతర పద్ధతులను ప్రాక్టీస్ చేయండి.
చర్మాన్ని శుభ్రంగా ఉంచండి: రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోండి .రాత్రి తప్పకుండా మేకప్ తొలగించండి.
సన్‌స్క్రీన్ : ఎండలోకి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ ఉపయోగించండి.
పొగాకు, ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి: ఇవి మీ చర్మానికి హాని కలిగిస్తాయి.