Venkata Ramana on Vijayasai: సీఎం చంద్రబాబు వైసీపీ నుంచి ముప్పు పొంచి వుందా? టీడీపీ శ్రేణులు ఎందుకు భయపడుతున్నాయి? తాము అధికారంలోకి రాగానే చంద్రబాబు జైలుకి పంపిస్తామని ఎందుకన్నారు? ఆయనను జైలుకి పంపడానికి అధికారం కావాలని వీఎస్ఆర్ కోరారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో సీఐడీ తన పని తాను చేసుకుపోతోంది. పార్లమెంటు సమావేశాల తర్వాత వీఎస్ఆర్‌ని సీఐడీ అరెస్ట్ చేయడం ఖాయమంటూ హస్తినలో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో మీడియా ముందుకొచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. తాము అధికారంలోకి రాగానే చంద్రబాబును జైలుకు పంపిస్తామని ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చేశారు.
ఒక విధంగా ముఖ్యమంత్రిని ఓపెన్‌గా బెదిరించారాయన. కూటమి దూకుడుతో వైసీపీ బ్యాలెన్స్ తప్పుతున్నట్లు కనిపిస్తోంది. ఆవేశంలో నేతలు నోరు జారి మీడియాకు మసాలా ఇచ్చేస్తున్నారు. ఫలితంగా వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ట్రోల్స్ గురవుతున్నారు. సాయిరెడ్డి వ్యవహారంపై శనివారం మీడియా ముందుకొచ్చారు టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి.
రెండురోజుల కిందట విజయసాయిరెడ్డి మీడియా ముందు మాట్లాడిన ప్రతీ విషయానికీ ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి సీఎం చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు కీలక విషయాలను బయటపెట్టారు ఆనం. కులం గురించి మాట్లాడడంపై విరుచుకుపడ్డారు ఆనం. మీరంతా రెడ్లు కాదని, ఈ విషయం అందరికీ తెలుసన్నారు. ఐదేళ్లలో రెడ్డి కమ్యూనిటీని నాశనం చేసింది జగన్ ప్రభుత్వం కాదా అంటూ రుసరుసలాడారు.
ఇవాళ తాము బయటకు రావడానికి కారణం మీరు కాదా అంటూ ప్రశ్నించారు. మీ నాయకుడు యూకెలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారా లేదా అంటూ లోగుట్టు బయటపెట్టారు. ఎవరినీ కలవకుండా తలుపులేసుకుని మందులు వాడిందెవరు? దీన్ని హైపర్ యాక్టివ్ అంటారా? సూపర్ యాక్టివ్ అంటారా? చెప్పాలన్నారు. పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడేవారిని సినైల్ అంటారని చెప్పుకొచ్చారు.
కేవీరావుతో చంద్రబాబు ములాఖత్ అయ్యారన్న వ్యాఖ్యలపైనా తనదైన శైలిలో కౌంటరిచ్చారు. ఇంత జరుగుతుంటే వైసీపీ పాలనలో ఏం చేశారంటూ ప్రశ్నించారు ఆనం వెంకట రమణారెడ్డి. పోర్టుకు సంబంధించి ఇన్ని ఆధారాలు ఉండగా, ఎందుకు కేసు పెట్టలేదన్నారు. వైసీపీ ప్రభుత్వ భయంతో ఆయన అమెరికాకు వెళ్లారని, అందుకోసమే బతికారన్నారు. ప్రభుత్వం సైలెంట్‌గా ఉందని కాబట్టే మీ గొంతు నొక్కి బయటకు వచ్చి మాట్లాడుతోందన్నారు.
కాకినాడ సీ పోర్టు, సెజ్ గురించి కీలక విషయాలు బయటపెట్టారాయన. ఆంధ్రాలో ఎకరం 29 వేలకు ఎవరైనా ఇస్తారా? 2000 ఎకరాలు 12 కొట్లకు ఎలా కొట్టేశారు? ఏ కంపెనీతో వాల్యూవేషన్ వేశారంటూ సూటిగా వీఎస్ఆర్‌ని ప్రశ్నించారు. పోర్టు దక్కించుకునే విషయంలో అంతా జాగ్రత్తగా చేశారని, ఒక్క విషయంలో తప్పటడుగు వేశారన్నారు. కేవీ రావు పిల్లలు అమెరికాలో ఉన్నారని, వారక్కడ సిటిజన్ అన్న విషయం మరిచిపోయారని గుర్తు చేశారు.
మొత్తానికి కాకినాడ సీ పోర్టు, సెజ్ వ్యవహారం అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంలో ఇంకెన్ని అరెస్టులుంటాయో? ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వెయిట్ అండ్ సీ.
వేల కోట్ల ఆస్తి కేవలం రూ.12 కోట్లకి నువ్వు కొట్టేసావని, నీ అక్రమాలు బయట పెడితే, చంద్రబాబు గారిని చంపేస్తా అని, నీ చెంచాలతో బెదిరిస్తావా @ysjagan ?#YCPFakeBrathuku#EndOfYCP#AndhraPradesh pic.twitter.com/ebVskH4YJd
— Telugu Desam Party (@JaiTDP) December 7, 2024