BigTV English

Tea Powder : టీ పౌడర్ ఇలా వాడారంటే.. తెల్లజుట్టు నల్లగా మారిపోతుంది

Tea Powder : టీ పౌడర్ ఇలా వాడారంటే.. తెల్లజుట్టు నల్లగా మారిపోతుంది

Tea Powder : ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా రంగు మారిన జుట్టుతో సతమతమవుతున్నారు. ఇదిలా ఉంటే రంగు మారిన జుట్టును నల్లగా మార్చుకోవడానికి కొందరు హెయిర్ కలర్స్ వాడుతుంటారు. ఇంకొందరేమో షాంపూలను ట్రై చేస్తారు. ఇవి జుట్టుకు హాని కలిగిస్తాయి. అంతే కాకుండా ఇవి ఖర్చుతో కూడుకున్నవి కూడా. కానీ కొన్ని రకాల హోం రెమెడీస్ జుట్టును సహజంగా మర్చేందుకు ఉపయోగపడతాయి. జుట్టుకు బలాన్ని కూడా అందిస్తాయి.


తెల్ల జుట్టుకు రంగు వేయడానికి టీ లీఫ్ హోం రెమెడీస్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయ. టీ ఆకుల నుండి తయారు చేయబడిన 4 హోం రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టీ పౌడర్, టీ ఆకులతో హెయిర్ డై:


టీ తయారీలో ఉపయోగించే టీ ఆకులు జుట్టుకు కూడా మేలు చేస్తాయి. ఇది సహజ జుట్టు రంగుగా ఉపయోగించబడుతుంది. అంతే కాకుండా మార్కెట్‌లో లభించే హెయిర్ డైస్‌లో రసాయనాలు ఉంటాయి. దీని వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. మీరు టీ ఆకుల సహాయంతో ఇంట్లోనే అనేక రకాల హెయిర్ డైలను సిద్ధం చేసుకోవచ్చు.

టీ ఆకులతో తయారు చేసిన హెయిర్ డై జుట్టును ఎక్కువ కాలం నల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. టీ ఆకులలో ఉండే టానిన్ అనే మూలకం జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది జుట్టును బలపరుస్తుంది. అంతే కాకుండా మెరిసేలా చేస్తుంది.

టీ ఆకులతో జుట్టు నల్లగా మారడానికి కొన్ని మార్గాలు:

స్ట్రెయిట్ టీ: ఒక కప్పు నీటిలో 2-3 చెంచాల టీ పౌడర్ వేసి మరిగించాలి. దీన్ని చల్లార్చి జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూతో వాష్ చేయాలి.

టీ ఆకులు, కాఫీ: ఒక కప్పు నీటిలో 2-3 చెంచాల టీ పౌడర్ తో పాటు 1 చెంచా కాఫీ పొడి వేసి మరిగించాలి. దీన్ని చల్లార్చి జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూతో వాస్ చేయాలి.

టీ పౌడర్, హెన్నా: టీ పౌడర్ కాస్త నీటిలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత ఇందులో హెన్నా పౌడర్ వేసి మిక్స్ చేయాలి. దీనిని జుట్టుకు అప్లై చేయండి. తనంతరం 30 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఇది జుట్టుకు సహజసిద్ధమైన రంగును ఇవ్వడంతో పాటు, మరింత దృఢంగా మారుస్తుంది.

టీ పౌడర్, ఇతర మూలికలు: టీ పౌడర్ లో ఉసిరి, వేప లేదా బ్రహ్మి వంటి మూలికలను మిక్స్ చేసి వేడి నీటిలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత దీనిని జుట్టుకు పట్టించాలి. 30నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇది జుట్టు నల్లబడటంతోపాటు అనేక ఇతర సమస్యలను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది.

టీ పౌడర్ వల్ల కలిగే ప్రయోజనాలు :

జుట్టును సహజంగా నల్లగా మారుస్తుంది.

జుట్టును బలంగా చేస్తుంది.

జుట్టును మెరిసేలా చేస్తుంది.

జుట్టు చుండ్రును తగ్గిస్తుంది.

జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

Also Read: పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరమే లేదు.. ఇది వాడితే తెల్లగా మెరిసిపోతారు

గుర్తుంచుకోవలసిన విషయాలు:

జుట్టును నల్లగా మార్చుకోవడానికి టీ పౌడర్‌ను క్రమం తప్పకుండా వాడాలి.

మీకు టీ ఆకులకు అలెర్జీ ఉంటే దీనిని ఉపయోగించవద్దు.

మార్కెట్‌లో అందుబాటులో ఉన్న హెయిర్ డై మీకు తక్షణ ఫలితం కావాలంటే.. మీరు మార్కెట్లో అందుబాటులో ఉన్న హెయిర్ డైని ఉపయోగించవచ్చు. కానీ వాటిలో జుట్టుకు హాని కలిగించే అనేక రకాల రసాయనాలు ఉంటాయని మాత్రం గుర్తుంచుకోండి.

ఆయుర్వేద ఉత్పత్తులు: మీరు సహజంగా జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడే ఆయుర్వేద ఉత్పత్తులను కూడా ఉపయోగించవచ్చు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×