BigTV English

Tips For Wall Cleaning: ఇలా చేస్తే.. గోడలపై ఉన్న మరకలు క్షణాల్లోనే మాయం

Tips For Wall Cleaning: ఇలా చేస్తే.. గోడలపై ఉన్న మరకలు క్షణాల్లోనే మాయం

Tips For Wall Cleaning: గోడలపై మరకలు ఇంటి అందాన్ని పాడు చేస్తాయి. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో గోడలకు పెన్సిల్, పెన్‌లతో పాటు స్కెచ్‌లతో రాసిన మరకలు ఎక్కువగా ఉంటారు. పిల్లలు గోడలపై రంగులు వేయడం కూడా సాధారణ సమస్య. గోడలపై మరకలను శుభ్రం చేయడం మహిళలకు అంత తేలికైన పని కాదు. మరకలు , మచ్చలు ఎప్పటికప్పుడు సరిగ్గా శుభ్రం చేయకపోతే అవి గోడను మరింత దెబ్బతీస్తాయి. ఇలాంటి సమయంలోనే కొన్ని రకాల టిప్స్ పాటిస్తే.. మరకలను ఈజీగా తొలగించవచ్చు. మరి ఎలాంటి టిప్స్ గోడలపై మరకలను తొలగించడానికి ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


గోడలు శుభ్రం చేయడానికి మార్గాలు:
కొన్నిసార్లు గోడలపై నూనె మరకలు, ఇతర పదార్థాల మరకలు కూడా కనిపిస్తాయి. కొన్ని సులభమైన చిట్కాలు , ట్రిక్స్ సహాయంతో గోడపై ఉన్న మరకలను శుభ్రం చేయవచ్చు.

ఆయిల్ మరకలు:
కావాల్సినవి:
బేకింగ్ సోడా
డిష్ వాష్ సోప్
వెనిగర్
బ్రష్


బేకింగ్ సోడా: బేకింగ్ సోడాను తీసుకుని నీటితో కలిపాలి. దీనిని పేస్ట్ లా తయారు చేసి మరకపై అప్లై చేయండి. తర్వాత కాసేపయ్యాక తడి గుడ్డతో శుభ్రం చేసుకోవాలి.

డిష్‌వాష్ సోప్: డిష్‌వాష్ సబ్బును నీటిలో కలిపి మరకపై అప్లై చేసి కొంత సమయం తర్వాత కడిగేయాలి.

వెనిగర్: కాస్త వెనిగర్ ని తీసుకుని నీళ్లలో కలిపి మరకల మీద స్ప్రే చేయాలి. కొంత సమయం తర్వాత శుభ్రమైన నీటితో వాష్ చేయాలి. వీటిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పూర్తిగా మరకలు కూడా తొలగిపోతాయి. మొండి మరకలు ఉంటే 2-3 సార్లు వీటిని వాడండి. పూర్తిగా మరకలు శుభ్రం అవుతాయి.

నల్లటి మరకలు, పెన్ మరకలు:
కావాల్సినవి:
హైడ్రోజన్ పెరాక్సైడ్
నిమ్మరసం
డిష్ వాష్ సోప్
వెనిగర్
మ్యాజిక్ ఎరేజర్

హైడ్రోజన్ పెరాక్సైడ్: హైడ్రోజన్ పెరాక్సైడ్ ను నీటిలో కలిపి మరకలపై రాయండి. కొంత సమయం తర్వాత బ్రష్‌తో రుద్దండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి.

నిమ్మరసం: నిమ్మరసాన్ని మరకపై రాసి కాసేపటి తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి.

బేకింగ్ సోడా, వాటర్ పేస్ట్:
బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలపండి. తర్వాత దీనిని మందపాటి పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ పేస్ట్‌ను మరకపై అప్లై చేసి కాసేపు అలాగే ఉంచాలి. తర్వాత మెత్తని బ్రష్‌తో రుద్ది శుభ్రం చేసుకోవాలి.

డిష్ వాష్ సోప్: నీటిలో కొద్దిగా డిష్ వాష్ సోప్ మిక్స్ చేసి స్పాంజ్ సహాయంతో మరకపై అప్లై చేయండి. కొంత సమయం తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల పూర్తిగా మరకలు తొలగిపోతాయి. అంతే కాకుండా గోడలు తెల్లగా మెరిసిపోతాయి.

వెనిగర్: వెనిగర్‌ను నీళ్లతో కలిపి స్ప్రే బాటిల్‌లో నింపండి. మరకపై స్ప్రే చేసి, కొంత సమయం తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి.

నిమ్మరసం: నిమ్మరసం సహజమైన బ్లీచ్‌లా పనిచేస్తుంది. మరక మీద నిమ్మరసం రాసి కొంత సమయం తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి.

మ్యాజిక్ ఎరేజర్: మార్కెట్‌లో లభించే మ్యాజిక్ ఎరేజర్‌తో కూడా మీరు ఈ మరకలను సులభంగా తొలగించవచ్చు.

Also Read: తెల్లజుట్టు నల్లగా మారాలంటే.. ఇది ఒక్క సారి వాడండి చాలు

వాల్‌పేపర్ కోసం అదనపు చిట్కాలు:
వాల్‌పేపర్ కోసం తేలికపాటి క్లీనర్‌లు , మృదువైన బ్రష్‌లను ఉపయోగించండి.
పెయింట్ చేసిన గోడల కోసం: పెయింట్ చేసిన గోడల కోసం పెయింట్ రకానికి తగిన క్లీనర్‌ను ఉపయోగించండి.
కిటికీలు, తలుపుల చుట్టూ మరకలు: ఈ ప్రదేశాలలో తరచుగా ధూళి పేరుకుపోతుంది. ఈ ప్రదేశాలను శుభ్రం చేయడానికి మీరు మార్కెట్లో అందుబాటులో ఉన్న క్లీనర్లను ఉపయోగించవచ్చు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×