Bhu Bharati Act: లోన్ కావాలా.. అయితే అవి ఉన్నాయా.. ఇవి ఉన్నాయా.. లేకుంటే మీకు ఇక లోన్ రాదు. వచ్చే అవకాశమే లేదు. అయ్యా.. కూతురు పెళ్లి కుదిరింది. ఎలాగోలా లోన్ ఇవ్వండి. ఆ భూమి నాదే, కానీ పాస్ పుస్తకం లేదు. దండం పెడతానయ్యా.. ఈ ఒక్కసారి లోన్ ఇవ్వండి. గ్రామంలో విచారించుకోండి సారూ అంటూ ఆ రైతు కన్నీళ్లు. కానీ లోన్ లేదు.. పాడు లేదు.. చల్ హట్ అంటూ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్య సమాధానం.
ఆ రైతు లోన్ తీసుకొని వస్తాడని, ఇంటి వద్ద అతడి కుటుంబీకులు ఎదురుచూపులు. రైతు వచ్చాడు.. పుట్టెడు దుఃఖంతో వచ్చి లోన్ ఇవ్వలేదంటూ కన్నీళ్లు. ఆకుటుంబం మొత్తం రోదిస్తోంది. ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉండగా అసలు విషయం తెలిసింది. అంతే ఆ రైతు, బ్యాంక్ దారి పట్టాడు. ఎంచక్కా లోన్ తెచ్చుకున్నాడు. ఇంతకు ఆ రైతుకు ఏమి తెలిసింది? అసలు కథ ఏమిటో తెలుసుకుందాం.
తెలంగాణ వ్యాప్తంగా భూ భారతి చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రధానంగా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ చట్టాన్ని పకడ్బందీగా అమల్లోకి తెచ్చింది. భూసమస్యల పరిష్కారం, రైతన్నల సంక్షేమమే లక్ష్యంగా భూ భారతి చట్టాన్ని తెచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇలా రైతుల కోసం అంటూ సీఎం చెప్పినట్లుగానే, చట్టంలో రైతన్నల కోసం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు రైతుల పాలిట వరమని చెప్పవచ్చు.
మొన్నటి వరకు ఏదైనా అత్యవసర పనుల నిమిత్తం లోన్ కావాలంటే, ఆ రైతు కాళ్లు కూడ అరిగిపోవాల్సిందే. అంతేకాదు పాసు పుస్తకం తప్పక ఉండాల్సిందే. కొన్ని సంధర్భాల్లో రైతుల వద్ద పాసు పుస్తకాలు ఉండని పరిస్థితి. అటువంటి విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం, భూ భారతి చట్టంతో రైతులు రుణాలు పొందేందుకు సులభతర పద్దతులను ప్రవేశ పెట్టింది. రైతు తన భూమిపై రుణం కావాలంటే, పాస్ పుస్తకం అవసరం లేకుండా చట్టాన్ని తెచ్చింది ప్రభుత్వం.
Also Read: Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు భారీ షాక్.. కేంద్రం కీలక నిర్ణయం
అంతేకాదు టైటిల్ డీడ్ కూడ అవసరం లేకుండా రైతులకు రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు రైతులు రుణాలు చెల్లించని పక్షంలో బ్యాంకర్లు ఇష్టారీతిన వ్యవహరించే తీరుకు కూడ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇప్పటినుండి రైతుల వద్ద రుణాల వసూలు జాప్యం ఉంటే, ముందుగా జిల్లా కలెక్టర్ కు బ్యాంకర్స్ సంప్రదించాలి. కలెక్టర్ అనుమతిస్తేనే ఆ రైతు వద్ద వసూలు కోసం బ్యాంకర్లు చర్యలు తీసుకోవచ్చు. మొత్తం మీద భూ భారతి చట్టం ద్వార ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్.. రైతుల సర్కార్ అంటూ కితాబిస్తున్నారు.