Child Artist Revanth: ఈ మధ్యకాలంలో మేకర్స్ ఒక సక్సెస్ ఫార్ములాను కనుక్కున్నారు. అదే సినిమాలో చిన్నారుల చుట్టూ కథ తిరిగేలా చేయడం. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చిన్నారుల ముందు తలవంచక తప్పదు. ఎన్ని యుద్దాలు చేసినా.. వారి ప్రేమకు బానిసలుగా చూపించడం.. వారి ప్రాణాలను కాపాడడమే హీరో బాధ్యతగా చూపించి హిట్స్ కొట్టేస్తున్నారు. ఇక ఇంకొంతమంది మాత్రం చిన్నారులతో కామెడీ చేయించి హిట్స్ కొట్టేస్తున్నారు. ఈ రెండు కేటగిరిలను అనిల్ రావిపూడి కవర్ చేశాడు. నేలకొండ భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల పాత్రతో ఎమోషనల్ అయ్యేలా చేశాడు. ఇక ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఒక బాలనటుడుతో కామెడీ చేయించాడు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.
విక్టరీ వెంకటేష్ – అనిల్ కాంబోలో వచ్చిన మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి రోజున రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఒక ఎక్స్ కాప్.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ మధ్య నలిగిన కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో వెంకీ- ఐశ్వర్య భార్యాభర్తలుగా కనిపించగా.. మీనాక్షి చౌదరి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించింది. అనిల్ కామెడీ ఎలా ఉంటుంది అనేది ఆయన ఇంతకు ముందు సినిమాలు చూసినవాళ్లకు అర్థమైపోతుంది.
Manchu Vishnu: సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది.. వీధిలో మొరగడం.. మనోజ్ పై విష్ణు సైటెర్
ఇక సినిమా అంతా ఒక ఎత్తు అయితే.. బుల్లిరాజు క్యారెక్టర్ మరో ఎత్తు. తండ్రిని ఎవరైనా ఏదైనా అంటే.. అస్సలు క్షమించని కొడుకుగా బుల్లిరాజు పాత్ర ఉంటుంది. సినిమా మొత్తం బుల్లిరాజు కనిపించడమే ఆలస్యం.. థియేటర్ లో నవ్వులు పూస్తున్నాయి. అప్పడాలు వడియాలు అయ్యాయా అనే సీన్ అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అయితే బుల్లిరాజు క్యారెక్టర్ విమర్శల పాలయ్యింది. పిల్లాడు బాగా నటించాడు కానీ, ఆ బూతులు ఏంటి.. ? పిల్లలతో చెప్పించాల్సిన డైలాగ్ లేనే ఇవి. ఇది కామెడీనా.. ? అంటూ కొంతమంది ఏకిపారేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే.. బుల్లిరాజు పాత్రలో నటించిన కుర్రాడు పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. ఈ కుర్రాడు.. ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయమయ్యాడు. సినిమాలో బూతులు మాట్లాడుతూ కనిపించినా.. బయట మాత్రం చాలా పద్దతిగా కనిపించాడు. తన పాత్రపై వస్తున్న విమర్శలపై రేవంత్ సక్సెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చాడు. సాధారణంగా ఈ వయస్సు పిల్లలు ఎలా మాట్లాడతారో అందరికీ తెల్సిందే. కానీ రేవంత్ మాత్రం ఎంతో హుందాగా.. చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడాడు.
” అందరికీ నమస్కారం. నన్ను ఇంతలా ఆదరించినందుకు మీ అందరికీ థాంక్స్. మీరందరూ థియేటర్ కు వెళ్లి మా సినిమాను ఇంత బాగా ఎంజాయ్ చేసినందుకు థాంక్యూ సో మచ్. నాలాగా ఓటీటీలు చూసి ఎవరు పాడవ్వద్దు. ఎవరు నాలా పెద్దవాళ్ళను తిట్టొద్దు. ఓకే మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేసాం అంతే. ఇలా అవుతుంది అని మేము అనుకోలేదు. దానివలన ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అనిల్ గారికి థాంక్స్” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రేవంత్ మాటలు విన్న ఫ్యాన్స్ బుల్లిరాజు.. ఎంత చక్కగా మాట్లాడవయ్యా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.