BigTV English
Advertisement

Egg Hair Mask: ఇది ఒక్కసారి వాడినా చాలు.. హెయిర్ ఫాల్‌ కంట్రోల్ !

Egg Hair Mask: ఇది ఒక్కసారి వాడినా చాలు.. హెయిర్ ఫాల్‌ కంట్రోల్ !

Egg Hair Mask: పోషకాలు లేకపోవడం, జీవనశైలిలో మార్పులు , కాలుష్యం కారణంగా.. జుట్టు నిర్జీవంగా మారుతుంది. అంతే కాకుండా తీవ్రంగా దెబ్బతింటుంది. జుట్టు దెబ్బతినకుండా కాపాడటానికి సరైన సంరక్షణ , ప్రోటీన్ అవసరం. జుట్టుకు అనేక ఆహార పదార్థాల ద్వారా ప్రోటీన్ లభించినప్పటికీ, నిర్జీవమైన జుట్టు తిరిగి పెరగడానికి గుడ్డు మాత్రమే సహాయపడుతుంది. ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇది జుట్టుకు పోషణనిస్తుంది. అంతే కాకుండా జుట్టు చిట్లిపోకుండా నిరోధిస్తుంది.


గుడ్డులోని తెల్లసొనలో అధిక మొత్తంలో ప్రోటీన్, విటమిన్లు ఉంటాయి. వీటిని తినడంతో పాటు హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. జుట్టు సంబంధిత అనేక సమస్యల నుండి ఉపశమనం కలిగించే ఇటువంటి శక్తివంతమైన , ప్రభావ వంతమైన హెయిర్ మాస్క్‌లను ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలివ్ ఆయిల్, ఎగ్ మాస్క్:
పొడిబారిన, నిర్జీవమైన జుట్టు ఎక్కువగా చిట్లిపోతుంది. అంతే కాకుండా రాలిపోతుంది కూడా. మరి ఈ సమస్య నుండి బయట పడటానికి ఆలివ్ ఆయిల్‌లో ఎగ్ మిక్స్ చేసి హెయిర్ మాస్క్ లాగా తయారు చేసి జుట్టుకు అప్లై చేయాలి.ఈ హెయిర్ మాస్క్‌ను జుట్టుకు అప్లై చేసి దాదాపు 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత షాంపూతో వాష్ చేయాలి. ఈ ప్రక్రియను వారానికి రెండుసార్లు చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.


పెరుగు, ఎగ్ మాస్క్:
ఎగ్‌లోని తెల్లసొనలో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో, వాటిని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మీ జుట్టు విపరీతంగా రాలిపోతుంటే పెరుగు ,ఎగ్ తో తయారు చేసిన హెయిర్ మాస్క్ ఉపయోగించడం మంచిది. దీనిని తయారు చేయడానికి.. మీరు 1 గిన్నెలో 2 గుడ్డులోని తెల్లసొన, 1 చెంచా ఆలివ్ ఆయిల్, 1 చెంచా పెరుగు తీసుకోవాలి. ఈ మూడు పదార్థాలను కలిపి మెత్తని పేస్ట్ తయారు చేయండి. ఈ మాస్క్ ని జుట్టుకు బాగా అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఆరిన తర్వాత జుట్టును గోరు వెచ్చని నీటితో వాష్ చేయండి.

Also Read: మీలో ఈ లక్షణాలున్నాయా ? అయితే జాగ్రత్త !

వెనిగర్, ఎగ్ హెయిర్ మాస్క్:
మీ జుట్టు విపరీతంగా రాలిపోయి తిరిగి పెరగకపోతే.. ఈ మాస్క్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. వెనిగర్, ఎగ్ తో తయారు చేసిన ఈ మాస్క్ జుట్టుకు పోషణ నిస్తుంది. అంతే కాకుండా జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది. ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి.. మీరు ఒక గిన్నెలో మొత్తం ఎగ్, వెనిగర్ తీసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్ ఏర్పడే వరకు బాగా మిక్స్ చేయాలి. ఈ హెయిర్ మాస్క్‌ను మీ తలపై, జుట్టు కుదుళ్లపై అప్లై చేసి దాదాపు 40 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత షాంపూతో జుట్టును వాష్ చేయండి. ఈ మాస్క్‌ను వారానికి ఒకసారి వాడితే మాత్రం మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలకుండా ఉంటుంది.

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×