Egg Hair Mask: సాధారణంగా జుట్టు అందరికి ఒకేలా ఉండదు.. ఒకరికి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. మరి కొంత మందికి చాలా సన్నగా, పలుచగా ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే మనం ప్రతి రోజు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో.. రెగ్యులర్‌గాహెయిర్ కేర్ ఫాలో అయితే ఎలాంటి జుట్టు సమస్యలున్నా దరి చేరవు.. జుట్టు పెరగడం కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బయట ప్రొడక్ట్స్ కొనాల్సిన పని లేదు. ఇంట్లోనే దొరికే సహజ పదార్దాలతో జుట్టు పెరిగేలా చూసుకోవచ్చు. జుట్టు పెరుగుదలకు కోడి గుడ్డు బాగా ఉపయోగపడుతుంది. గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో జుట్టు సంరక్షణకు కూడా అంతే మంచిది. గుడ్డులో అనేక రకాల విటమిన్స్, జింక్, పొటాషియం, కాల్షియం వంటి పదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి. కాబట్టి గుడ్డులో వీటిని కలిపి హెయిర్ మాస్క్ ట్రై చేశారంటే.. వారం రోజుల్లోనే మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి. గుడ్డుతో హెయిర్ మాస్క్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్డు, విటమిన్ ఇ క్యాప్యూల్స్ హెయిర్ మాస్క్
జుట్టు చివర్ల చిట్లు పోయినట్లు కనిపిస్తుంటే.. ఈ హెయిర్ మాస్క్ అద్బుతంగా పనిచేస్తుంది. గుడ్డును పగలకొట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, విటమిన్ ఇ కాప్యూల్స్ కలిపి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు, చివర్ల బాగా అప్లై చేయండి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి రిజల్ట్ మీకు కనిపిస్తుంది. మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అలాగే తెల్ల జుట్టు రాకుండా నివారిస్తుంది. గుడ్డు, విటమిన్ ఇ, జుట్టు పెరుగుదలకు కావాల్సిన పోషకాలు అధికంగా ఉన్నాయి. దీని వల్ల జుట్టుకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మీరు కూడా ఓసారి ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయండి.
గుడ్డు, ఆలివ్ నూనె హెయిర్ మాస్క్..
జుట్టు పెరుగుదలకు గుడ్డు, ఆలివ్ నూనె అద్బుతంగా పనిచేస్తుంది. ఒక చిన్న బౌల్‌లో గుడ్డును పగలగొట్టి అందులో ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు అప్లై చేయండి. అరగంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు సార్లు చేయడం వల్ల జుట్టుకు తగిన పోషకాలు అందుతాయి. జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది.
Also Read: జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
గుడ్డు, అలోవెరా హెయిర్ మాస్క్..
గుడ్డులోని తెల్లసొనలో అలోవెర జెల్ వేసి జుట్టుకు అప్లై చేయండి. జుట్టుకు కావాల్సిన తేమను అందిస్తాయి. ఈ మాస్క్ డ్రై స్కాల్ప్ వల్ల వచ్చే చుండ్రును తొలగించడంలో సహాయపడుతుంది. ఇవి రెండు జుట్టు పెరిగేందుకు చక్కగా పనిచేస్తుంది. పొడి జుట్టు ఉన్నవాళ్లకు ఈ హెయిర్ మాస్క్ బాగా పని చేస్తుంది.
అరటి పండు, గుడ్డు హెయిర్ మాస్క్..
అరటిపండు, గుడ్డు కలిపి హెయిర్ మాస్క్ ట్రై చేసారంటే.. మంచి రిజల్ట్ మీకు కనిపిస్తుంది. ఈ రెండు జుట్టుకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి. గుడ్డులోని తెల్లసొనలో బాగా పండిన అరటి పండును తీసుకుని బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించండి. గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.