Anushka Shetty: అనుష్క శెట్టి (Anushka Shetty).. తెలుగు తమిళ్ భాష ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకుని, స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ మంగళూరుకు చెందిన అమ్మాయి. హీరోయిన్ కాకముందు యోగ టీచర్ గా కెరియర్ n కొనసాగిస్తూ ఉండేది. అయితే నాగార్జున (Nagarjuna) ఈమెను ‘ సూపర్ ‘ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం చేయగా.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. అయినా సరే అనుష్కకి టాలీవుడ్ లో మాత్రం అవకాశాలు భారీగా వచ్చాయి. అయితే అనుష్క ఈరోజు స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకోవడానికి కారణం అక్కినేని నాగార్జున. అంతేకాదు ఈ విషయాన్ని అనుష్క కూడా పలుమార్లు మీడియాతో చెప్పుకొచ్చింది.
అనుష్క పేరు వెనుక ఇంత కథ నడిచిందా..
ఇకపోతే ఈరోజు అనుష్క పుట్టినరోజు..ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒకటి అనుష్క పేరు కూడా. వాస్తవానికి అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. అయితే ఈమెకు ఈ పేరును సజెస్ట్ చేసింది మాత్రం ఒక స్టార్ నటుడు అని సమాచారం. అసలు విషయంలోకి వెళితే.. సూపర్ సినిమాలో ఈమె పోషించిన పాత్ర పేరు అనుష్క. ఇందులో సోనూసూద్ కూడా నటించారు ఆయనకి చెల్లి పాత్రలో నటించింది. కథ మొత్తం అనుష్క చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో అనుష్క – సోనుసూద్ మధ్య స్నేహబంధం మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమెతో తన పేరును అనుష్కగా మార్చుకోమని సజెస్ట్ చేశారట సోనూ సూద్. పూరీ జగన్నాథ్ కూడా ఇదే పేరును టైటిల్ లో స్క్రీన్ మీద వేసేస్తాను అని అడగ్గా.. దానికి ఈమె ఓకే చెప్పిందట. ఇక ఈ కారణంగానే స్వీటీ శెట్టి కాస్త అనుష్క శెట్టి గా మారిపోయింది.
అనుష్క కెరియర్ కి దోహదపడ్డ సోనూసూద్..
ఇకపోతే అనుష్క – సోనూ సూద్ ఇద్దరూ కూడా ‘ అరుంధతి ‘ సినిమాలో కలిపి నటించారు. అరుంధతి సినిమాలో మంచు లక్ష్మి (Manchu Lakshmi)ని హీరోయిన్ గా అనుకున్నారు కోడి రామకృష్ణ (Kodi Ramakrishna). కానీ మంచు లక్ష్మి ఈ పాత్రను రిజెక్ట్ చేయడంతో ఇది కాస్త అనుష్కకు వెళ్ళిపోయింది. అయితే ఈ పాత్ర అనుష్కకు రావడానికి కారణం కూడా సోనూ సూద్ అనే చెప్పాలి. కోడి రామకృష్ణ తో అనుష్కను అరుంధతి పాత్రకు ఎంపిక చేసుకోమని సలహా ఇచ్చారట. అలా ఇండస్ట్రీకి రావడానికి నాగార్జున కారణమైనా ఆమె ఎదుగుదలకు సోనుసూద్ ప్రధాన పాత్ర పోషించారు అని చెప్పవచ్చు.
అనుష్క సినిమాలు..
ఇక అనుష్క విషయానికి వస్తే గతంలో డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ‘ వేదం ‘ సినిమాలో నటించిన ఈమె .. ఇప్పుడు మళ్లీ ఆయన డైరెక్షన్ లోనే ఘాటి (Ghaati)అనే సినిమాలో నటిస్తోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి అనుష్క పుట్టినరోజు సందర్భంగా వైల్డ్ లుక్ లో ఉన్న అనుష్క పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు గ్లింప్ కూడా విడుదల చేయబోతున్నారు. ఏది ఏమైనా అనుష్క పేరు వెనుక అంత కథ జరిగిందా అని తెలిసి నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.