BigTV English

India-Bhutan check post: భారత్-భూటాన్ మధ్య మరో అడుగు.. ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్‌‌ ప్రారంభించిన మంత్రి బండి సంజయ్

India-Bhutan check post: భారత్-భూటాన్ మధ్య మరో అడుగు.. ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్‌‌ ప్రారంభించిన మంత్రి బండి సంజయ్

India-Bhutan check post: భారత్-భూటాన్ మధ్య సంబంధాలు మరో అడుగు ముందుకేశాయి. కొత్తగా ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు ప్రారంభం కావడంతో వ్యాపార, వాణిజ్య, సేవా కార్యకలాపాలను మరింత సులభతరం కానున్నాయి. సరిహద్దు ప్రయాణం, ప్రాంతీయ కనెక్టివిటీకి గణనీయమైన పురోగతిని కనిపించనుంది.


భారత్-భూటాన్ మధ్య సంబంధాల్లో కీలక అడుగు పడింది. ఇందులోభాగంగా అసోంలోని దర్రంగా ప్రాంతం వద్ద ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. గురువారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది.

భూటాన్ ప్రధాని, అసోం గవర్నర్‌తో కలిసి చెక్ పోస్టును ప్రారంభించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు వల్ల ఇరుదేశాల మధ్య పెరగనున్న ప్రజా సంబంధాలు పెరగనున్నాయి. దీంతో భారత్‌కు లాజిస్టిక్ ఖర్చుల భారం తగ్గనుంది.


భూటాన్‌కు కేవలం 700 మీటర్ల దూరంలో ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు ప్రాంతం ఉంది. దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఐసీపీ దర్రంగా ప్రాంతం ఇరుదేశాల మధ్య అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడమేకాదు ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది.

ALSO READ: జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైటింగ్, ఎందుకు?

అంతకుముందు అసొం చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు స్వాగతం పలికారు ఆ రాష్ట్ర డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు. అనంతరం అసొం గవర్నర్‌తో కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడి నేరుగా దర్రంగా ప్రాంతానికి చేరుకున్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×