BigTV English

Egg Sherva: ఎగ్ షేర్వా ఇలా చేశారంటే అన్నంలోనే కాదు, రోటీ చపాతీతో కూడా తినేయవచ్చు

Egg Sherva: ఎగ్ షేర్వా ఇలా చేశారంటే అన్నంలోనే కాదు, రోటీ చపాతీతో కూడా తినేయవచ్చు

మటన్ షేర్వా ఉండాలంటే ఎక్కువ సమయం పట్టేస్తుంది. మీకు షేర్వా తినాలనిపిస్తే కోడిగుడ్డుతో చేసుకొని చూడండి. అప్పటికప్పుడు చాలా సులువుగా తయారైపోతుంది. దీన్ని వేడి వేడి అన్నంలోనే కాదు, బగారా రైస్ లో చపాతీ, రోటీలో అలాగే దోశతో, ఇడ్లీతో తిన్నా అద్భుతంగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. ఎగ్ షేర్వాలో ఎక్కువ పోషకాలు కూడా ఉంటాయి. ఇది తింటున్న కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. కాబట్టి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.


ఎగ్ షేర్వా రెసిపీకి కావలసిన పదార్థాలు
కోడిగుడ్లు – ఆరు
ఉల్లిపాయలు – రెండు
పచ్చిమిర్చి – ఐదు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
కొత్తిమీర తరుగు – ఐదు స్పూన్లు
లవంగాలు -నాలుగు
యాలకుల – మూడు
ఎండు కొబ్బరి పొడి – రెండు స్పూన్లు
పుదీనా తరుగు – నాలుగు స్పూన్లు
కరివేపాకులు – గుప్పెడు
కారం – ఒక స్పూను
ధనియాల పొడి – ఒక స్పూను
టమోటోలు – మూడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
బిర్యాని ఆకు – ఒకటి
నీళ్లు – తగినన్ని
సోంపు గింజలు – అర స్పూను
కసూరి మేథి – ఒక స్పూను

ఎగ్ షేర్వా రెసిపీ ఇదిగో
1. కోడిగుడ్లను ముందుగానే ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు మిక్సీ జార్లో కొత్తిమీర, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి పొడి కొంచెం నీళ్లు వేసి రుబ్బుకొని మసాలా పేస్ట్ ను పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు టమోటో ముక్కలను కూడా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
4. ఉల్లిపాయలను పచ్చిమిర్చిని సన్నగా తరిగి సిద్ధం చేసుకోవాలి.
5. స్టవ్ మీద కలాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో సోంపు గింజలు, బిర్యాని ఆకు వేసి వేయించుకోవాలి.
6. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగును వేసి అవి రంగు మారేవరకు వేయించుకోవాలి.
7. ఉల్లిపాయలు రంగు మారితే షేర్వా రంగు కూడా ముదురు రంగులో వస్తుంది.
8. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకులు వేసి బాగా వేయించాలి. ఇవి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.
9. తర్వాత టమోటో ప్యూరీని వేసి బాగా కలుపుకోవాలి. టమాటో ప్యూరీ పచ్చిగా ఉంటుంది. కాబట్టి కనీసం 10 నిమిషాలు దీన్ని వేగనివ్వాలి.
10. ఆ తర్వాతే కారం, పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి.
11. మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత మూత తీస్తే టమోటా మిశ్రమం బాగా రంగు మారి ఉడుకుతూ ఉంటుంది.
12. నూనె కూడా అంచుల్లో తేలినట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో ఉడికించిన కోడిగుడ్లను కొత్తిమీర, పుదీనా తరుగును, ఒక గ్లాసు నీటిని వేసి బాగా కలిపి పైన మూత పెట్టాలి.
13.ఆ పులుసు బాగా మరిగి పొంగుతున్నట్టు అవుతుంది. ఆ సమయంలో కొంచెం కసూరి మేతిని చల్లి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే ఎగ్ షేర్వా తినేందుకు సిద్ధమైపోయింది.


ఎగ్ షేర్వాను వేడివేడి అన్నంతో ఒకసారి తిని చూడండి. ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇడ్లీ లేదా దోశతో తిన్నా కూడా బాగుంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మీరు దీనికి ఫిదా అయిపోతారు. రోటీ, చపాతీ ఇలా దేనితోనైనా అద్భుతంగా ఉండే రెసిపీ ఇది. బగారా రైస్ తో ఈ ఎగ్ షేర్వా కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో వేసినవన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. కాబట్టి ఒకసారి ఎగ్ షేర్వా చేసుకుని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.

Related News

Bad Breakfasts: బ్రేక్ ఫాస్ట్‌లో ఇలాంటివి తిన్నారంటే గుండె పోటు ప్రమాదం పెరిగిపోతుంది అంటున్న డాక్టర్లు

Silky Hair tips: జుట్టుకు షాంపూ పెట్టాక ఈ ఒక్క వస్తువుతో మీ వెంట్రుకలను శుభ్రం చేసుకోండి చాలు, సిల్కీగా మారిపోతాయి

Sweet Corn Kebab: వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుందా? స్వీట్ కార్న్‌తో కబాబ్ చేయండి అదిరిపోతుంది

Millets: మిల్లెట్స్ తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి

Home remedies: రాత్రి దిండు కింద పెట్టే సింపుల్ హోమ్ రెమిడీ.. ఇలా చేస్తే..

Onion juice: జుట్టుకు ఉల్లిపాయ రసం రాస్తున్నారా? వీటిని కలిపితే..

Big Stories

×