Kolkata Crime: కోల్‌కతాలో దారుణం జరిగింది. లా కాలేజీలోనే.. లా చదివే విద్యార్థినిపై దారుణానికి పాల్పడ్డారు ముగ్గురు దుర్మార్గులు. ఈనెల 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాస్బా ప్రాంతంలో ఉన్న లా కాలేజీలో.. సాయంత్రం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర గంటల మధ్యలో.. ఈ దారుణం జరిగినట్లు ప్రచారం సాగుతోంది. న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు స్టూడెంట్స్ కాగా.. మరొకరు పాత స్టూడెంట్‌గా చెబుతున్నారు. కోల్‌కతా లా కాలేజీ ఘటనపై మండిపడింది బీజేపీ. ఇది అత్యంత భయానక ఘటనగా అభివర్ణించారు కమలం నేతలు.
అసలేం జరిగందంటే
24 ఏళ్ల యువతి లా కాలేజీలో పరీక్షలకు సంబంధించిన.. ఫామ్స్ నింపేందుకు బుధవారం మధ్యహ్నం 12 గంటల సమయంలో.. కాలేజీకి వచ్చినట్లు బాధితురాలు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు.. యువతి ఫస్ట్ కాలేజీ యూనియన్ గదిలో కూర్చింది. ఆ తర్వాత ప్రధాన నిందుతుడు కాలేజీ గేట్‌ను లాక్ చేయని ఆదేశించాడు. క్యాంపస్ సెక్యూరిటీ గదిలో ఆమెపై అత్యాచారం జరిగినట్లు యువతి పేర్కొంది.
బాధితురాలు ఫిర్యాదు ఆదారంగా.. ఎఫ్ఐఆర్ ప్రకారం.. ప్రధాన నిందుతులు తృణమాల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్, దక్షిణ కోల్ కతా జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా(31) గా గుర్తించారు. ఫస్ట్ ఇయర్ విద్యార్ధి జైబ్ అహ్మద్(19), మరో స్టూడెంట్ 20 ఏళ్ల ప్రమిత్ ముఖర్జీ నిందితులుగా ఉన్నారు.
ప్రధాన నిందుతుడైన మిశ్రా అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోవాలని అడిగాడని యువతి తెలిపింది. కానీ ఆమె తిరస్కరించి తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది. దీంతో ఆ కోపంతో తనని గదిలోకి లాక్కెళ్లాడని, తన ప్రియుడని చంపుతానని బెదిరించాడని, తమ తల్లిదండ్రులను అరెస్ట్ చేపిస్తానని బెదిరించాడని పోలీసులుకు తెలిపింది. అంతేకాదు కాళ్లు పట్టుకుని వదలమన్న వదల్లేదు.. బలవంతంగా బట్టలు విప్పి, వీడియోలు రికార్డు చేశాడని.. సహకరించకపోతే వాటిని సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరించాడని బాధితురాలు తెలిపింది. ఆ ముగ్గురు కలిసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని వివరించింది. తాను ఎదురుదాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించానని, అయితే నిందితుడు తనను హాకీ స్టిక్‌తో కొట్టడానికి ప్రయత్నించినప్పుడు గాయాలయ్యాయని ఆమె చెప్పింది.
దీంతో గురువారం సాయంత్రం దక్షిణ కోల్‌కతాలోని.. కస్బాలోని సిగ్నల్ క్రాసింగ్ నుండి ఇద్దరు నిందితులు మిశ్రా, అహ్మద్‌లను అరెస్టు చేశారు. వారి మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. మూడవ నిందితుడు ముఖర్జీని గురువారం తెల్లవారుజామున 12.30 గంటల ప్రాంతంలో అతని నివాసం నుండి అరెస్టు చేశారు. అతని మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సాక్షుల వాంగ్మూలం రికార్డు చేశారు. నేరం జరిగిన ప్రదేశం నుంచి ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు.
Also Read: హైదరాబాద్‌లో ఘోరం.. బాలుడి పైనుంచి దూసుకెళ్లిన టిప్పర్
ఈ ఘటనపై బీజేపీ ఐటీ సెల్ ఛీఫ్ అమిత్ మాల్వియా స్పందించారు. ఈ సంఘటన భయంకరమైందిగా అభివర్ణించారు. ఇటీవల ఆర్జీకల్ అత్యాచార ఘటనను ప్రస్తావిస్తూ.. బెంగాల్‌లో మహిళలపై నిత్యం నేరాలు జరుగుతున్నాయని, అధికార టీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ప్రభుత్వం మహిళలకు పీడకలగా మారుస్తోందని దుయ్యబట్టారు. బాధితురాలికి అండగా బీజేపీ నిలుస్తుందని చెప్పారు. కోల్‌కతా మేయర్ ఫిర్దద్ హకీమ్ మాట్లాడుతూ.. తనకు ఈ ఘటన గురించి తెలియదని, పోలీసులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.