BigTV English

Summer Skin Care: వేసవిలో మీ చర్మాన్ని మెరిపించండిలా!

Summer Skin Care: వేసవిలో మీ చర్మాన్ని మెరిపించండిలా!

Summer Skin Care Tips: సమ్మర్ సీజన్ ప్రారంభమైంది. ఇక చర్మాన్ని రక్షించడానికి ప్రత్యేక చర్యలు అవసరం. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు మన చర్మం పొడిబారుతోంది. అలానే ఇతర చర్మ సమస్యలకు దారి తీయొచ్చు. కాబట్టి చర్మం డీహైడ్రేట్ కాకుండా చూడటం చాలా ముఖ్యం. ఎండ నుంచి తట్టుకోవడానికి విటమిన్ సి, రెటినోల్ వంటి చికిత్సలు చర్మానికి అవసరం. మండే ఎండల్లో చర్మం మెరవాలంటే ఏమి చేయాలో ఇప్పుడు చూద్దాం.


సమ్మర్‌లో సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్‌లు అవసరం ఉంది. ఎండలో చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ ముఖ్య సాధనంగా ఉపయోగపడుతుంది. సన్‌స్క్రీన్ బ్రాండ్‌లు సన్ ట్యాన్ ప్రధాన కారణమైన అతినీలలోహిత B (UVB) కిరణాలను ఎంతవరకు నిరోధించగలదో సూచించడానికి సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (SPF)ని వినియోగిస్తారు. ఎక్కువ SPF సంఖ్యలు UVB కిరణాల నుండి చర్మ రక్షణను తెలుపుతాయి.

Read More: సమ్మర్‌లో పర్ఫెక్ట్ డ్రింక్స్ ఇవే..!


ఎండ తీవ్రత పెరిగినప్పుడు.. చర్మం త్వరగా తేమను కోల్పోతుంది. పొడిగా, పొరలుపొరలుగా తయారువుతుంది. ఈ క్రమంలో దీన్ని ఎదుర్కోవడానికి రూపొందించిన ఉత్పత్తులను ఉపయోగించడం ముఖ్యం. మీ చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి మాయిశ్చరైజర్లు వాడాలి. అంతే కాకుండా ఇంజెక్షన్ చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ చికత్సలు ముఖం,మెడ,చేతులు, మోకాళ్లు , పొత్తికడుపు ప్రాంతాలపై సమర్థవంతంగా పనిచేస్తాయి.

Read More: ఎండ పుష్కలం.. విటమిన్-డీ లోపందేనికి?

వేసవిలో చర్మాన్ని రక్షించడానికి హైడ్రాఫేషియల్ అనేది ప్రముఖంగా ప్రాచుర్యం పొందుతున్న చికిత్స. ఈ చికిత్స అద్భుతమైన ఫలితాలను అందించడానికి ఎక్స్‌ఫోలియేషన్,క్లెన్సింగ్,హైడ్రేషన్, ఎక్స్‌ట్రాక్షన్, యాంటీఆక్సిడెంట్ ప్రొటెక్షన్‌లను ఏకం చేస్తుంది.

అలానే మాయిశ్చరైజింగ్ సీరమ్‌లను ఏకకాలంలో చొప్పించేటప్పుడు మలినాలను, చనిపోయిన చర్మ కణాలను తొలగించడం ద్వారా మీ చర్మం మెరుస్తుంది. రంధ్రాలను వాక్యూమ్ చేయడానికి చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేయడం ఈ చికిత్సలో ఎంతో ముఖ్యం. చర్మ సంరక్షణకు శక్తివంతమైన పరిష్కారాన్ని కోరుకునే ఎవరికైనా హైడ్రాఫేషియల్స్ సరైన ఎంపికని నిపుణులు చెబుతున్నారు.

Disclaimer: ఈ కథనం వైద్యుల సలహా మేరకు రూపొందిచబండి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×