E-Paper
Advertisement

OTT Movie : కోరికలు తీర్చే యంత్రంలా భార్యను ట్రీట్ చేసే భర్త… ఆమెకేమో మరో అమ్మాయిపై ఇంట్రెస్ట్

OTT Movie : కోరికలు తీర్చే యంత్రంలా భార్యను ట్రీట్ చేసే భర్త… ఆమెకేమో మరో అమ్మాయిపై ఇంట్రెస్ట్
Advertisement

OTT Movie : ఈరోజుల్లో డిజిటల్ మీడియా ఎంతలా అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా ఎంటర్టైన్మెంట్ కోసం డిజిటల్ మీడియాని ఉపయోగించుకుంటున్నారు. డిజిటల్ మీడియా లేని రోజుల్లో ఒకప్పుడు నాటకాలతో, ఆ తర్వాత మూగ సినిమాలతో, ఇప్పుడు టాకీ సినిమాలు తో ఎంటర్టైన్ అవుతున్నారు ప్రేక్షకులు. ఓటిటిలో ఒక మాటలు లేని రొమాంటిక్ మలయాళం మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ రొమాంటిక్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.

ఎస్ ఎస్ ఫ్రేమ్స్

Advertisement

ఈ రొమాంటిక్ మలయాళం మూవీ పేరు “హోలీ వూండ్” (Holy wound). ఈ మూవీలో పెళ్లి మీద విరక్తి చెందిన ఒక అమ్మాయి తన స్నేహితురాలితో సహజీవనం చేయాలనుకుంటుంది. వీరిద్దరి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ రొమాంటిక్ మలయాళం మూవీ ‘ఎస్ ఎస్ ఫ్రేమ్స్ డాట్ కాం’ (www.ss frames.com) లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

జానకి అనే అమ్మాయికి పెళ్లి అవ్వడంతో తన భర్త దగ్గర కాపురం చేసుకుంటూ ఉంటుంది. అయితే అతను ఆమెను కోరికలు తీర్చే ఒక యంత్రంలా వాడుకుంటూ ఉంటాడు. ఆమెను ఆ మూడు రోజుల్లో కూడా ఏకాంతంగా గడపడానికి హింసిస్తూ ఉంటాడు. ఆమెకు ఇష్టం లేకపోయినా పశువులా మీద పడి  ఆ పని కానిస్తుంటాడు. ఎప్పుడూ భర్తగా ప్రవర్తించకుండా మొరటుగా ఉంటాడు. జానకి తన జీవితం ఇలా అయినందుకు బాధపడుతూ, తన పాత రోజులను గుర్తుకు తెచ్చుకుంటుంది. పెళ్ళికాకముందు అమృత అనే అమ్మాయి, జానకి ఇద్దరూ ఆడుకుంటూ సరదాగా గడిపేటోళ్లు. అలాగే వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ హద్దు దాటి సరసాలు ఆడేంతవరకు వెళుతుంది. ప్రతిరోజు ఈ అమ్మాయిలు ఇద్దరూ తమకు నచ్చిన విధంగా, ఏకాంతంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అనుకోకుండా అమృత ఒకసారి జానకికి చెప్పకుండా ఎటో వెళ్లిపోతుంది. ఆ తర్వాత జానకికి పెళ్లి అయిపోతుంది. ఇప్పుడు జీవితం ఇలా ఉంటుంది. ఈ జీవితం నరకంగా భావించిన జానకి, భర్తకి చెప్పకుండా ఒక రోజు బయటికి వెళ్ళిపోతుంది.

బయటికి వెళ్లిన జానకి అమృతని కలసి ఆమె చేసే పని చూసి ఆశ్చర్యపోతుంది. అమృత ఒక చర్చిలో నన్ గా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని ఏడుస్తూ దేవుడు సన్నిధికి రమ్మని అమృత జానకిని కోరుతుంది. ఇలా ఉండగా అక్కడికి జానకి భర్త వచ్చి బలవంతంగా జానకిని తీసుకువెళ్తాడు. ఆ తరువాత జానకి కోసం మళ్లీ అమృత వీళ్ళ ఇంటికి వస్తుంది. చివరికి జానకి, అమృతలు మళ్ళీ కలసి వాళ్లకు నచ్చినట్టు జీవితం గడుపుతారా. భర్త పెట్టే నరకం నుంచి జానకి బయట పడుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హోలీ వూండ్ (Holy wound) రొమాంటిక్ మూకీ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీలో మాటలు లేనందువల్ల వారి ముఖ కలవికలతోనే మూవీ లవర్స్ సంభాషణ ను అర్థం చేసుకోవాలి.

Tags

Related News

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×