Sleep Technique| ఈ రోజుల్లో అందరూ బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. పని మీద ధ్యాసతో ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా రోగాల బారిన పడుతున్నారు. అయితే ఆరోగ్య సమస్యలన్నింటిలోనూ మానసిక సమస్యలతో బాధపడేవారు ఎక్కువ మంది ఉన్నారు. ఆఫీసు, లేదా వృత్తి రీత్యా ఉండే ఒత్తిడి వల్ల చాలా మంది డిప్రెషన్ బారినపడుతున్నారు. దీని వల్ల వారికి సమయానికి నిద్రపట్టడం లేదు.
రాత్రి వేళ సరైన సమయానికి నిద్ర పట్టకపోతే డయాబెటీస్ (మధుమేహం), గుండె సంబంధిత రోగాలు ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటి స్థితిలో చాలా మంది నిద్ర పట్టడానికి నిద్ర మాత్రలు ఉపయోగిస్తారు. కానీ అవి కొంతకాలం మాత్రమే పనిచేస్తాయి. పైగా అవి ఆరోగ్యానికి చేటు చేస్తాయి. అందుకే ఈ సమస్యలేమీ లేకుండా మంచి నిద్ర త్వరగా పట్టేందుకు ఒక టెక్నిక్ ఉంది. దాన్ని ఉపయోగిస్తే ఒత్తిడి అంతా దూరమవుతుంది.
త్వరగా నిద్ర పట్టడానికి 4 – 7 – 8 ఫార్ములా
మీరు సరైన పోషకాలు గల భోజనం ఎలా తీసుకోవాలి.. చాలా మంది నిపుణులు చెప్పే సూచనల గురించి వినే ఉంటారు. కానీ నిద్ర త్వరగా పట్టడానికి కూడా ఒక విధానం ఉంది. మీరు ప్రతి రోజు జీవితంలో ఒత్తిడి ఎదుర్కొంటూ అలసటతో నిద్ర కోల్పోతుంటే ఈ సీక్రెట్ మీకు మాత్రమే.
డాక్టర్ ఆండ్రూ వెయిల్ ఈ కొత్త నిద్ర విధానాన్ని కనుగొన్నారు. అయితే ఇది ప్రాచీన కాలంలో ఉపయోగంలో ఉండేదని ఆయన తెలిపారు. ప్రాచీన యోగా విధానాల ప్రకారం.. 4 – 7 – 8 ఫార్ములా ప్రకారం.. శ్వాసను నియంత్రిస్తూ శరీరాన్ని ‘రెస్ట్ డైజెస్ట్’ మోడ్ లో యాక్టివేట్ చేస్తే త్వరగా రిలాక్స్ అవుతూ నిద్ర పట్టేస్తుంది.
Also Read: వేసవిలో చర్మం జిడ్డుగా ఉంటోందా?.. ఉదయాన్నే ఈ చిట్కాలు పాటించండి మెరిసిపోతారు
ఎలా పనిచేస్తుంది?
ముందుగా నాలుగు సెకన్ల పాటు ముక్కు ద్వారా శ్వాస లోపలికి పీల్చుకోవాలి. ఆ తరువాత 7 సెకన్ల పాటు శ్వాస హోల్డ్ చేయాలి. ఆ తరువాత మెల్లగా 8 సెకన్ల పాటు శ్వాస బయటికి వదలాలి. దీన్ని రెండు నుంచి నాలుగు సార్లు రిపీట్ చేస్తే సరిపోతుంది. ఆ తరువాత మీ శరీరం రిలాక్స్ ఫీల్ అవుతుంది. తద్వారా నిద్ర పట్టేస్తుంది. ఈ ప్రక్రియ పాటిస్తే.. రక్త పోటు తగ్గుతుంది. గుండె కూడా కాస్త నెమ్మదిగా కొట్టుకుంటూ ఒత్తిడి హర్మోన్లు తగ్గిపోతాయి. దీంతో శరీరానికి త్వరగా నిద్ర పట్టేస్తుంది.
ఈ 4 – 7 – 8 ఫార్ములా నిద్ర పట్టడం కోసమే కాదు. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. తద్వారా డిప్రెషన్ కూడా తగ్గిపోతుంది. మీ స్నేహితులు, లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా నిద్రలేమి, ఒత్తిడి, డిప్రెషన్ తో బాధపడుతుంటే ఈ ఫార్ములాని వారికి కూడా సూచించండి.