BigTV English

Pahalgam Attack: టూరిస్టులను చంపిన రాక్షసుడు వీడే

Pahalgam Attack: టూరిస్టులను చంపిన రాక్షసుడు వీడే

Pahalgam Attack:  జమ్మూకాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టెర్రరిస్టుల దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎక్కువగా పర్యాటకులు ఉన్నారు. మృతి చెందినవారిలో ఇద్దరు విదేశీయులు, మరో ఇద్దరు స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. టూరిస్టులపై దాడి చేసిన కాల్పులు జరిపిన ఉగ్రవాదుల మొదటి ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఆ టెర్రరిస్ట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఉగ్రవాది ఫోటో బయటకు

పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులలో ఒకరు ఆయుధాలు పట్టుకుని పఠానీ సూట్ ధరించి ఉన్నట్లు ఈ ఫోటోలో ఉంది. ఒక చేతిలో గన్ పట్టుకుని పరుగెత్తుతూ ఉంది. మంగళవారం రాత్రి ఒంటి లేదా రెండు గంటల సమయంలో ఈ ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటోపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు-సీఆర్పీఎఫ్-ఆర్మీ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.


ఆర్మీ డ్రెస్‌లో ఉగ్రవాదులు వచ్చారని చెబుతున్నా, పఠానీ సూట్‌తో ఉగ్రవాది  కనిపించడంపై మరింత అనుమానాలు మొదలయ్యాయి. ఓ వైపు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్న ఫోటోపై దర్యాప్తు మొదలుపెట్టారు. సమీప ప్రాంతంలో ఎవరైనా తమ ఫోన్‌తో చిత్రీకరించారా? లేక కావాలనే ఎవరైనా చేస్తున్నారా లోతుగా విచారణ మొదలుపెట్టారు. పోలికలు గమనిస్తే టెర్రరిస్టు మాదిరిగా ఉన్నాడని అంటున్నారు.

ఇద్దరు విదేశీయులు మృతి

మంగళవారం మధ్యాహ్నం కాశ్మీర్‌లోని పహల్గామ్ పట్టణానికి సమీపంలో పర్యాటక ప్రదేశం బైసరన్ లోయలో టూరిస్టులపై విరుచుకుపడ్డారు ఉగ్రవాదులు. దొరికిన వాళ్లను చంపుతూ పోయారు. ఈ ఘటనలో 28 మంది మరణించారు. మృతి చెందినవారిలో ఎక్కువగా మిగతా రాష్ట్రాల నుండి వచ్చినవారు ఉన్నారు. యుఎఈ, నేపాల్‌కు చెందిన ఇద్దరు విదేశీయులున్నారు.

ALSO READ: హనీమూన్‌కి వెళ్తే ఉగ్రవాదులు ఎంత దారుణంగా చంపారంటే

ఈ ఉగ్రవాద దాడిలో దాదాపు 8 నుంచి 10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం. వారిలో 5 నుంచి 7 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందినవారు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తుపై మొదలుపెట్టారు అధికారులు. ఓ వైపు జమ్మూకాశ్మీర్ పోలీసులు, మరోవైపు ఆర్మీ అధికారులు సేకరించిన సమాచారాన్ని అధికారులకు అందజేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో ఉగ్రదాడి గురించి అధికారులు చర్చించనున్నారు.

ప్లీజ్ మమ్మల్ని చంపొద్దు అంటూ

మరోవైపు బైసరన్ లోయలో చుట్టూ ఎత్తైన కొండలు ఉన్నాయి. గాయపడినవారు పరిగెత్తుకుంటూ వచ్చి కుప్పకూలిపోయారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.  తమ కళ్ల ఎదుట భార్యాభర్తలు, చిన్నారులు, బంధువులు, స్నేహితులను చాలామంది కోల్పోయారు. ఆ సన్నివేశాలను గుండెల విసేలా రోదించారు మరికొందరు టూరిస్టులు.

అదే క్రమంలో ఘటన గురించి తెలియగానే ఆర్మీ బలగాలు రంగంలోకి దిగేశాయి. ఉగ్రవాదులు కూడా ఆర్మీ డ్రెస్‌లో కనిపించడంతో తమను చంపేస్తారని కంగారు పడ్డారు. మిమ్మల్ని చంపొద్దు ప్లీజ్ అంటూ వారిని వేడుకున్నారు. మిమ్మల్ని కాపాడటానికి వచ్చామని, ఆర్మీ జవాన్లు అని చెప్పడంతో పర్యాటకుల్లో ఆ టెన్షన్ తగ్గింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

 

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×