E-Paper
Advertisement

ఏడాది పాటు 5G డేటా, కాల్స్, ఓటీటీ కావాలా? Airtel, Jio, Viలో అత్యుత్తమ ప్లాన్స్ ఇవే.. వర్త్ వర్మా వర్త్!

ఏడాది పాటు 5G డేటా, కాల్స్, ఓటీటీ కావాలా? Airtel, Jio, Viలో అత్యుత్తమ ప్లాన్స్ ఇవే.. వర్త్ వర్మా వర్త్!
Advertisement

Annual Recharge Plans: దేశంలో టాప్ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా (Vi).. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులో ఉంచింది. అయితే పదే పదే రీఛార్జ్ చేసుకునే సమస్య లేకుండా ఏడాదంతా ఫ్రీకాల్స్, డేటా, ఓటీటీ బెనిఫిట్స్ కోరుకునేవారి కోసం ఈ టెలికాం సంస్థలు.. ఆకర్షణీయ ప్లాన్లను అందిస్తున్నాయి. వాటిలో యూజర్లకు ఎక్కువ బెనిఫిట్స్ అందించే అత్యుత్తమైన వార్షిక ప్లాన్లను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

జియో 365 రోజుల ప్లాన్లు

జియో ప్రస్తుతం 365 రోజుల వ్యాలిడిటీతో రెండు కీలక ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. రూ. 3,999 ప్లాన్ ద్వారా రోజుకు 2.5GB హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అర్హులైన వినియోగదారులకు అపరిమిత 5G డేటా అందుతుంది. దీంతో పాటు ఫ్యాన్‌కోడ్, జియో టీవీ, 50GB ఉచిత స్టోరేజ్‌తో జియో AI క్లౌడ్, జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి. అంతేకాకుండా 5,000GB క్లౌడ్ స్టోరేజ్‌తో కూడిన గూగుల్ జెమిని ప్రో 18 నెలల సబ్‌స్క్రిప్షన్ కూడా ఇందులో లభిస్తుంది.

జియో రూ. 3,599 ప్లాన్

Advertisement

మరోవైపు 365 రోజుల వ్యాలిడిటీతోనే జియో రూ. 3,599 ప్లాన్ కూడా తీసుకొచ్చింది. ఇది కూడా రోజుకు 2.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు అందిస్తుంది. దీంతో పాటు జియో టీవీ ప్రో ప్యాక్ వోచర్, 120GB అదనపు డేటా, 50GB జియో AI క్లౌడ్ స్టోరేజ్ వస్తాయి. ఈ ప్లాన్ ద్వారా కూడా 18 నెలల గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్, జియో హాట్‌స్టార్ ప్రయోజనాలు పొందవచ్చు.

ఎయిర్‌టెల్ 365 రోజుల ప్లాన్లు

ఎయిర్ టెల్ తన యూజర్ల కోసం ఏడాది వ్యాలిడిటీతో రూ. 3,599, రూ. 3,999 ప్లాన్లను తీసుకొచ్చింది. రూ. 3,599 ప్లాన్ ద్వారా ప్రతిరోజూ 2GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఇక రూ. 3,999 ప్లాన్ లో రోజుకు 2.5GB డేటా, అపరిమిత కాలింగ్, 100 SMSలతో పాటు 12 నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. ఈ రెండు ప్లాన్లలోనూ అర్హులైన వినియోగదారులకు అపరిమిత 5G డేటా సదుపాయం ఉంది.

వొడాఫోన్ ఐడియా ప్లాన్లు

Advertisement

వొడాఫోన్ ఐడియా సైతం ఏడాది వ్యాలిడిటీతో పలు రకాల వార్షిక ప్లాన్లను అందుబాటులో ఉంచింది. కేవలం కాల్స్ మాత్రమే కోరుకునేవారి కోసం రూ. 1,189 (50GB డేటా), రూ. 1,849 (అపరిమిత కాల్స్, 3,600 SMSలు), రూ. 2,249 (30GB డేటా, అపరిమిత కాల్స్, 3,600 SMSలు) ప్లాన్లు ఉన్నాయి. డేటా వినియోగదారుల కోసం రూ. 3,599 నుంచి ప్రారంభమయ్యే ప్లాన్లను రోజుకు 2GB డేటాతో ఆఫర్ చేస్తోంది. ఇందులో రూ. 3,699 ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్ ను, రూ. 3,799 ప్లాన్ అమెజాన్ ప్రైమ్ లైట్ ను వీఐ అందిస్తోంది. ఇక రూ. 3,999 ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ లైట్ రెండింటినీ పొందొచ్చు. ఇవన్నీ రోజుకు 2GB డేటా, 100 SMSలు, అపరిమిత కాల్స్ అందిస్తాయి.

Also Read: నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

ఏ ప్లాన్ బెటర్?

కేవలం బేసిక్ కాలింగ్ అవసరాలు ఉన్నవారు వొడాఫోన్ ఐడియా తక్కువ ధర ప్లాన్లను ఎంచుకోవచ్చు. కానీ ఎక్కువ డేటా, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్లు కోరుకునే వినియోగదారులకు జియో, ఎయిర్‌టెల్ వార్షిక ప్లాన్లు ఎంచుకుంటే ఎక్కువ లాభం ఉంటుంది.

Also Read: BCCIకి అసలు సిగ్గుందా ? మొహ్సిన్ నఖ్వీతో దేవజిత్ సైకియా మీటింగ్ పై ట్రోలింగ్

Tags

Related News

నెక్స్ట్ లెవెల్ ఆడియో వైబ్స్..అమెజాన్‌లో హాట్ కేకులా అమ్ముడవుతున్న ఇయర్‌బడ్స్

ఇంట్లో కరెంట్ లేకపోయినా.. మెుబైల్ ఛార్జింగ్ పెట్టొచ్చు.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

వైబ్స్ మారాలంటే ఈ స్పీకర్ ఉండాల్సిందే.. రూ.1199కే క్రేజీ సౌండ్

పిచ్చెక్కించే 4K విజువల్స్..ఈ ప్రొజెక్టర్‌తో లివింగ్ రూమ్‌ని థియేటర్ చేసెయండి!

ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాయిస్‌ మెయిల్ ఫీచర్..యాక్టివేట్ చేసుకోండిలా

బడ్జెట్‌లో HP కొత్త ల్యాప్‌టాప్.. ఇంటెల్ పాంథర్ లేక్ ప్రాసెసర్‌తో అదిరే స్పెసిఫికేషన్స్!

7900mah బ్యాటరీతో వచ్చిన POCO M8X 5G ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్!

Big Stories

Advertisement
×