Fenugreek For Hair: ప్రస్తుతం జుట్టు రాలడం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే ఒక సాధారణ సమస్య. కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో పాటు రసాయనలతో తయారు చేసిన షాంపూలు, ఆయిల్స్ వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం కూడా రంభమవుతుంది. అయితే ఇలాంటి పరిస్థితిలో కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించడంచాలా మంచిది. ఇదిలా ఉంటే మెంతులు జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటితో తయారు చేసిన హోం రెమెడీస్ జుట్టు రాలకుండా చేస్తాయి. అంతే కాకుండా జుట్టును ఒత్తుగా పెరిగేలా మారుస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న మెంతులను జుట్టు పెరుగుదలకు ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టుకు మెంతి గింజల ప్రయోజనాలు:
జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది: మెంతి గింజల్లో ఉండే ప్రోటీన్లు, నికోటినిక్ ఆమ్లం ఉంటాయి. ఇది జుట్టు కుదుళ్లకు పోషణ అందించడం ద్వారా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.
చుండ్రును తొలగిస్తుంది: ఇది యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా తలపై ఇన్ఫెక్షన్లతో పాటు చుండ్రును తొలగిస్తుంది. దీనిని వాడటం వల్ల తక్కువ సమయంలో చుండ్రు సమస్యలు తగ్గుతాయి.
జుట్టును బలపరుస్తుంది: మెంతికూరలో లెసిథిన్ ఉంటుంది. ఇది జుట్టును హైడ్రేట్ చేసి బలపరుస్తుంది. అంతే కాకుండా కుదుళ్లను కూడా బలోపేతం చేసి రాలడాన్ని నిరోదిస్తుంది.
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది: ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడం ద్వారా జుట్టు చిట్లిపోవడాన్ని నివారిస్తుంది. జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడే వారు తరచుగా దీనిని వాడటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
జుట్టుకు మెంతి గింజలను ఎలా ఉపయోగించాలి ?
మెంతి గింజల పేస్ట్ :
తయారీ విధానం:
1.మెంతులు గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి.
2.ఉదయం దాన్ని గ్రైండ్ చేసి పేస్ట్ లా చేయండి.
3.ఈ పేస్ట్‌ను తలకు, జుట్టుకు అప్లై చేయండి.
4.30-40 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.
మెంతులు, పెరుగుతో హెయిర్ మాస్క్:
పెరుగు, మెంతుల్లో ఉండే లాక్టిక్ ఆమ్లం జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది .
కావాల్సినవి:
పెరుగు- 1 కప్పు
మెంతుల పేస్ట్- 5-6 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
పెరుగును మెంతి పేస్ట్‌తో కలిపి హెయిర్ మాస్క్ తయారు చేసుకోండి.
దీన్ని జుట్టుకు అప్లై చేయండి.
30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి
మెంతులు, కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె జుట్టుకు లోతైన కండిషనింగ్ ఇస్తుంది. మెంతులు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.
కావాల్సినవి:
కొబ్బరి నూనె- 1 కప్పు
మెంతులు- 3-4 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
1.కొబ్బరి నూనెలో మెంతులు వేసి వేడి చేయండి.
2.చల్లబడిన తర్వాత.. ఈ నూనెతో తలకు మసాజ్ చేయండి.
3. 1 గంట తర్వాత తలస్నానం చేయండి.
మెంతులు, తేనెతో హెయిర్ మాస్క్:
తేనె జుట్టుకు తేమను అందిస్తుంది. మెంతులు కూడా జుట్టును ఒత్తుగా చేస్తాయి .
Also Read: ఇలా చేస్తే.. ఎంత నల్లటి ముఖం అయినా, తెల్లగా మెరిసిపోతుంది తెలుసా ?
కావాల్సినవి:
మెంతుల పొడి- 5 స్పూన్లు
తేనె – తగినంత
తయారీ విధానం:
1.మెంతుల పొడి, తేనె కలిపి పేస్ట్ లా తయారు చేయండి.
2. దీన్ని జుట్టుకు అప్లై చేసి 20-25 నిమిషాలు అలాగే ఉంచండి.
3. తర్వాత జుట్టును చల్లటి నీటితో కడగాలి.
వారానికి 1-2 సార్లు ఏదైనా మెంతులతో తయారు చేసిన ఈ హోం రెమెడీస్ వాడటం వల్ల మీరు జుట్టు రాలడం సమస్య నుండి బయటపడవచ్చు.