BigTV English

Cheating: మీ జీవిత భాగస్వామి.. మీతో నిజాయితీగా ఉంటున్నారో లేదో ఇలా తెలుసుకోండి, అదిరిపోయే టిప్!

Cheating: మీ జీవిత భాగస్వామి.. మీతో నిజాయితీగా ఉంటున్నారో లేదో ఇలా తెలుసుకోండి, అదిరిపోయే టిప్!

ఏ అనుబంధంలోనైనా నమ్మకం ఎంతో ముఖ్యం. అదే ప్రేమ, పెళ్లి వంటి బంధాలలో మాత్రం అదే మూల స్తంభం. కాబట్టి ప్రతి భాగస్వామి తమ పార్ట్‌నర్ మోసం చేయకుండా నిజాయితీగా ఉండాలి. అయితే కొన్ని జంటల్లో ఒకరు మాత్రమే నిజాయితీగా ఉంటున్నారు. మరొకరు లైఫ్ పార్టనర్‌కు తెలియకుండా ఇతర సంబంధాలను కొనసాగిస్తున్నారు. మీ భాగస్వామిపై మీకు అనుమానం వస్తే వారి ఫోన్ తనిఖీ  చేయకుండానే వారు మీతో నిజాయితీగా ఉంటున్నారా లేక మోసం చేస్తున్నారో సులువుగా తెలుసుకోవచ్చు. దానికి చిన్న చిన్న పద్ధతులు ఉన్నాయి. మీరు  వారి ప్రవర్తనను గమనించడం ద్వారా ఈజీగా అతడు మీ బంధంలో నిజాయితీగా ఉన్నాడో లేదో కనిపెట్టేయవచ్చు.


చివరి నిమిషంలో మారుతున్న ప్రణాళికలు
మీ జీవిత భాగస్వామి ప్రతిరోజూ ఎలా ఉంటారో మీకు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చి ఉంటారు. అలాంటిది అతని విషయంలో హఠాత్తుగా మార్పులు కనిపిస్తే… మీరు కాస్త శ్రద్ధ పెట్టాల్సిందే. చివరి నిమిషంలో ఆకస్మికంగా ప్రణాళికలు, ప్రయాణాలు మారిపోవడం కూడా అతనిలో వచ్చిన మార్పుకి కారణమే. ప్రతిరోజు ఒకే సమయానికి వచ్చే వ్యక్తి సమయాన్ని మార్చుకొని ఆలస్యంగా వస్తున్నా, షెడ్యూల్ మారిపోతున్న, బిజీగా ఉంటున్నా… రోజులో అతని ప్రవర్తన కొత్తగా వింతగా అనిపిస్తున్నా ఏదో విషయం ఉందని అనుమానించాలి.

పాస్‌వర్డ్ మార్చడం
నిజాయితీగల భాగస్వామి ఫోన్‌కు ఎలాంటి పాస్‌వర్డ్ పెట్టుకోరు. ఒకవేళ పాస్‌వర్డ్ పెట్టుకున్నా అది కచ్చితంగా తమ భాగస్వామికి తెలియజేస్తారు. అలాంటిది మీ భాగస్వామి అకస్మాత్తుగా ఫోన్ పాస్‌వర్డ్ మార్చినా, దాన్ని రహస్యంగా ఉంచుతున్నా కొన్ని రకాల యాప్ ల ద్వారా ఫోను ఓపెన్ కాకుండా చూస్తున్నా అతడు ఏదో దాస్తున్నాడని అర్థం. అలాగే ప్రతిసారి కాల్ వచ్చినా, మెసేజ్ వచ్చినా అతడి మొఖంలో భయం, ఆందోళన వంటివి కనిపిస్తున్నా కూడా మీరు అనుమానించాల్సిందే. ప్రతిసారీ ఫోన్ రాకున్నా కూడా దాని వైపే చూస్తూ… ప్రతిసారి చెక్ చేస్తూ ఉండడం, ఎక్కువగా ఫోన్లను సైలెంట్ లో ఉంచడానికి ప్రయత్నించడం వంటివన్నీ కూడా అతనిలో వచ్చిన మార్పును చూపిస్తున్నవే. ఈ ప్రవర్తన అతడు మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నాడని అర్థం.


మారుతున్న భావోద్వేగాలు
మీ భాగస్వామి అకస్మాత్తుగా మూడీగా మారడం, అతిగా మాట్లాడడం, అతడి సాధారణ ప్రవర్తనకు భిన్నంగా ఉండడం వంటివన్నీ కూడా మీరు అనుమానించాల్సిన అంశాలు. మీపై హఠాత్తుగా అతి ప్రేమ చూపించడం, మరో క్షణంలో కోపాన్ని చూపించడం వంటివన్నీ కూడా అతని భావోద్వేగాలు రోలర్ కోస్టర్ లా ఉన్నాయని చూపిస్తున్నట్టే. అతడి జీవితంలో వచ్చిన ఏదో ఒక మార్పును ఈ మూడ్ స్వింగ్స్ సూచిస్తాయి. అసలు విషయం తెలుసుకునేందుకు మీరు ప్రయత్నించాల్సిందే.

కొత్త మార్పులు
మీకు నచ్చిన దుస్తులనే వేసుకునే వ్యక్తి హఠాత్తుగా తనకు నచ్చిన దుస్తులు వేసుకుంటున్నా కూడా అనుమానించాలి. ప్రతిరోజు జిమ్‌కి వెళుతూ తన శరీరంపై అతిగా శ్రద్ధ చూపించడం, ముఖాన్ని పదేపదే అద్దంలో చూసుకోవడం, కొత్త కొత్త డ్రెస్సులు వేసుకోవడానికి ప్రయత్నించడం.. అన్నీ కూడా అనుమానాలను రేకెత్తిస్తాయి. ఆ మార్పులు మీ కోసమైతే అతడు ఆ విషయాన్ని స్పష్టంగా మీకు తెలిసేలా ప్రవర్తిస్తాడు. అలా కాకుండా తనకు తానే సొంతంగా తయారై ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతున్నాడంటే అతడికి కొత్త పరిచయాలు ఏవో ఉన్నాయని అర్థం చేసుకోండి.

మీ గట్ ఫీలింగ్ చెబుతుంది
జీవిత భాగస్వామి పై మీకు ఆప్యాయత, ప్రేమ ఖచ్చితంగా ఉంటాయి. అలాగే అతడి ప్రవర్తన కూడా మీకు ముందే తెలుస్తుంది. అతడు మూడీగా ఉన్నా మీకు అర్థమైపోతుంది. సంతోషంగా ఉన్నా మీరు గ్రహించగలుగుతారు, అలా కాకుండా అతడు ఇంట్లో ఉన్నప్పుడు మీ గట్ ఫీలింగ్ ఏం చెబుతుందో వినండి. ఏదో అనుమానం రేకెత్తించేలా అతని ప్రవర్తన ఉన్నట్టు మీ గట్ ఫీలింగ్ చెబుతూ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోండి. అతడి పై నిఘా ఉంచి అతనిలోని మార్పులకు కారణమేమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నాడేమో అని తెలుసుకునేందుకు అందరూ చేసే పని ఫోన్ చెక్ చేయడం. కానీ అధునాతన టెక్నాలజీతో వచ్చిన ఫోన్లు అందరూ ఓపెన్ చేయలేరు. ఫోన్‌ను మీరు ముట్టుకోకుండానే అతని ప్రవర్తనతో మీ బంధంలో నిజాయితీగా ఉన్నాడో లేదో అంచనా వేయొచ్చు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×