BB Telugu 8 Promo.. బిగ్ బాస్.. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తోంది. ఆదివారం డిసెంబర్ 15వ తేదీన చాలా గ్రాండ్ గా ఫినాలే నిర్వహించనున్నారు. అంతే కాదు ఈ కార్యక్రమానికి పుష్ప -2 సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న అల్లు అర్జున్ (Allu Arjun)చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారట. ఆయన చేతుల మీదుగానే విజేతకి ట్రోఫీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం 5 మంది ఫైనలిస్టులుగా నిలిచారు. ప్రేరణ, నిఖిల్, గౌతమ్, నబీల్, అవినాష్. వీరిలో నిఖిల్, గౌతమ్ టైటిల్ రేస్ లో పోటాపోటీగా పోటీ పడుతున్నారు. అటు ఓట్లల్లో తేడా ఉన్న పర్సంటేజ్ లో మాత్రం తేడా లేకపోవడంతో ఇద్దరిలో ఎవరు విజేతగా నిలవనున్నారు. అనే ఉత్కంఠ కూడా నెలకొంది. ఒకవేళ నిఖిల్ ని కాదని గౌతమ్ కి ఉన్న క్రేజ్ ను బట్టి టైటిల్ ఇస్తే మాత్రం వైల్డ్ కార్డు ఎంట్రీస్ లో టైటిల్ అందుకున్న మొదటి కంటెస్టెంట్ గా గౌతమ్ రికార్డు సృష్టిస్తారు.
ఇకపోతే ఈరోజు 103వ రోజుకు సంబంధించి ప్రోమోని విడుదల చేశారు నిర్వాహకులు. అందులో భాగంగానే తాజాగా నిఖిల్ జర్నీని వేశారు బిగ్ బాస్. ఇక అందులో భాగంగానే నిఖిల్ కి సర్ప్రైజ్ ఇస్తూ.. ఆయన జర్నీ వేయడంతో నిఖిల్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అయితే ఆ ఎమోషన్ ను కన్నీటి రూపంలో బయటకి చూపించకుండా తనను తాను మరింత స్ట్రాంగ్ చేసుకున్నారు నిఖిల్. ఇక నిఖిల్ గార్డెన్ ఏరియాలోకి రాగానే అక్కడ అద్భుతంగా ఆయన జర్నీకి సంబంధించిన జ్ఞాపకాలను.. ఫోటోల రూపంలో అలంకరించారు. వాటిని చూసి ఆ జ్ఞాపకాలను ఒక్కసారిగా నెమరు వేసుకున్నారు. ఇక తన తల్లి హౌస్ లోకి వచ్చిన ఫోటోని కూడా అక్కడ ఉంచడంతో మరింత ఎమోషనల్ అయ్యారు.
బిగ్ బాస్ మాట్లాడుతూ.. నది పుట్టుక ఒక్కో బొట్టుగానే మొదలవుతుంది. ప్రయాణంతో ప్రవాహం పెరిగి మహా నది గానే మారుతుంది. మీ ఆట తీరు కూడా అదే ప్రతిబింబించింది. ఎక్కడైతే ఏడ్చానో అక్కడే నిల్చోని ఈరోజు ఆ కన్నీటిని బయటకు రాకుండా మరింత స్ట్రాంగ్ గా మారిపోయాను అంటూ నిఖిల్ తెలిపారు. మీరు ఒక స్మార్ట్ గేమర్ మీ సహనాన్ని పరీక్షించిన ప్రతిసారి కూడా కామ్ గా ఉన్నారు. మీ సత్తాని పరీక్షించే సమయంలో రక్తాన్ని సైతం చిందించి మీ దూకుడు చూపించారు. రాయల్స్ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు.. విచ్ఛిన్నమైన ఓజీ క్లాన్ ని ఒక లీడర్ల ఒక తాటిపై తీసుకొచ్చారు. ఈ లక్షణాలే మిమ్మల్ని ఆటలో ఇంతవరకు తీసుకొచ్చి, చివరి మజిలీకి అతి చేరువలో నిలిపింది. అంటూ బిగ్ బాస్ తెలిపారు. నిఖిల్ మాట్లాడుతూ మా నాన్న మొదట ఈ బిగ్ బాస్ హౌస్ కి వచ్చేటప్పుడు చాలా నేర్పించారు. కానీ మీరు ఈ అడుగు నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఎలా ఉండాలి అనే విషయాన్ని నేర్పించారు. అంటూ తాను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత మరింత స్ట్రాంగ్ అయ్యానని చెప్పుకొచ్చారు నిఖిల్.