Flax Seeds For Hair: మంచి ఆహారంతో పాటు. .జుట్టు బలంగా ఉండటానికి అంతే కాకుండా , పెరుగుదలకు సరైన చిట్కాలు పాటించడం అవసరం. ఎందుకంటే చెడు జీవనశైలి, మార్కెట్లో లభించే షాంపూలు, ఆయిల్స్ వాడటం వల్ల జుట్టు నిర్జీవంగా మారుతుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మీరు హోం రెమెడీస్ వాడటం చాలా అలవాటు చేసుకోవాలి. వీటి వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఎలాంటి ఖర్చు కూడా మీకు ఉండదు. ఇదిలా ఉంటే జుట్టుకు అవిసె గింజలు (ఫ్లాక్ సీడ్స్) చాలా మేలు చేస్తాయి. ఇవి జుట్టును అవసరం అయిన పోషణను అందించడం ద్వారా జుట్టు బలంగా మారడంలో సహాయపడతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న అవిసె గింజలతో DIY హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకుని ఉపయోగించాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అవిసె గింజల హెయిర్ మాస్క్ యొక్క ప్రయోజనాలు:
అవిసె గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E , యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టును బలంగా, మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. ఇది జుట్టు పొడిబారడాన్ని సరిచేస్తుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.
అవిసె గింజలు, కలబంద హెయిర్ మాస్క్:
కావలసినవి:
2 టేబుల్ స్పూన్ల- అవిసె గింజలు
1 కప్పు- నీరు
2 టేబుల్ స్పూన్ల- కలబంద జెల్
మీ జుట్టు మెరుపును కోల్పోయి పొడిగా కనిపిస్తే.. అవిసె గింజలు, కలబంద హెయిర్ మాస్క్ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తుంది. దీనిని తయారు చేయడానికి, ఒక పాన్‌లో నీరు, అవిసె గింజలను వేసి నీరు జెల్ లాగా అయ్యే వరకు మరిగించండి. తరువాత కలబంద జెల్ వేసి బాగా కలపండి. ఈ మాస్క్‌ను జుట్టు మూలాల నుండి జుట్టు పొడవునా అప్లై చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత షాంపూతో వాష్ చేయండి.
అవిసె గింజలు, కొబ్బరి నూనెతో హెయిర్ మాస్క్:
కావలసినవి:
2 టేబుల్ స్పూన్ల- అవిసె గింజలు
1 కప్పు- నీరు
1 టేబుల్ స్పూన్ -కొబ్బరి నూనె
Also Read: నెయ్యి ఇలా వాడితే.. అమ్మాయిలే అసూయపడే అందం
తయారీ విధానం:
రసాయన ఉత్పత్తులు, కాలుష్యం కారణంగా, జుట్టు పొడిగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు కదుళ్లు కూడా బలహీనంగా మారు తాయి.ఇ లాంటి సమయంలో ఈ మాస్క్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది జుట్టు యొక్క మూలాలను బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా జుట్టు పొడిబారడాన్ని తొలగిస్తుంది. చుండ్రు సంబంధిత సమస్యలను తగ్గించి జుట్టు ఒత్తుగా చేయడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.
దీనిని తయారు చేయడానికి.. జెల్ సిద్ధమయ్యే వరకు అవిసె గింజలు, నీటిని ఒక పాత్రలో ఉడకబెట్టండి. తరువాత దానిని ఫిల్టర్ చేసి చల్లార్చి, దానికి కొబ్బరి నూనె కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు యొక్క మూలాలను మసాజ్ చేయండి. 45 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. తరచుగా ఈ హెయిర్ మాస్క్ వాడటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.