Genesis Yasmine Mohanraj: కాదేది కళకు అనర్హం.. అని కవులు చెప్పుకొనే రోజులు పోయాయి. ఇప్పుడు ఏది పడితే అది చేస్తేప్రేక్షకులు చూస్తారు. పైకి ఎత్తేస్తారు అనుకుంటే పొరపాటే. ఏది చేసినా ఎవరిని నొప్పించకుండా చేయడమే టాలెంట్. మా చేతిలో కళ ఉంది.. ఏది పడితే అది చేస్తా.. దేవుళ్లను అవమానిస్తా.. ఇష్టం వచ్చినట్లు చూపిస్తా అంటే ఎవరు చూస్తూ ఉండరు. సోషల్ మీడియా వచ్చాక ఎవరిని ఎక్కడ ఉంచాలో.. ఎవరిని ఎక్కడ తొక్కాలో నెటిజన్స్ కు బాగా తెలుసు. ముఖ్యంగా దేవుళ్లను అవమానిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది కెనడియన్ ర్యాపర్ జెనెసిస్ యాస్మిన్ మోహన్ రాజ్. ఈ మధ్య ఆమె చేసిన ఒక సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ట్రూ బ్లూ పేరుతో ఆమె ఒక సాంగ్ చేసింది. అందులో మహిళల ఆవేదనను, వారికి ఉండే కోరికలను చాలా పచ్చిగానే చెప్పింది. లిరిక్స్ ఎలా ఉన్నా.. ఆమె ఎలా పాడినా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ, ఆమె వేసుకున్న కాస్ట్యూమ్, ఆమె చేసిన పనులు మాత్రం చాలా అంటే చాలాదారుణంగా ఉన్నాయి. హిందూ, క్రిస్టియన్ మతాలను అవమానించేలా ఉన్నాయి. కాళీమాతకు ప్రతిరూపంగా ఉన్న బ్లూ కలర్ ను ఒంటి నిండా పూసుకొని ఆమె రూపాన్ని రీక్రియెట్ చేయాలనీ చూసింది. ఇక ఆ రూపంలోనే క్రిస్టియన్స్ ఎంతో పవిత్రంగా భావించే సిలువను పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించింది. నాలుకతో నాకుతూ, ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఆ సిలువను పెట్టి.. చాలా నీచంగా దేవుళ్లను అపహాస్యం చేసింది.
Kiara Advani: స్టార్ హీరోయిన్ బయోపిక్ లో కియారా.. ఎన్నా సెలక్షన్ తలైవి
ఇక ఈ ప్రదర్శనను క్రియేటివిటీ అని చెప్పుకొస్తూ యూట్యూబ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అన్ని దేశాల్లో వైరల్ గా మారింది. హిందూ, క్రిస్టియన్ మతాలనే ఆమె టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంత నీచంగా ఇలా చేయడానికి ఆమెకు సిగ్గుగా అనిపించడం లేదా అంటే అది కళ అని, క్రియేటివిటీ అని చెప్పుకొస్తుంది. అయితే అది క్రియేటివిటీ అంటే మాత్రం జనాలు ఊరుకుంటారా.. ? ట్రోల్స్ తో అమ్మడిని ఏకిపారేస్తున్నారు. వ్యూస్ కోసం లైక్స్ కోసం ఇంత నీచానికి దిగజారతారా.. ? అని కొందరు. అసలు ఇది క్రియేటివిటీనా అని ఇంకొందరు తిట్టిపోస్తున్నారు.
కళ పేరుతో దేవుళ్లను అవమానించడం ఏంటి.. ? క్రియేటివిటీ పేరుతో ఎన్నో కోట్లమంది నమ్మే దేవుళ్లను అవమానించి వారి మనోభావాలను దెబ్బతీయడం ఎంత దారుణం. అసలు ఈ ర్యాప్ లో దేవుళ్లను అస్తమించాలని నీకు ఎవరు చెప్పారు. క్రిస్టియన్, హిందూ మతాలనే ఎందుకు టార్గెట్ చేసావ్ అని నెటిజన్స్ చాలా మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ ను, ఆమెను బ్యాన్ చేయాలనీ, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దైవత్వానికి, లైంగికతను జోడించి ఏదో గొప్ప పని చేసినట్లు ఫీల్ అవుతున్న జెనెసిస్ ఇకముందు ఇలాంటి సాంగ్స్ చేయకుండా ఉండాలంటే కఠిన చర్యలు తప్పకుండా తీసుకోవాలని కోరుతున్నారు. మరి ఈ ట్రోల్స్ పై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.