BigTV English

Food For Immunity: ఇవి తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు !

Food For Immunity: ఇవి తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు !

Food For Immunity: పోషకాహారం ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి చాలా అవసరం. సరిగ్గా తినడం వల్ల మన రోగనిరోధక శక్తి బలపడటమే కాకుండా కాలానుగుణ ఇన్ఫెక్షన్ల నుండి కూడా మనల్ని మనం రక్షించుకోగలుగుతాము. రోగ నిరోధక శక్తి సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే.. మనం వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. ఇందుకోసం మీరు మీ రోజువారీ ఆహారంలో బాదం, పండ్లు , ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి. మరి రోగ నిరోధక శక్తిని పెంచే ప్రత్యేకమైన ఆహార పదార్థాలను గురించి ఇప్పడు తెలుసుకుందాం.


రుతువులు మారినప్పుడు వ్యాధులను నివారించడానికి సమతుల్య, పోషకమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన ఆహారం ఇన్ఫెక్షన్లతో పోరాడే బలాన్ని ఇస్తుంది.

ఫ్లూ, ఇతర ఆరోగ్య సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించడంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు, ఫ్రూట్స్ ఉపయోగపడతాయి.


1. బాదం :
బాదం రుచికరమైనది మాత్రమే కాదు.. పోషకాల నిధి కూడా. వీటిలో విటమిన్ ఇ, జింక్, ఫోలేట్ , ఐరన్ వంటి 15 ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. రోజూ ఒక గుప్పెడు బాదం తినడం లేదా వాటిని అల్పాహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బాదం సహజంగా రుచికరమైనది. వీటిని రోజులో ఏ సమయంలోనైనా తినవచ్చు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రకారం.. బాదం పప్పును క్రమం తప్పకుండా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే.. ఆరోగ్యంగా ఉండటానికి మీరు మీ ఆహారంలో బాదంపప్పును చేర్చుకోవచ్చు.

2. సిట్రస్ పండ్లు :

ఇవి విటమిన్ సి యొక్క సహజ మూలం. నారింజ, నిమ్మ, బత్తాయి, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో తెల్ల రక్త కణాల (WBC) ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ కణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడే ప్రధాన విధిని నిర్వహిస్తాయి. రోజూ ఒక గ్లాసు తాజా నారింజ లేదా నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. వీటిని సలాడ్, డీటాక్స్ డ్రింక్స్ లేదా స్మూతీస్ రూపంలో కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలపడుతుంది. అంతే కాకుండా ఫ్లూ వంటి వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు.

3. వెల్లుల్లి:
యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉండే వెల్లుల్లిని పురాతన కాలం నుండి ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే అల్లిసిన్ అనే మూలకం రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిలో సహజ యాంటీ బాక్టీరియల్ , యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. దీన్ని కూర, సూప్, కూరగాయలు, సాస్‌తో కలిపి తినడం వల్ల రుచి పెరుగుతుంది. అంతే కాకుండా మనం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీరు దీన్ని మీ ఆహారంలో చేర్చుకుని చిన్న చిన్న అనారోగ్యాలను కూడా నివారించుకోవచ్చు.

Also Read: ఇది ఒక్కసారి వాడినా చాలు.. హెయిర్ ఫాల్‌ కంట్రోల్ !

4. ఆకుకూరలు:
విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లకు పవర్‌హౌస్ పాలకూర, మునగ ఆకులు, ఉసిరి ఆకులు, పుదీనా వంటి ఆకుకూరలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విటమిన్ ఎ, విటమిన్ సి , ఫోలేట్ సమృద్ధిగా ఉండే ఈ కూరగాయలు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా వీటిని కూరలు, గ్రేవీలు, పప్పులు, సలాడ్లు , సూప్‌లలో కూడా కలిపి తీసుకోవచ్చు. ప్రతిరోజూ ఆకుకూరలు తినండి. శరీరానికి అవసరమైన పోషణను అందించండి.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×