E-Paper
Advertisement

అనుమతుల్లేకుండానే ధనిక్‌ భారత్‌ కళాశాల అడ్మిషన్ల దందా.. అధికారులు వార్నింగ్!

అనుమతుల్లేకుండానే ధనిక్‌ భారత్‌ కళాశాల అడ్మిషన్ల దందా.. అధికారులు వార్నింగ్!
Advertisement

Dhanik Bharat: ఇంటర్ బోర్డు అనుమతులు లేకుండానే విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ‘ధనిక్ భారత్ జూనియర్ కళాశాల’ యాజమాన్యం బరితెగింపుపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. రంగారెడ్డి జిల్లాలోని పలు కీలక ప్రాంతాల్లో ఎలాంటి అఫిలియేషన్ లేకుండానే అక్రమంగా కాలేజీలు నడుపుతూ అడ్మిషన్లు దండుకుంటున్న వ్యవహారంపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కళాశాల డైరెక్టర్ / కరస్పాండెంట్‌కు ఇటీవల వేర్వేరుగా రెండు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ తక్షణ వివరణకు ఆదేశించారు.

అక్రమ దందా..

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి నుంచి కనీస అనుమతులు గానీ, గుర్తింపు గానీ తీసుకోకుండానే ధనిక్ భారత్ యాజమాన్యం యథేచ్ఛగా తరగతులు నిర్వహిస్తోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని మాదాపూర్, మదీనాగూడ, బొంగులూరు, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను చేర్చుకుంటూ అక్రమ దందా సాగిస్తోందని ఈ-మెయిల్ ద్వారా ఆధారాలతో సహా ఫిర్యాదు అందింది. దీంతో డీఐఈవో అధికారులు కొరడా ఝుళిపించారు.

తాజా ఫిర్యాదు ఆధారంగా..

Advertisement

ధనిక్ భారత్.. అక్రమ బాగోతంపై ఈ ఏడాది జూలైలోనే అధికారులకు ఫిర్యాదు అందింది. కాగా కళాశాల యాజమాన్యానికి తొలిసారి ఇంటర్ విద్యాశాఖ అథధికారి నుంచి షోకాజ్ నోటీసు జారీ అయ్యాయి. అయితే, ఆ నోటీసును యాజమాన్యం ఏమాత్రం లెక్కచేయకుండా మౌనం దాల్చడంతో, తాజాగా మరోసారి నోటీసును పంపించారు. తాజా ఫిర్యాదు ఆధారంగా మదీనాగూడ, బొంగులూర్, మాదాపూర్ బ్రాంచ్‌ల అక్రమ నిర్వహణపై వివరణ కోరుతూ డీఐఈవో అధికారులు షోకాజ్ నోటీసును జారీ చేశారు. బోర్డు నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా కాలేజీలు నడుపుతున్నందుకు ఎందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోకూడదో తక్షణమే వివరణ ఇవ్వాలని డీఐఈఓ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. యాజమాన్యం నుంచి తక్షణ స్పందన రాకపోతే, ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: గులాబీ పార్టీలో యువ గలం అసంతృప్తి.. ఎందుకో తెలుసా..?

Tags

Related News

అధికారం కంటే ప్రజలే ముఖ్యం.. అదే రాహుల్ గాంధీ ఆశయం: మంత్రి శ్రీధర్ బాబు

మా అయ్య బీజేపీ సర్పంచ్.. ఏం చేసుకుంటావో చేసుకో- ప్రియుడి వేధింపులకు దళిత యువతి బలి!

ఏకాభిప్రాయానికి రండి.. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర జల సంఘం లేఖ..!

మద్యానికి డబ్బులివ్వలేదని భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త.. కోహీర్‌లో దారుణం!

గడ్చిరోలి గడ్డపై ఆదివాసీ కళా వైభవ జాతర.. ఉత్సవానికి సర్వం సిద్ధం!

గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభం.. వేదికపై రాహుల్, రేవంత్ రెండు కీలక హామీలు!

ద్విచక్రవాహనం ఎక్కిన రాహుల్, రేవంత్.. గిగా వర్కర్లతో కలిసి భారీ ర్యాలీ.. బైక్ వెంట పరిగెత్తిన టీపీసీసీ చీఫ్!

Big Stories

Advertisement
×