Mutton Keema Stuffed Peppers: మటన్ ఖీమాతో ఎప్పుడూ చేసే వంటకాలకు భిన్నంగా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకుంటే ఈ స్టఫ్డ్ పెప్పర్స్ రెసిపీని ట్రై చేయండి. మసాలాలతో తయారు చేసిన మటన్ ఖీమాను క్యాప్సికమ్‌లలో నింపి ఉడికిస్తే మంచి రుచికరమైన వంటకం సిద్ధమవుతుంది. మటన్ ఖీమాకు మసాలాల రుచి తోడవడంతో పాటు క్యాప్సికమ్‌తో కలిసినప్పుడు ఈ వంటకం మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఈ రెసిపీని లంచ్ లేదా డిన్నర్‌లో వేడి వేడి అన్నం, చపాతీతో కలిపి తినవచ్చు.
మటన్ ఖీమా – 250 గ్రాములు
మీడియం సైజు క్యాప్సికమ్‌లు – 4
ఉల్లిపాయలు – 2
టమోటా – 1
పచ్చిమిర్చి – 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
కారం – 1 టీస్పూన్
Also Read: ఈవెనింగ్ స్నాక్ కోసం ఈ చికెన్ పెరి పెరి పాపర్స్ ట్రై చేయండి.. ఇంటిల్లిపాదీ శభాష్ అంటారు!
ధనియాల పొడి – 1 టీస్పూన్
జీలకర్ర పొడి – అర టీస్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
పసుపు – పావు టీస్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
నూనె – 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు
ముందుగా క్యాప్సికమ్‌లను శుభ్రంగా కడిగి, పైభాగాన్ని కత్తిరించి లోపల ఉన్న గింజలను తొలగించాలి. క్యాప్సికమ్‌లు పగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మటన్ ఖీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్‌పై బాణలి పెట్టి నూనె వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
ఇప్పుడు మటన్ ఖీమా వేసి బాగా కలపాలి. పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. మధ్యస్థ మంటపై ఖీమా పూర్తిగా ఉడికే వరకు ఉంచాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోయాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
తయారైన ఖీమాను క్యాప్సికమ్‌లలో నింపాలి. ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి, ఖీమా నింపిన క్యాప్సికమ్‌లను నిలువుగా అమర్చి మూత పెట్టాలి. తక్కువ మంటపై క్యాప్సికమ్‌లు మెత్తబడే వరకు మధ్యమధ్యలో జాగ్రత్తగా తిప్పుతూ ఉడికించాలి. క్యాప్సికమ్‌లపై స్వల్పంగా గోధుమ రంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేస్తే సరి.
Also Read: స్వీట్ షాప్ టేస్ట్ గ్యారెంటీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోదగ్గ నెల్లూరు మలైకాజా రెసిపీ!