E-Paper
Advertisement

అమ్మాయిలు ప్రేమలో పడితే మొదట చేసే పని ఇదే!

అమ్మాయిలు ప్రేమలో పడితే మొదట చేసే పని ఇదే!
Advertisement

Girls In Love:ప్రేమ ..రెండు అక్షరాల మహా కావ్యం, రెండు కన్నీటి చుక్కల మహా సముద్రం అన్నాడు ఆర్యలో సుక్కు. అంత అద్భుతమైన ప్రేమలో ఒక మనిషి పడితే తెలియకుండానే చాలా మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఈ మార్పులు చిన్న చిన్న విషయాల్లో కనిపిస్తుంటాయి. మరి ఒక వ్యక్తి నచ్చడం మొదలైన తర్వాత అమ్మాయిలు వేటిపై ఫోకస్ పెడతారో ఒకసారి చూసేద్దాం!

అతని గురించి తెలుసుకోవడం మొదలు

అబ్బాయిల ప్రేమలో పడ్డ అమ్మాయిలకి మొదటగా అతని గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. అతనికి ఏ ఫుడ్ ఇష్టం, ఎలాంటి సినిమాలు చూస్తాడు, ఎలాంటి పాటలు వింటాడు, ఖాళీ సమయంలో ఏం చేస్తాడు.. ఇలా చిన్న చిన్న విషయాలను కూడా గమనిస్తుంటారు. మామూలుగా ఇవన్నీ పెద్దగా పట్టించుకోకపోయినా.. మనసుకు నచ్చిన వ్యక్తి విషయంలో మాత్రం ప్రతి విషయం ఆసక్తిగా అనిపిస్తుంది.

మాట్లాడటానికి ఏదో ఒక కారణం

Advertisement

అలాగే అతనితో మాట్లాడటానికి ఏదో ఒక కారణం వెతుక్కుంటారు. అవసరం లేకపోయినా మెసేజ్ చేయడం, ఏదైనా చిన్న విషయం అడగడం, తనకు జరిగిన విషయాలను షేర్ చేయడం లాంటివి చేస్తుంటారు. నిజానికి విషయం మాట్లాడటం కంటే.. అతనితో మాట్లాడుతూనే ఉండాలన్నదే వాళ్ళ మనసులో ఉండే కోరిక.

ఫోన్ చేతిలో ఉంటే అసలు కథే వేరు

ఇక ఫోన్ విషయానికి వస్తే అసలు కథ అక్కడే మొదలవుతుంది. అతని మెసేజ్ వచ్చిందా లేదా అని పదే పదే ఫోన్ చెక్ చేస్తుంటారు. అతను ఆన్‌లైన్‌లో ఉన్నాడా? మెసేజ్ చూసి రిప్లై ఎందుకు ఇవ్వలేదు? అని కూడా ఆలోచిస్తుంటారు. అతని నుంచి ఒక చిన్న మెసేజ్ వచ్చినా ముఖంలో తెలియకుండానే నవ్వు వచ్చేస్తుంది.

అతని చిన్న విషయాలు కూడా గుర్తుంటాయి

Advertisement

మరో విషయం ఏంటంటే.. అతను చెప్పే చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుపెట్టుకుంటారు. ఉదాహరణకు అతనికి ఏ ఫుడ్ ఇష్టం, ఏ రోజు ముఖ్యమైన పని ఉంది, ఏ విషయం అంటే అస్సలు ఇష్టం ఉండదు.. ఇలా అన్నీ గుర్తుంటాయి. ఎందుకంటే మనసుకు నచ్చిన వ్యక్తి గురించి మనసే ఆటోమేటిక్‌గా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది.

ఫ్రెండ్స్ దగ్గర అతని టాపిక్ తప్పదు

అతని గురించి తన ఫ్రెండ్స్‌తో మాట్లాడటం కూడా మొదలవుతుంది. మొదట ‘అతను మంచి ఫ్రెండ్’ అని చెబుతారు. కానీ కొంతకాలానికి ఆ ఫ్రెండ్ గురించి మాట్లాడే సమయం పెరుగుతుంది. అతను ఏం అన్నాడు, ఎలా మాట్లాడాడు, తనతో ఎలా కేర్‌గా ఉన్నాడు.. అంటూ ఫ్రెండ్స్‌కి చెప్పడం మొదలవుతుంది.

అతన్ని కలవాలంటే లుక్‌పై ఫోకస్

ఇక అతన్ని కలిసే అవకాశం వస్తే తన లుక్‌పై కూడా కాస్త ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఏ డ్రెస్ వేసుకోవాలి? జుట్టు ఎలా ఉంది? బాగున్నానా? అనే ఆలోచనలు రావచ్చు. మామూలుగా రెడీ అవ్వడానికి పది నిమిషాలు పట్టే అమ్మాయి.. అతన్ని కలవాల్సి వస్తే ఇంకాస్త ఎక్కువ టైమ్ తీసుకోవచ్చు.

అతని కేరింగ్ మాటలకు ఎక్కువ విలువ

అంతేకాదు.. అతని చిన్న చిన్న కేరింగ్ మాటలకు కూడా ఎక్కువ విలువ ఇస్తారు. ‘తిన్నావా?’ అని అడిగినా, ‘జాగ్రత్తగా వెళ్లు’ అని చెప్పినా.. ఆ మాటలు చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఎందుకంటే మాట కంటే ఆ మాట చెప్పే వ్యక్తి ముఖ్యం అవుతాడు కాబట్టి

భవిష్యత్తులో కూడా అతనే గుర్తొస్తాడు

ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. తన భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు కూడా అతను గుర్తొస్తుంటాడు. ఎక్కడికైనా వెళ్లాలి, ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ‘అతనితో అయితే బాగుంటుంది’ అనే ఆలోచన రావచ్చు. అంటే అతను తన జీవితంలో ఒక భాగంలా అనిపించడం మొదలవుతుంది.

ఇవన్నీ కనిపిస్తే ప్రేమేనా?

అయితే ఇవన్నీ కనిపిస్తే ఆ అమ్మాయి ప్రేమలో పడిందని వంద శాతం చెప్పలేం. కొంతమంది అమ్మాయిలు ఫ్రెండ్స్ విషయంలో కూడా ఇలాగే కేర్ చేస్తారు. ప్రతి ఒక్కరి స్వభావం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి కొన్ని సైన్స్ చూసి వెంటనే ప్రేమ అని ఫిక్స్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు.

కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయికి మిగతావాళ్ల కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, అతని మెసేజ్ కోసం ఎదురుచూస్తూ, అతని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ, అతని చిన్న చిన్న విషయాలను గుర్తుపెట్టుకుంటుంటే మాత్రం.. అతనిపై స్పెషల్ ఫీలింగ్ ఉండే అవకాశం ఉంది.

also read :కొత్త పెళ్లి.. రివర్స్ కాపురం.. ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమా!

చివరికి ప్రేమ మొదలయ్యేది ఇలాంటి చిన్న విషయాలతోనే!

మొత్తానికి ప్రేమలో పడినప్పుడు అమ్మాయిలు మొదట చేసే పని పెద్దగా ఏమీ ఉండదు. తమకు నచ్చిన వ్యక్తిని అర్థం చేసుకోవడం, అతనితో ఎక్కువగా మాట్లాడటం, అతని గురించి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడం. ఈ చిన్న చిన్న పనులే తర్వాత పెద్ద ప్రేమకథకు మొదటి అడుగులు అవుతాయనడంలో సందేహం లేదు!

Tags

Related News

జెన్ Z కొత్త ఫిట్‌నెస్ ట్రెండ్.. బలం, ఫిట్‌నెస్‌తోపాటు ఫన్ కూడా

బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గులకు చెక్ పెట్టే CGM సాంకేతికత.. వానకాలంలో ఎంతగానో హెల్ప్!

ఈ 5 రకాల వ్యక్తులతో స్నేహం చేస్తే మీ జీవితం నాశనమే.. ప్రశాంతంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు పాటించండి

షూ లేస్ కడుతుంటే ఊపిరి ఆడటం లేదా? మీకు ఈ ఆరోగ్య సమస్య ఉన్నట్లే

‘పెద్ద పెద్ద కలలు కనడం సరిపోదు వాటిని..’ ప్రతిరోజూ చదవాల్సిన మోటివేషనల్ కోట్స్

పురుషుల కోసం కొత్త బర్త్ కంట్రోల్ పిల్.. ఎలా పనిచేస్తుందంటే?

‘మమ్మీ స్విగ్గీలో పిజ్జా ఆర్డర్ చేయవా..’ 10 మినిట్ ఫుడ్ డెలివరీతో పిల్లల్లో చెడు అలవాట్లు

తరచూ పనీర్ తింటున్నారా? అయితే ‘అనలాగ్ పనీర్’ గురించి తప్పక తెలుసుకోండి!

Big Stories

Advertisement
×