E-Paper
Advertisement

వీడెక్కడి దొంగరా బాబు.. దొంగతనం చేసిన ఇంట్రోనే నిద్రపోయాడు!

వీడెక్కడి దొంగరా బాబు.. దొంగతనం చేసిన ఇంట్రోనే నిద్రపోయాడు!
Advertisement

Drunk Thief: ఇది కదా అసలైన ఫన్! అలసిపోయిన శరీరానికి కాస్త విశ్రాంతి అవసరమే. కానీ, ఎక్కడ నిద్రపోతున్నాం అనే టైమింగ్, లొకేషన్ చాలా ముఖ్యం కదా! మన హైదరాబాద్ కిలాడీ దొంగ అది తెలియకో లేదో మద్యం ఇచ్చిన మైకంలో పోయి.. ఏకంగా తాను చోరీ చేసిన ఇంట్లోనే హాయిగా బెడ్ సర్దుకుని పడుకున్నాడు.

ఏం జరిగింది?

Advertisement

హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న ‘వాడి-ఎ-ముస్తఫా’ ప్రాంతంలో ఈ వింత సంఘటన వెలుగుచూసింది. మామూలుగా దొంగలు ఇంట్లో దొంగతనం చేసిన వెంటనే ఎవరికీ దొరక్కుండా అక్కడి నుంచి తుర్రుమంటారు. కానీ ఈ ఘనుడు మాత్రం దానికి రివర్స్‌లో ఆలోచించాడు. ‘ఎందుకు తొందరపడటం, కాసేపు రెస్ట్ తీసుకుందాం’ అనుకున్నాడో ఏమో గానీ, పని ముగించుకుని అక్కడే హాయిగా నిద్రపోయాడు!

అసలు ట్విస్ట్ ఇదే!

Advertisement

మద్యం మత్తులో ఉన్న ఆ దొంగ, అర్ధరాత్రి కాస్త ముందుగా ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. అనుకున్నట్లే చేతికి చిక్కిన వస్తువులు, సొత్తును సురక్షితంగా మూటగట్టేశాడు. అయితే, తాగిన మద్యం తలకెక్కడంతో పాటు తెల్లవార్లూ తిరిగిన అలసట వల్ల కాసేపు విశ్రాంతి తీసుకుందామనుకున్నాడు. అంతే, ఆ ఇంట్లోని బెడ్‌పైనే పడుకుని, క్షణాల్లో గాఢ నిద్రలోకి జారుకున్నాడు.

Also Read: జంతర్ మంతర్‌లో ఇక నిరసనలు బంద్? ఢిల్లీ సర్కార్, పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు!

దొంగగారికి షాక్.. వీడియో వైరల్!

తెల్లవారేసరికి నిద్రలేచిన ఇంటి సభ్యులు, బెడ్‌పై గుర్తుతెలియని వ్యక్తి హాయిగా నిద్రపోవడం చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే చుట్టుపక్కల వారిని పిలిచి, అతడిని గట్టిగా పట్టుకున్నారు. ఇదంతా ఒకెత్తయితే, ఇంటి సభ్యులు ఆ దొంగను పట్టుకుని సరదాగా వీడియో తీస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఆ దొంగను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా నవ్వులు పూయించడమే కాక సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.

Tags

Related News

మునుగోడు పంచాయతీ సెక్రటరీలకు ఎమ్మెల్యే మాస్ వార్నింగ్!

రాజీవ్ యువ వికాసం పథకం బిగ్ అప్డేట్.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ!

హైడ్రా ప్రజావాణికి వెల్లువలా ఫిర్యాదులు.. ఒక్కరోజే ఇన్ని ఫిర్యాదులా..?

గద్వాల మున్సిపాలిటీలో రూ. 11 లక్షల గోల్‌మాల్ కలకలం!

ఐటీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరో 1000 మందికి ఉద్యోగాలు!

బహదూర్‌పల్లి బాధితులకు కేటీఆర్ భరోసా.. ప్రభుత్వంపై కీలక డిమాండ్స్!

స్థానిక ఎన్నికలే టార్గెట్.. కవిత తన మార్క్ స్కెచ్.. పార్టీ నేతలతో వరుస భేటీలు!

భార్య పేరుతో భర్త పెత్తనం.. నిజామాబాద్ జిల్లాలో అధికార దుర్వినియోగం!

Big Stories

Advertisement
×