E-Paper
Advertisement

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు ఆడ‌క‌పోతే, ఐపీఎల్ చూసేవాడే ఉండ‌డు !

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు ఆడ‌క‌పోతే, ఐపీఎల్ చూసేవాడే ఉండ‌డు !
Advertisement

Mitchell Johnson On IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (Indian Premier League tournament) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 2008 సమయంలో ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్… 19 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ కు అనేక అడ్డంకులు వచ్చినప్పటికీ.. ఏ ఒక్క సంవత్సరం కూడా ఆగలేదు. కరోనా లాంటి మహమ్మారి ఎదురు వచ్చినా, ఐపీఎల్ కు బ్రేకులు పడలేదు. ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచంలోనే అత్యున్నత మైన ఫ్రాంచైజీగా ఐపీఎల్ గెలిచింది. అయితే అలాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పై సోషల్ మీడియాలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూనే ఉంటారు. విమర్శలు చేస్తూనే ఉంటారు. ఐపీఎల్ దండగ అంటూ బాంబులు పేల్చుతూ ఉంటారు. మరికొంతమంది విదేశీ క్రికెటర్లు మాత్రం ఐపీఎల్ ను తెగ మెచ్చుకుంటారు.

మేం ఆడ‌క‌పోతే, ఐపీఎల్ ఓన‌ర్లు రోడ్డున ప‌డ‌తారు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ (Mitchell Johnson) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ తో పాటు ఆస్ట్రేలియా కు సంబంధించిన క్రికెటర్లు ఐపీఎల్ ఆడక పోతే, బీసీసీఐకి తీవ్రస్థాయిలో నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఈ రెండు దేశాల క్రికెటర్లు ఆడితేనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అందంగా కనిపిస్తుందన్నారు. ఐపీఎల్ పెరగడానికి కూడా తామే కారణమని బాంబు పేల్చారు. ఒక్క సీజన్ లో ఇంగ్లాండ్ తో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడకుండా తప్పుకుంటే, ఆ టోర్నమెంట్ చూసే వాడే ఉండబోడని హేళన చేశారు.

Advertisement

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

ఆ దెబ్బకు బిసిసిఐ కూడా రోడ్డున పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. ఇప్పటికీ ఎప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా తో పాటు ఇంగ్లాండ్ ప్లేయర్లే చాలా కీలకమన్నారు. ఈ రెండు జట్టల్లో అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు ఉన్నారని గుర్తు చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో వచ్చే ఐపిఎల్ లో ఆస్ట్రేలియా క్రికెటర్లు చాలామంది ఆడే అవకాశం లేదని తెలిపారు. అటు ఇంగ్లాండ్ క్రికెటర్లు కూడా దూరమవుతారని చెప్పారు. దీని ఎఫెక్ట్ కచ్చితంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ ఆదాయం పైన పడుతుందని వార్నింగ్ ఇచ్చారు జాన్సన్. దీంతో జాన్సన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఐపీఎల్ 2027 టోర్నమెంట్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్ ఐపిఎల్ లో వీళ్ళు ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ ఎలాగైనా గెలవాలన్న కసితో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కనిపిస్తోంది. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ప్లేయర్లకు వరుస గాయాలు అవుతున్న నేపథ్యంలో సరైన ఫలితాలు రాబట్ట లేకపోతోంది. అందుకే ఐపీఎల్ 2027 ఆడకుండా ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. 2027 వన్డే వరల్డ్ కప్ పైన కసరత్తులు చేసేలా క్రికెట్ ఆస్ట్రేలియా సన్నద్ధం అవుతోంది. నిజంగా ఇదే జరిగితే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్ 2027 కు దూరంగా ఉంటారట‌.

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

 

Tags

Related News

భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

వర్షం పడకపోయింటే, టీమిండియాను చిత్తుగా ఓడించేవాళ్లం…అజ్మల్ జద్రాన్ సంచలనం !

కోహ్లీని పొగిడి పొగిడి విసుగు వచ్చేసింది…ఇకపై పాకిస్తాన్ తలవంచి దండం పెట్టాల్సిందే

దక్షిణాఫ్రికా జట్టులో చీలిక..తన్నుకున్న తెంబా బ‌వుమా, క్వింటన్ డికాక్

బస్సు దిగుతుండగా బొక్క బోర్లా పడ్డ రోహిత్ శర్మ… పగలబడి నవ్విన విరాట్ కోహ్లీ?

టీమిండియాను వరుణుడు కాపాడాడు…లేకపోయింటే ఆఫ్ఘానిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడేది

కాళ్లు ప‌ట్టుకున్న మొహ్సిన్ నఖ్వీ.. ఛీ కొట్టిన షోయ‌బ్ అక్త‌ర్

రియాల్టీ షో మానేసి, వ‌ర‌ల్డ్ క‌ప్ పైన ఫోకస్ చెయ్..రోహిత్ పై సంజ్రేక‌ర్ సీరియ‌స్

Big Stories

Advertisement
×