BigTV English

Goat Milk Benefits: మేక పాలు.. బెనిఫిట్స్ తెలిస్తే షాక్ అవుతారు!

Goat Milk Benefits: మేక పాలు.. బెనిఫిట్స్ తెలిస్తే షాక్ అవుతారు!
goat milk
goat milk benefits

Health Benefits of Goat Milk: ఎన్నో రకాల పాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ పాలన్నీ కూడా సగం కల్తీవే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అందరూ కూడా గెదే, ఆవు పాలను వినియోగిస్తుంటారు. కానీ మీరు ఎప్పుడైనా మేకపాలు తాగారా.. ఏంటి వినడానికి కష్టంగా ఉందా? ఈ మేక పాలతో బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయట. ఇందులో పోషకాలు, మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, జింక్ మొదలై అద్భుతమైన మూలకాలు మేకపాలో ఉన్నాయి. రోగనిరోధక శక్తిని అమాంత పెంచి శరీరానికి మంచి బూస్ట్ ఇస్తాయట మేకపాలు.


మేక పాలలో కొవ్వు కణాలు ఇతర జంతువులు పాలకంటే చిన్నవిగా ఉంటాయి. కాబట్టి ఈ పాలు సులభంగా జీర్ణం అవుతాయి. అంతేకాకుండా మేక పాలలో మీడియం-గ్రేడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల శరీరానికి ఎక్కువ శక్తిని అందిస్తాయి. దీనివల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మేక పాలకు సులభంగా జీర్ణం అయ్యే లక్షణం ఉంటుంది. కాబట్టి వీటిని చిన్నపిల్లలకు కూడా ఇవ్వొచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రతి రోజూ ఒక కప్పు మేక పాలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.


Also Read: చికెన్ ఇష్టంగా కుమ్మేస్తున్నారా..? ఈ పార్ట్ తింటే మీ హెల్త్ గోవింద.. గోవిందా!

మేక పాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. బ్లడ్ ప్రెసర్‌ను కంట్రోల్ చేస్తాయి. అలానే గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి. అలానే మేక పాలు జీవక్రియకు ఏజెంట్‌గా పనిచేస్తాయి. మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యల నుంచి మేక పాలతో ఉపశమనం పొందొచ్చు.

ఓ అధ్యయనం ప్రకారం మేక పాలు ప్లేట్‌లెట్‌లను పెంచుతాయి. మలేరియా, డెంగ్యూ వ్యాధులు రాకుండా సహాయపడతాయి. చక్కెర అలెర్జీ ఉన్నవారికి మేక పాలు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మేక పాలలో ఎక్కువగా A-2 అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది అలెర్జీ, పెద్ద పేగు వ్యాధులు, చిరాకు మొదలైన అనారోగ్య సయస్యల నుంచి కాపాడుతుంది.

అంతేకాకుండా మేక పాలు వల్ల యవ్వనంగా కనిపిస్తారని పరిశోధకులు తేల్చారు. ఈ పాలు తాగడం వల్ల యంగ్‌గా కనిపిస్తారని నిర్థారించారు. ఈ పాలలో ఉండే ఫ్యాట్ మాలిక్యూల్స్ శరీరంలో హీట్‌ను తగ్గిస్తాయి. శరీరంలో వేడి కారణంగా.. ముఖంపై మచ్చలు, ముడతలు, మొటిమల వంటివి వస్తాయి. కాబట్టి మేక పాల వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Also Read: కిడ్నీలో స్టోన్స్.. లక్షణాలు ఇవే!

మేక పాలలో ఉండే సెలెనియం ఇమ్యూనిటీ పెంచుతాయి. వ్యాధుల బారిన పడకుంగా కాపాడుతుంది. అందుకే మహాత్మాగాంధీ కూడా మేక పాలకు తాగేవారు. ఆయన ఎటు వెళ్తున్న మేకలను వెంట తీసుకెళ్లేవాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Disclaimer: ఈ కథనాన్ని పలు మెడికల్ జర్నల్స్ ఆధారంగా, ఆరోగ్య నిపుణుల సలహా మేరకు రూపొందించాం. దీనిని కేవలం అవగాహనగా మాత్రమే భావించండి.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×