BigTV English

Don’t Eat Chicken Skin: చికెన్ ఇష్టంగా కుమ్మేస్తున్నారా..? స్కిన్ మరియు ఈ పార్ట్ తింటే మీ హెల్త్ గోవింద.. గోవిందా!

Don’t Eat Chicken Skin: చికెన్ ఇష్టంగా కుమ్మేస్తున్నారా..? స్కిన్ మరియు ఈ పార్ట్ తింటే మీ హెల్త్ గోవింద.. గోవిందా!
Chicken Side Effects
Chicken Side Effects

Don’t Eat Chicken Skin and this Part: మనం ఆరోగ్యంగా ఉండాలంటే శాఖాహారంతో పాటు మాంసాహారం కూడా తీసుకోవాలి. మాంసాహారం అంటే మనమందరికి ఎక్కువగా గుర్తొచ్చేది చికెన్. తక్కువ ధరకు లభిస్తుందని చికెన్‌ను ఎక్కువ మంది తింటారు. ఇది తినడానికి రుచిగా ఉండడంతో పాటు హాయిగా ఉంటుంది. అందువల్ల వీకెండ్‌లో ప్రతి ఒక్కరి ఇంట్లో చికెన్ దర్శనమిస్తుంది.


చికెన్‌తో కర్రీ మాత్రమే కాకుండా రకరకాల ఈహార పదార్థాలు చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఉండేది చికెన్ పకోడి. దీన్ని నూనెలో అలా దోరగా వేయించి.. ఒక నిమ్మకాయ పిండి, రెండు ఉల్లిపాయ ముక్కలతో కలిపి అలా నోటిలో వేసుకుంటే ఆ టేస్టే వేరు. అంతేకాకుండా చికెన్‌తో చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ మంచురియా,చికెన్ బిర్యానీ వంటి పదార్థాలను చేసుకోవచ్చు.

చికెన్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. దీన్ని కొందరు కర్రీగా తింటే.. మరికొందరు మాత్రం రకరకాల పదార్థాల ద్వారా ఆరగిస్తుంటారు. అయితే చికెన్‌లోని కొన్ని భాగాల్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తినడం వల్ల ఆనారోగ్యం బారిన పడతారు. కానీ దీన్ని అవైడ్ చేస్తే ఎటువంటి సమస్య ఉండదు. శుభ్రమైన చికెన్ తినడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయో.. అపరిశుభ్రమైనది తినడం వల్ల అంతకంటే ఎక్కువగా నష్టం ఉంటుంది.


Also Read: ఈ ఫుడ్స్ తో మీ లంగ్స్ దొబ్బేయటం ఖాయం!

చికెన్ ప్రియులు చాలామంది స్కిన్‌తో పాటుగా మాంసాన్ని తీసుకుంటారు. అయితే చికెన్‌ తీసుకునేటప్పుడు స్కిన్ లేకుండా తీసుకోవాలి. ఈ స్కిన్‌పై అనేక రకాల ఇన్ఫెక్షన్లు ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. స్కిన్‌తో పాటుగా చికెన్ కర్రిలో తినడం వల్ల గుండె సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. చికెన్ మెడ భాగం కూడా ఆరోగ్యానికి హాని చేస్తుంది. కోడి కిందభాగం కూడా లేకుండా చూసుకోవాలి.

చికెన్ బాడీపీస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చికెన్ బాడీ పార్ట్‌లో ఎటువంటి కొవ్వు ఉండదు. దీనివల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. అలానే చికెన్ తొడ భాగంలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చికెన్‌ను ప్రైడ్ కంటే గ్రిల్ చేసి తినడం మంచిది. ఫ్యాట్‌ను అవైడ్ చేసిన వారవుతారు. అందువల్ల చికెన్ ఎప్పుడు తీసుకున్నా.. బ్రెస్ట్ విభాగం ఉండేలా చూసుకోవాలి. మీరు లెగ్ పీసెస్ కూడా గ్రిల్ చేసుకొని హాయిగా తినొచ్చు.

Also Read: భోజనం తర్వాత మజ్జిగ తాగితే బోలెడు లాభాలు.. తెలిస్తే మిస్ చేయరు!

కొందరు చికెన్‌ను ఫ్రిడ్జ్‌లో ఉంచి మరుసటి రోజు ఆహారంలో తీసుకుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఏ మాంసాన్ని అయినా ఫ్రిడ్జ్‌లో ఉంచడం వల్ల అందులో ప్రోటిన్లు పోతాయి. చికెన్‌పై క్రిములు పెరుగుతాయి. మాంసం నాణ్యత దెబ్బతింటుంది. అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా చికెన్‌ను బయట హోటల్, రెస్టారెంట్లు తదితర ప్రాంతాల్లో తినకండి. ఎందుకంటే అక్కడ చికెన్ ఫ్రెష్‌గా ఉండదు.

Disclaimer: ఈ కథనాన్ని పలు మెడికల్ జర్నల్స్ ఆధారంగా ఆరోగ్య నిపుణుల సలహా మేరకు అందిస్తున్నాం. దీనిని కేవలం అవగాహనగా మాత్రమే భావించండి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×